తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాలు-2018
తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం తెలంగాణ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతీ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఆయా రంగాల్లో రాణించిన మహిళలకు అందజేసే పురస్కారం.[1] గౌరమ్మను గంగలో పూజించే బతుకమ్మ సాక్షిగా.. దుర్గమ్మను నైవేద్యంతో పూజించే బోనం సాక్షిగా.. స్త్రీలను గౌరవించుకోవడం, సత్కరించుకోవడం తెలంగాణ రాష్ట్ర సంప్రాదాయం. స్వతంత్ర భారతంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతీ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఆయా రంగాల్లో రాణించిన మహిళలకు ప్రత్యేక పురస్కారాలు అందజేస్తుంది.[2]
2018 పురస్కారాల్లో భాగంగా వివిధ రంగాల్లో సత్తా చాటుతున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రతిభామూర్తుల్లో 17 కేటగిరీలకుగాను 20 మందిని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ మహిళలుగా ఎంపిక చేసింది.[3][4][5] వీరికి 2018, మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున హైదరాబాద్ లోని లలిత కళా తోరణంలో లక్ష రూపాయల నగదు పురస్కారంతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా, శిశుసంక్షేమశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, నిజామాబాద్ ఎం.పి కల్వకుంట్ల కవిత, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్ష్యుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎస్.సి కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి లతో పాటు ప్రభుత్వ సలహాదారులు కె.వి. రమణాచారి, దేశపతి శ్రీనివాస్, సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మహిళా సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి ఎం జగదీశ్, డైరెక్టర్ విజయేంద్ర బోయి, సాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, మహిళా కార్పొరేషన్ డైరెక్టర్ నిర్మల, రంగారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్ ప సునీతా మహేందర్‌రెడ్డి, ఖమ్మం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ కవిత, వరంగల్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జి. పద్మ, బీసీ కార్పొరేషన్ చైర్మన్ బి.ఎస్.రాములు, నగర మేయర్ సతీమణి బొంతు శ్రీదేవి తదితరులు పాల్గొని పురస్కారాలు అందజేశారు.[6][7]
పురస్కార గ్రహీతలు
మార్చుక్రమసంఖ్య | పేరు | స్వస్థలం | రంగం | ఇతర వివరాలు | చిత్రమాలిక | |
---|---|---|---|---|---|---|
1 | కవిత దరియాని | విద్య | వీసీ - జవహర్ లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ కళాశాల | |||
2 | బుద్ధా అరుణా రెడ్డి | హైద్రాబాదు | క్రీడారంగం | ప్రపంచ జిమ్నాస్టిక్స్ లో కాంస్య పతకం విజేత [8][9] | ||
3 | డాక్టర్ సత్యలక్ష్మి కొమర్రాజు | వైద్యం | సంచాలకులు - జాతీయ ప్రకృతి వైద్య సంస్థ, పుణె[10] | |||
4 | చక్రవర్తుల లక్ష్మీనర్సమ్మ | సాహిత్యం | పద్యకవిత్వం, అభినవ మొల్ల | |||
5 | డాక్టర్ సిరి | సాహిత్యం | బాలసాహిత్యం కోసం కృషి | |||
6 | మంజులా శ్రీనివాస్ | నృత్యం | శాస్త్రీయ నృత్యం | |||
7 | నిత్య సంతోషిణి | హైదరాబాద్ | సంగీతం | శాస్త్రీయ సంగీతం, నేపథ్య గాయని | ||
8 | కవితా దేవుస్కర్ | చిత్రలేఖనం | చిత్రలేఖనంలో ప్రతిభ | |||
9 | నందినీ రెడ్డి | హైదరాబాద్ | సినిమా | చిత్రనిర్మాణం, దర్శకత్వం | ||
10 | అంతడుపుల ఝాన్సీ | మానకొండూరు | జానపద సంగీతం | జానపద సంగీతంలో ప్రతిభ | ||
11 | ఈదునూరి పద్మ | రామగుండం, పెద్దపల్లి జిల్లా | ఉద్యమ గానం | తెలంగాణ ఉద్యమ గానం | ||
12 | రాజ్యలక్ష్మి | ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు | వడ్డెర కూలీలకు ఉపాధి అవకాశాలు | |||
13 | లతాజైన్ | జర్నలిజం | మహిళ సమస్యలపై కథనాలు | |||
14 | సౌమ్య నాగపురి | వరంగల్ | జర్నలిజం | పలు సామాజిక అంశాలపై కథనాలు | ||
15 | సుప్రియ సనం | ప్రొఫెషనల్ సేవలు | హైదరాబాద్ మెట్రో రైలు తొలి మహిళా డ్రైవర్ | |||
16 | సరిత | ప్రొఫెషనల్ సేవలు | ఢిల్లీ ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్ | |||
17 | యాప భద్రమ్మ | మహిళా సాధికారత | మహిళా సంఘాలను ప్రోత్సహించారు | |||
18 | బొగ్గం జయమ్మ | వ్యవసాయం | అధునాతన వ్యవసాయం | |||
19 | ఇనుకొండ శైలజ | కొత్తపల్లి, తిమ్మాపూర్ మండలం, కరీంనగర్ జిల్లా | ప్రజా ప్రాతినిథ్యం | సర్పంచి కొత్తపల్లి గ్రామం - గ్రామాభివృద్ధికి కృషి | ||
20 | గండ్ర రమాదేవి | రాయికల్, జగిత్యాల జిల్లా | సామాజిక సేవ | సమస్యల్లో ఉన్న మహిళలకు సాయం[11] |
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ నమస్తే తెలంగాణ. "ప్రతిభకు పురస్కారం!". Retrieved 6 March 2018.
- ↑ నమస్తే తెలంగాణ, జిందగీ (7 March 2018). "యత్ర నార్యస్తు పూజ్యంతే." Retrieved 8 March 2018.
- ↑ నమస్తే తెలంగాణ (6 March 2018). "20 మంది మహిళలకు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు". Retrieved 6 March 2018.[permanent dead link]
- ↑ ఆంధ్రజ్యోతి (6 March 2018). "మహిళా దినోత్సవం సందర్భంగా.. 20 మంది మహిళలకు అవార్డులు". Retrieved 6 March 2018.[permanent dead link]
- ↑ ఈనాడు (6 March 2018). "మహిళామణులకు తెలంగాణ ప్రభుత్వ అవార్డులు". Archived from the original on 6 మార్చి 2018. Retrieved 6 March 2018.
{{cite news}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ నమస్తే తెలంగాణ (9 March 2018). "రిజర్వేషన్లతోనే మహిళలకు న్యాయం". Retrieved 9 March 2018.[permanent dead link]
- ↑ Telangana Today (8 March 2018). "Telangana govt felicitates women achievers". Retrieved 9 March 2018.
- ↑ టీన్యూస్, క్రీడలు (4 March 2018). "జిమ్నాస్ట్ అరుణకు రూ.2 కోట్లు ప్రోత్సాహకం". Archived from the original on 6 మార్చి 2018. Retrieved 6 March 2018.
{{cite news}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ ఆంధ్రజ్యోతి, క్రీడాజ్యోతి (5 March 2018). "అరుణకు 2 కోట్లు". Retrieved 6 March 2018.[permanent dead link]
- ↑ నవతెలంగాణ, మానవి (16 February 2018). "ఆహారమే ఆరోగ్య రహస్యం". కట్ట కవిత. Archived from the original on 29 అక్టోబరు 2021. Retrieved 6 March 2018.
- ↑ ఆంధ్రజ్యోతి, నవ్య, ఓపెన్ పేజి (7 March 2018). "సేవా రమణీయం!". కూర్మాచలం శ్రీనివాస్. Retrieved 9 March 2018.
{{cite news}}
: CS1 maint: multiple names: authors list (link)[permanent dead link]