బెక్కంటి రామాచల గుట్ట
బెక్కంటి రామాచల గుట్ట సిద్ధిపేట జిల్లా, మద్దూరు మండలం, వీర బైరాన్‌పల్లి పక్కనే ఉన్న 'బెక్కల్' ఊరిలోని గుట్ట.[1] ఈ గుట్టపై ఉన్న శ్రీ రామలింగేశ్వరస్వామి, శ్రీ మల్లికార్జునస్వామి దేవాలయాలు అతి ప్రాచీనమైనవి. ఇక్కడికి సుమారు 60కి.మీ. దూరంలోని ఓరుగల్లు రాజధానిగా పరిపాలించిన కాకతీయ చక్రవర్తులకాలంలో ఈ దేవాలయ ప్రతిష్ఠాపన జరిగింది.
చరిత్ర
మార్చుక్రీ .శ. 1117వ సం. స్వస్తిశ్రీ రాక్షసనామ సం.ర వైశాఖ శుద్ధ పాడ్యమి నాడు కాకతీయ రుద్రమదేవి శ్రీ రామలింగేశ్వరస్వామిని ప్రతిష్ఠించి, చిన్న గుడిని కట్టించారు. ఈ గుడికి శ్రీ విశ్వేశ్వరజీని పూజారిగా నియమించి, ఆయన జీవనోపాధికై వంశపారంపర్యంగా సంక్రమించేలా కొంత భూదానం ఇచ్చినట్లు దేవాలయ శాసనం ద్వారా తెలుస్తుంది.
కాకతీయ చక్రవర్తి రుద్రదేవుడికి సామంతుడిగా భద్రంగపురం కేంద్రంగా ఈ ప్రాంతాన్ని సా.శ 1163 నుండి 1195 వరకు శ్రీ మల్లిరెడ్డి పరిపాలించాడు. ఆయన కాలంలోనే శ్రీ రుద్రదేవుడు నిర్మించిన చిన్న గుడి చెక్కు చెదరకుండా గర్భాలయంలో ఉండునట్లు ఒక త్రిముఖ దేవాలయాన్ని అభివృద్ధి చేశాడు. శ్రీ మల్లిరెడ్డి పేరున మరికొంత విశాలంగా శ్రీ గుండోజి అనే శిల్పి చేత 'శ్రీ మల్లికార్జున స్వామి' దేవాలయము అద్భుతంగా నిర్మించినట్లు శ్రీ మల్లిరెడ్డి గారి వంశావళి కావ్యము రాయబడిన శాసనము ద్వారా తెలుస్తున్నది.
శ్రీ మల్లిరెడ్డి తమ పూర్వజులైన కేతన, భీరంరెడ్డి, పున్నిరెడ్డి, చందిరెడ్డి, దేవిరెడ్డి మొదలైన 21 మంది పేరున 21 శివాలయాలు ఈగుట్ట మీదనే కట్టించి, వాటిలో శివలింగ ప్రతిష్ఠాపన చేయించి, శ్రీ విశ్వేశ్వరజీ వంశానికి పూజా, నైవేద్యాలకై మరికొంత భూమిని, మామిడి తోటను దానమిచ్చినట్లు రాయబడ్డది.
దేవాలయం లోపలి గోడల మీద సురక్షితంగా భద్రపరచబడ్డ శాసనాల మీద ఉన్న లిపిని కూలంకషంగా పరిశోధిస్తే మరింత విలువైన సమాచారం దొరికే అవకాశం ఉంది.
ఈ క్షేత్రానికి 2017 సం.వ.నికి 900 సం.లు నిండుతాయి.
చిత్రమాలిక
మార్చు-
బెక్కంటి రామాచల గుట్టపైకి దారి
-
ఇతర గుడులు
-
గుట్ట పై ప్రాంతం
-
గర్భగుడి ప్రాంతం
-
శిలాఫలకంపై లిపి
-
Bekkanti Ramachala Gutta 02.jpg