బూర్ల రామాంజనేయులు
బూర్ల రామాంజనేయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో ప్రత్తిపాడు నుండి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1][2][3]
బూర్ల రామాంజనేయులు | |||
| |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 - ప్రస్తుతం | |||
నియోజకవర్గం | ప్రత్తిపాడు | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1 జులై 1958 ఆలూరు, ఆలూరు మండలం, కర్నూల్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | బుర్ల సోమన్న, లక్ష్మమ్మ | ||
జీవిత భాగస్వామి | జయమ్మ | ||
సంతానం | దేవి ప్రియ, రాజేష్ కుమార్క్, హరిప్రియ, మురళీధర్, సౌమ్య ప్రియ | ||
నివాసం | ఫ్లాట్ నెం.402, శ్రీనివాస హోమ్స్, వెంగళాయపాలెం, గుంటూరు రూరల్, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
జననం, విద్యాభాస్యం
మార్చుబి. రామాంజనేయులు 1958 జులై 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూల్ జిల్లా, ఆలూరు మండలం, ఆలూరులో బుర్ల సోమన్న, లక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇస్ కామర్స్, 1980 నుంచి 1982 వరకు సోషియో ఎకనామికల్ కండిషన్స్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్ ఇన్ కర్నూలు అనే అంశంపై ఎంఫిల్ (పిహెచ్ఎ) పూర్తి చేశాడు.
ఉద్యోగ జీవితం
మార్చుబి. రామాంజనేయులు 1982లో లెక్చరర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఆయన ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూనే గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలు రాశారు, అనంతపురం, తిరుపతి లైబ్రరీల్లో స్వయం శిక్షణతో చదివి 1986లో గ్రూప్-1కు ఎంపికై ఆ తరువాత 1996లో ఐఏఎస్ అధికారిగా భారత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన డిప్యూటీ కలెక్టర్, ఆర్డీఓ నల్గొండ, భూపరిపాలన అధికారి, వరంగల్ జిల్లాలో ఐఎఎస్, శ్రీకాకుళంలో డిఆర్డిఎ పీడీ, పశ్చిమ గోదావరిలో జాయింట్ కలెక్టర్, డిప్యూటీ కమిషనర్, నిజామాబాద్ కలెక్టర్,[4] గుంటూరులో కలెక్టర్, విశాఖ మున్సిపల్ కమిషనర్, ఎపి లేబర్ కమిషనర్, పిఆర్, ఆర్‌డీ, ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ ఐ అండ్ పిఆర్‌గా వివిధ హోదాల్లో పని చేశాడు.
రాజకీయ జీవితం
మార్చుబి. రామాంజనేయులు 2019లో టీడీపీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి 2019లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కోడుమూరు నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి జరదొడ్డి సుధాకర్ చేతిలో 36,045 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
మూలాలు
మార్చు- ↑ Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Prathipadu". Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.
- ↑ BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ EENADU (5 June 2024). "మాజీ కలెక్టర్లు.. ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేలు". Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.