బేతంచర్ల
ఆంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లా జనగణన పట్టణం
(బేతంచెర్ల నుండి దారిమార్పు చెందింది)
బేతంచెర్ల, ఆంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం లోని జనగణన పట్టణం. అదే పేరుగల మండలానికి ఇది కేంద్రం.
పట్టణం | |
Coordinates: 15°28′00″N 78°10′00″E / 15.4667°N 78.1667°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | నంద్యాల జిల్లా |
మండలం | బేతంచెర్ల మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 25.75 కి.మీ2 (9.94 చ. మై) |
జనాభా (2011)[1] | |
• మొత్తం | 38,994 |
• జనసాంద్రత | 1,500/కి.మీ2 (3,900/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1008 |
ప్రాంతపు కోడ్ | +91 ( 85175 ) |
పిన్(PIN) | 518599 |
Website |
భౌగోళికం
మార్చుజిల్లా కేంద్రమైన నంద్యాల కు పశ్చిమంగా 47 కి.మీ దూరంలో వుంది.ఈ ప్రాంతం రాష్ట్ర రాజదానైన అమరావతికి 373 కి.మీ దూరంలో వుంది.హైదరాబద్ కు 273 కి.మీ దూరంలో వుంది. ఈ ప్రాంతం తిరుపతి కు 312 కి.మీ దూరంలో వుంది.
జనగణన గణాంకాలు
మార్చు2011 జనగణన ప్రకారం పట్టణ జనాభా 38,994.
పరిపాలన
మార్చుబేతంచర్ల నగరపంచాయతీ పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.ఈ పట్టణం శ్రీ బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి గారిచె అబివృధ్ధి చెందినది.
త్రాగునీటి సౌకర్యాలు
మార్చుఈ పట్టణoలో త్రాగునీటి ఎద్దడి నివారించుటకై, డి.ఎం.ఎఫ్., పంచాయతీ పథకం క్రింద,15 లక్షల రూపాయల వ్యయంతో, ఐదు చోట్ల నిర్మించిన త్రాగునీటి మినీ ట్యాంకులను, 2020,అక్టోబరు-12న ప్రారంభించినారు.[2]
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చు- శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, రంగాపురం: శివుడు వర్ణించిన విధంగా ఎర్రమల కొండలలో నెలకొని భక్తులను విశేషంగా ఆకర్షించుచున్నది. మద్ది అనే భక్తుడికీ, మహాసాధ్వి చిన్నమ్మకూ స్వామి మోక్షం ప్రసాదించిన పవిత్ర స్థలంగా పేరెన్నిక గన్నది.
- పుట్ట పెద్దమ్మ ఆలయం: బేతంచర్ల పట్టణ శివారులోని బనగానిపల్లె రహదారి సమీపంలో వెలసిన ఈ ప్రార్ధనా స్థలం
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
- ↑ ఈనాడు కర్నూలు జిల్లా;2020,అక్టోబరు-13,5వపేజీ.