బొగ్గం జయమ్మ ఆదివాసీ రైతు.[1] ఈవిడ 2018 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[2][3][4]

బొగ్గం జయమ్మ
జాతీయతభారతీయురాలు
వృత్తిఆదివాసీ రైతు
బంధువులునర్సింహారావు (భర్త)

నివాసం

మార్చు

జయమ్మ తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండలం, జగన్నాథపురం గ్రామంలో నివసిస్తుంది.[5]

వ్యవసాయరంగం

మార్చు

జయమ్మ దంపతులకున్న రెండు ఎకరాలు సేద్యానికి అనువుగా లేని ఎగుడు దిగుడు వర్రెలు, వంకలు, ముళ్ల చెట్లతో నిండివుండేది. అంతేకాకుండా, అది వర్షాభావ ప్రాంతం. అలాంటి కరవు నేలను చదును చేసుకునే స్తోమతలేక వారు కూలీ పని చేసుకుంటూ ఉండేవారు. ఎలాగైనా తమ బంజరు భూమిని సాగులోకి తెచ్చే అవకాశాల కోసం చేసిన ప్రయత్నంలో వారికి 2015 ఏప్రిల్‌లో డ్వామా ద్వారా ఉపాధిహామీ పథకంలో నిధులు మంజూరయ్యాయి. ఆ నిధులతో రెండెకరాల భూమిని కుటుంబం, ఉపాధి కూలీలతో కలిసి చదును చేసి ఎత్తు, పల్లాలుగా ఉన్న మట్టి దిబ్బలను తవ్వి ఎగువ ప్రాంతంలోని మట్టిని దిగువ ప్రాంతంలో వేయడం ద్వారా భూమిని సాగుకు అనువుగా మార్చారు.

అంతేకాకుండా, సాగునీటికోసం తన భూమిలోనే చిన్ననీటి కుంటను తవ్వుకుని వాన నీటిని నిలువ చేసి, భూమిలో తేమను పెంచారు. అర ఎకరాలో వరి పండించి సుమారు 15 బస్తాల దిగుబడి సాధించడంతోపాటూ, మిగిలిన ఒకటిన్నరెకరాల్లో జామాయిల్ తోటను పెంచుతున్నారు. గతంలో కేవలం దినసరికూలీగా బతికిన ఈ దంపతులు పట్టుదలతో కష్టించి తమ బీడుభూమిని సాగు భూమిగా మార్చుకుని రైతులుగా మారారు. ఇద్దరు పిల్లలను చదివించుకుంటూ సుస్థిర ఆదాయం పొందుతున్నారు.

గుర్తింపులు

మార్చు
  1. జయమ్మ విజయ గాథ పేరిట డ్యాకుమెంటరీ రూపకల్పన
  2. జయమ్మ విజయగాథను తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయ విద్యార్థులకు కేస్‌ స్టడీగా ఎంపిక[6]

బహుమతులు - పురస్కారాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. మనతెలంగాణ (4 March 2018). "పుడమి ప్రియ పుత్రికలు". Retrieved 11 March 2018.[permanent dead link]
  2. నమస్తే తెలంగాణ (6 March 2018). "20 మంది మహిళలకు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు". Retrieved 11 March 2018.[permanent dead link]
  3. ఆంధ్రజ్యోతి (6 March 2018). "మహిళా దినోత్సవం సందర్భంగా.. 20 మంది మహిళలకు అవార్డులు". Retrieved 11 March 2018.[permanent dead link]
  4. ఈనాడు (6 March 2018). "మహిళామణులకు తెలంగాణ ప్రభుత్వ అవార్డులు". Archived from the original on 11 మార్చి 2018. Retrieved 11 March 2018.
  5. నమస్తే తెలంగాణ, జిందగీ న్యూస్ (7 March 2018). "జయహో మహిళ!". Retrieved 11 March 2018.
  6. రూలర్ మీడియా. "జయమ్మ జీవితం పై విద్యార్థుల అధ్యయనం". www.ruralmedia.in. శ్యాంమోహన్. Archived from the original on 14 మార్చి 2018. Retrieved 11 March 2018.
  7. Telangana Today (8 March 2018). "Telangana govt felicitates women achievers". Retrieved 9 March 2018.