బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు

పండితులు మరియు కవి
(బెల్లంకొండ రామరాయకవి నుండి దారిమార్పు చెందింది)

బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు ప్రముఖ పండితులు, కవి శిఖామణి. ఇతడు గుంటూరు జిల్లా నరసారావుపేట సమీపంలోని పమిడిపాడు గ్రామంలో యువ నామ సంవత్సరం మార్గశిర అమావాస్య నాడు (డిసెంబరు 28, 1875) జన్మించారు. వీరి 39 సంవత్సరాల జీవితంలో సుమారు 143 గ్రంథములను రచించారు. వానిలో అష్టకములు, స్తుతులు, అష్టోత్తర శతనామ స్తోత్రములు, సహస్రనామ స్తోత్రములు, గద్య స్తోత్రములు, దండకములు, శతకములు, కావ్యములు, వ్యాఖ్యాన, వ్యాకరణ, వేదాంత గ్రంథములు మొదలైన అనేక వాజ్మయ ప్రక్రియలు చోటుచేసుకున్నాయి.

బెల్లంకొండ సుబ్బారావు
Ballam konda ramarao.jpg
బెల్లంకొండ రామరాయ కవీంద్రులు
జననంబెల్లంకొండ రామారావు
1875, డిసెంబరు 28
గుంటూరు జిల్లా పమిడిపాడు
మరణం1914, అక్టోబరు 27
ప్రసిద్ధిప్రఖ్యాత కవి

రచనలుసవరించు

 • చంపూ భాగవతం
 • శ్రీ హయగ్రీవ నవరత్న స్తుతి
 • వివర్ణాది విష్ణు సహస్రనామ స్తోత్రము
 • సిద్ధాంత సింధువు
 • భాష్యార్క ప్రకాశిక
 • శరీరక చతుస్సూత్రీ విచారము
 • వేదాంత ముక్తావళి
 • శంకరాశంకర భాష్య విమర్శనము
 • శరద్రాత్రి
 • శ్రీ రమావల్లభరాయ శతకము
 • వేదాంత కౌస్తుభం (1918)
 • రుక్మిణీ పరిణయము
 • గరుడ సందేశము
 • హయగ్రీవ శతకము
 • కందర్ప విలాసము
 • కృష్ణలీలా తరంగిణి

మరణంసవరించు

వీరు అక్టోబరు 27 1914 సంవత్సరానికి సరియైన ప్రమాది నామ సంవత్సర కార్తీక శుద్ధ నవమినాడు పరమపదించారు.

మూలాలుసవరించు

 • బెల్లంకొండ రామరాయకవీంద్రుడు, రావి మోహనరావు, 150 వసంతాల వావిళ్ల వాజ్మయ వైజయంతి, పేజీలు 386-89.
 • బెల్లంకొండ రామరాయకవీంద్రుడు, ఒక గుంటూరు మండల వాసి, ఆంధ్రపత్రిక ఉగాది సంచిక, 1914, పేజీలు 177-179.

బయటి లింకులుసవరించు