బెరీలియం హైడ్రాక్సైడ్
బెరీలియం హైడ్రాక్సైడ్ ఒక అకర్బన రసాయన సంయోగపదార్ధం. బెరీలియం, హైడ్రాక్సైడ్ సంయోగం వలన ఈ రసాయన సంయోగపదార్ధం ఏర్పడినది.ఇది బెరీలియం, హైడ్రోజన్, ఆక్సిజన్ మూలకాల సమ్మేళనఫలితంగా ఏర్పడిన సంయోగపదార్ధం. బెరీలియం హైడ్రాక్సైడ్ ఒక ద్విశ్వభావయుత (amphoteric) హైడ్రాక్సైడ్ అనగా ఇది ఆమ్లాలలో, క్షారాలలో కరుగును.
పేర్లు | |
---|---|
IUPAC నామము
Beryllium hydroxide
| |
ఇతర పేర్లు
Hydrated beryllia
| |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [13327-32-7] |
పబ్ కెమ్ | 25879 |
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 236-368-6 |
వైద్య విషయ శీర్షిక | Beryllium+hydroxide |
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:35102 |
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | DS3150000 |
SMILES | O[Be]O |
| |
జి.మెలిన్ సూచిక | 1024 |
ధర్మములు | |
BeH2O2 | |
మోలార్ ద్రవ్యరాశి | 43.03 g·mol−1 |
స్వరూపం | Vivid white, opaque crystals |
సాంద్రత | 1.92 g cm−3[1] |
ద్రవీభవన స్థానం | 1,000 °C (1,830 °F; 1,270 K) (decomposes) |
slightly soluble | |
నిర్మాణం | |
Linear | |
ఉష్ణగతిక రసాయన శాస్త్రము | |
నిర్మాణము మారుటకు కావాల్సిన ప్రామాణిక ఎంథ్రఫీ ΔfH |
-904 kJ mol−1[2] |
ప్రామాణిక మోలార్ ఇంథ్రఫీ S |
47 J·mol−1·K−1[2] |
విశిష్టోష్ణ సామర్థ్యం, C | 1.443 J K−1 |
ప్రమాదాలు | |
ప్రధానమైన ప్రమాదాలు | Carcinogenic |
Lethal dose or concentration (LD, LC): | |
LD50 (median dose)
|
4 mg kg−1 (intravenous, rat) |
US health exposure limits (NIOSH): | |
PEL (Permissible)
|
TWA 0.002 mg/m3 C 0.005 mg/m3 (30 minutes), with a maximum peak of 0.025 mg/m3 (as Be) |
REL (Recommended)
|
Ca C 0.0005 mg/m3 (as Be) |
IDLH (Immediate danger)
|
Ca [4 mg/m3 (as Be)] |
సంబంధిత సమ్మేళనాలు | |
సంబంధిత సమ్మేళనాలు
|
Aluminium oxide |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
బెరీలియం ఖనిజాలైన బెరిల్ (beryl), బెట్రాండైట్ (bertrandite) లనుండి బెరీలియం లోహాన్ని తయారు చేయునపుడు బెరీలియం హైడ్రాక్సైడ్ ఉపఉత్పత్తిగా లభిస్తున్నది. బెరిలీయం లవణద్రవణాలకు క్షారాలను చేర్చిన α-రూపం (జెల్) ఏర్పడును. ఇలా ఏర్పడిన పదార్థాన్ని అలాగే ఉంచిన లేదా మరిగించిన రోమ్బిక్ β-రూపం అవక్షేపంగా ఏర్పడును బెరీలియం హైడ్రాక్సైడ్ యొక్క అణుసౌష్టవం చతుస్కోణ బెరిలీయం కేంద్రాలను కలిగి జింక్ హైడ్రాక్సైడ్ అణుసౌష్టవ పోలిక కలిగి ఉంది. బెరీలియం హైడ్రాక్సైడ్ రసాయన సంకేతపదంBe (OH) 2
భౌతిక ధర్మాలు
మార్చుబెరీలియం హైడ్రాక్సైడ్ తెల్లని స్పటికపదార్ధం.బెరీలియం హైడ్రాక్సైడ్ అణుభారం 43.03 గ్రాములు/మోల్.సాధారణ గది ఉష్ణోగ్రత,25°C వద్ద బెరీలియం హైడ్రాక్సైడ్ సాంద్రత 1.92 గ్రాములు/సెం.మీ3.బెరీలియం హైడ్రాక్సైడ్ బాష్పీభవన స్థానం 1,000 °C (1,830 °F; 1,270 K, కాని ఈ ఉష్ణోగ్రత వద్ద ఇది వియోగం చెందును. నీటిలో స్వల్పంగా కరుగును.
రసాయన చర్యలు
మార్చుక్షారాలలో బెరీలియం హైడ్రాక్సైడ్ కరగడం వలన టెట్రాహైడ్రాక్సీడోబెరిలేట్ (2-) అనయాన్ ఏర్పడును.సోడియం హైడ్రాక్సైడ్ తో చర్యఫలితం:
- 2NaOH(aq) + Be(OH)2(s) → Na2Be(OH)4(aq)
ఆమ్లాలలో బెరీలియం హైడ్రాక్సైడ్ ను కరిగించిన బెరిలీయం లవణాలు ఏర్పడును.ఉదాహరణకు సల్ఫ్యూరిక్ ఆమ్లంతో బెరీలియం సల్ఫేట్ ఏర్పడును.
- Be(OH)2 + H2SO4 → BeSO4 + 2H2O
400°C వద్ద బెరీలియం హైడ్రాక్సైడ్ నిర్జలీకరణ (dehydrate) చెందడం వలన కరుగు (soluble) గుణమున్న తెల్లని పొడి వంటి బెరిలీయం ఆక్సైడ్ ఏర్పడును.
- Be(OH)2 → BeO + H2O
ఇలాఏర్పడిన ఈ రసాయనపదార్థాన్ని మరింత ఎక్కువ ఉష్ణోగ్రతకు వేడిచేసిన కరుగని (insoluble) గుణమున్న బెరిలీయం ఆక్సైడ్ ఏర్పడును.
భద్రత
మార్చుమిగతా బెరిలీయం సంయోగపదార్థాలవలె బెరీలియం హైడ్రాక్సైడ్ కూడా విషకారి.క్యాన్సర్ కారక గుణం కలిగిఉన్నది.
ఇవికూడాచూడండి
మార్చుమూలాలు/ఆధారాలు
మార్చు- ↑ Pradyot Patnaik. Handbook of Inorganic Chemicals. McGraw-Hill, 2002, ISBN 0-07-049439-8
- ↑ 2.0 2.1 Zumdahl, Steven S. (2009). Chemical Principles 6th Ed. Houghton Mifflin Company. ISBN 0-618-94690-X.