బెల్లంకొండ కోట,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,గుంటూరు జిల్లా, బెల్లంకొండ మండలం, బెల్లంకొండ గ్రామంలోని పర్యాటక ప్రదేశం.

కొండవీటి రెడ్డి రాజులు నిర్మించిన బెల్లంకొండ కోట -1788 ప్రాంతపు దృశ్యం

ఇది గుంటూరు-పొందుగల రహదారి పక్కన సత్తెనపల్లికి 19 కి మీల దూరంలో బెల్లంకొండలో ఉంది. బెల్లంకొండ రైల్వే స్టేషను గుంటూరు - మాచర్ల రైలు మార్గంలో ఉంది. వెలమ దొరలైన మల్రాజు వంశస్తులు బెల్లంకొండ రాజ్యాన్ని పాలించారు.కొండవీటి రెడ్డి రాజులు నిర్మించిన కోట ఇక్కడి ఆకర్షణ. దుర్గంలోని ముఖ్యమైన స్థలాలను కలుపుతూ ఒకే రాతిలో కట్టిన గోడ, వాయవ్యంలోను, నైరుతిలోను నిర్మించిన బురుజులు కోటలోని ముఖ్య కట్టడాలు.1511 లో శ్రీ కృష్ణదేవ రాయలు అప్పటివరకు గజపతుల ఆధీనంలో ఉన్న బెల్లంకొండ దుర్గంను స్వాధీనం చేసుకున్నాడు.విజయనగర సామ్రాజ్యం పతనమయ్యేవరకు బెల్లంకొండ రాయల పాలనలోనే ఉంది.[1]

మూలాలుసవరించు

  1. "visit forts and palaces in andhra pradesh and telangana - Telugu Nativeplanet". web.archive.org. 2019-09-21. Retrieved 2019-09-21.

వెలుపలి లంకెలుసవరించు