Shakthi Brahmins ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాలో 10 వ కులం. ఈ కులస్థులు మాదిగల పౌరోహిత్యం,మైసమ్మ మారెమ్మలను మేల్కొల్పటం చేస్తుంటారు.బవనీలను మహారాష్టల్రో వాజ్య మురళీలు అంటారు.బైనీడుచెప్పే వారిని బవనీలు, బైనీడి వారనీ, బఈండ్ల బైండ్లు, పంబల, జముకు,కొమ్మువారు, ఆసాదులు అనికూడా అంటారు.ఈ బైండ్ల వారు మాదిగలకు పూజారులు.కాకతీయ చకరవర్తుల కాలంలో వీర శైవ మతస్థులకు వినోదాన్ని కల్పించేవారు.మాతంగి కొలుపులు చేసేది కూడా వీరే.బైండ్లవారు ఉపయోగించే వాయిద్యం జమిడిక,జిమిలిక, జముకు.సమిడికయే, జముకు.కొన్ని ప్రాంతాలలో దీన్ని పంబ అంటారు కాబట్టి వీళ్ళను పంబలివాళ్ళుగాకూడా పేర్కొంటారు.కథకుడు మధ్యలో వుండి కథాగానం చేస్తూ వుంటే ప్రక్కన నున్న వంతలు జిమిడికల్ని వాయిస్తూ వుంటారు.ఈ జమిడికలు కొన్ని ఇత్తడితోనూ, మరికొన్ని కర్రతోనూ తయారు చేసుకుంటారు. జమిడిక వాయిద్యం నేటి జముకుల నాదం లాంటిదే. జుకజుం జుకజుం అని నినాదాన్నిస్తాయి.బైండ్ల వారు తెలంగాణాలో ఉత్తరాంధ్రలో జముకులవారు ప్రాముఖ్యం వహిస్తున్నారు. రేణుకా, ఎల్లమ్మ ,గంగాణమ్మ, పోలేరమ్మ, మారెమ్మ,ఎర్ర మారెమ్మ, మహాలక్ష్మమ్మ, మహంకాళమ్మ,మొదలైన దేవతలను కొలుస్తారు. ఆ దేవతల పుట్టు పూర్వోత్తరాలను కథా గానం చేసే పూజారులుగా వుండేవారు. మాదిగల ఏకైక కథా కళారూపం బైండ్ల కథ అని ,బైండ్ల వారికి అక్షరజ్ఞానం లేకపోవడంతో వారి మహత్తర కళారూపాన్ని అక్షరబద్దం చేయలేకపోయారనీ ప్రజాగాయకుడు గద్దర్ చెప్పారు.బోనాల ప్రకాష్ రచించిన ‘బైండ్ల కథ’ పుస్తకాన్ని బైండ్ల కళాకారుడు లక్ష్మణ్ ఆవిష్కరించారు.జయధీర్ తిరుమల్ రావు రేణుకా ఎల్లమ్మ దేవత కథను చెప్పుకునే విధానమే బైండ్ల కథారూపమన్నారు. ఆరు రాష్ట్రాల్లో బైండ్ల కళారూపాలు సజీవంగా ఉన్నాయని చెప్పారు.బవనీలు చెప్పే ఆరుకథలు రేణుకాయుద్ధం, ఎల్లమ్మకథ,మలిసెట్టి రాయబారం, శక్తికళ్యాణం,మాంధాత కథ, మాత పురాణం ఎల్లమ్మకథాచరిత్ర . కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిషా ప్రాంతాలలో కూడా తెలుగు బవనీల సంప్రదాయం కొనసాగుతున్నది. బవనీలు ప్రాథమికంగా పూజారులు. ప్రతి పూజలో వినిపించే లయాన్విత ధ్వనే సంగీతం. బైండ్లవారు మోగించే జమిడికె అస్పృశ్యత,అంటరానితనం కారణాలతో వేరేవారెవ్వరు తాకరు.బైండ్ల ప్రదర్శన సాత్వికం కాదు. అది వీరోచితంగా ఉంటుంది. బైండ్ల కళాకారుల్ని మాంత్రికులవలె జనం భావిస్తారు. వారికి మంత్రతంత్ర విద్య తెలుసుననే అపోహ ఉంది.జోగినిలను చేసే పూజారులు బైండ్లవారే. వీరు శాస్త్రోక్తంగా, జానపద కర్మకాండలని జరిపి తంతు పూర్తిచేస్తారు. జోగిని వ్యవస్థ వద్దని ‘అంకురం’, ‘బీజం ’ వంటి సంస్థలు వెలిశాయి కానీ జోగిని వ్యవస్థ ఇంకా జోగుతూనే ఉంది.పంబ, జమిడిక మోగుతూనే ఉన్నాయి.జోగిని కావడానికి పేదరికం, పితృస్వామ్యం,లైంగిక దోపిడి కారణం.బైండ్లవారే ఈ పద్ధతిని నిర్మూలించడానికి ముందుకు రావాలని కోరుతూ శ్రీకాకుళం గిరిజనోద్యమంలో సుబ్బారావు పాణిగ్రాహి జమిడకను చేబూని విప్లవ గీతాలు ఆలపించాడు. బైండ్ల కథకులకి, మరాఠీ బవనీలకు కొంత పొంతన కలుస్తుంది. బవనికలు వాయించువారు.నిజామాబాద్ జిల్లాలోని లింగంపేట మండలంలో వీరు ఎక్కువగా కనిపిస్తారు

ప్రముఖులు మార్చు

కడియం శ్రీహరి గారు తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి .

గంటా చక్రపాణి గారు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మెన్

డాక్టర్ జిలుకర శ్రీనివాస్.. రచయిత, కవి, విమర్శకులు, VCK తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు.

జిలుకర వెంకన్న, కవి, రచయిత పట్టభద్ర రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు

- జిలుకర వెంకటయ్య, పోలీస్ పటేల్, కమ్యూనిస్ట్ లీడర్ (సీపీఎం)

బొట్టు ఎల్లయ్య జానపద బ్రహ్మ, శతాధిక బొడ్రాయి ప్రతిష్టాపరులు


కళాకారులు: -బొట్టు సోమనాధం శాతపురం పాలకుర్తి జనగామ - జిలుకర సోమలింగయ్య (పెద్ద) మల్లంపల్లి (గ్రామం) పాలకుర్తి (మండలం) జనగామ (జిల్లా)

- జిలుకర సోమలింగయ్య (చిన్న), మల్లంపల్లి (గ్రామం) పాలకుర్తి (మండలం) జనగామ (జిల్లా)

చినపాక అచ్చమ్మ ,మొట్ట మొదటి బైండ్ల అంగన్ వాడి టీచర్. వనం మంగమ్మ , అంగన్వావాడి టీచర్

మూలాలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=బైండ్ల&oldid=4176600" నుండి వెలికితీశారు