భైంసా రెవెన్యూ డివిజను
భైంసా రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. నిర్మల్ జిల్లాలోవున్న రెండు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 7 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం భైంసాలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవెన్యూ డివిజను ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గంలోని, ముధోల్ శాసనసభ నియోజకవర్గాల పరిధిలో భాగంగా ఉంది.
భైంసా రెవెన్యూ డివిజను | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నిర్మల్ |
వివరాలు
మార్చుఐఏఎస్ క్యాడర్లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[3]
పరిపాలన
మార్చుబైంసా డివిజనులోని మండలాలు:[4]
క్ర.సం | బైంసా రెవెన్యూ డివిజను | మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య |
---|---|---|
1 | కుబీర్ మండలం | 38 రెవెన్యూ గ్రామాలు |
2 | కుంటాల మండలం | 16 రెవెన్యూ గ్రామాలు |
3 | బైంసా మండలం | 34 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం) |
4 | ముధోల్ మండలం | 24 రెవెన్యూ గ్రామాలు (6 నిర్జన గ్రామాలు) |
5 | బాసర మండలం | 17 రెవెన్యూ గ్రామాలు (2 నిర్జన గ్రామాలు) |
6 | లోకేశ్వరం మండలం | 31 రెవెన్యూ గ్రామాలు (5 నిర్జన గ్రామాలు) |
7 | తానూర్ మండలం | 33 రెవెన్యూ గ్రామాలు (2 నిర్జన గ్రామాలు) |
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-03-02.
- ↑ "REVENUE DIVISIONS | Nirmal District | India". www.nirmal.telangana.gov.in. Archived from the original on 2022-01-31. Retrieved 2022-03-02.
- ↑ "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2022-03-02.