బొడ్డేపల్లి సత్యవతి
బొడ్డేపల్లి సత్యవతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె ఆముదాలవలస నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1][2]
బొడ్డేపల్లి సత్యవతి | |||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2004 - 2014 | |||
ముందు | తమ్మినేని సీతారాం | ||
---|---|---|---|
తరువాత | కూన రవికుమార్ | ||
నియోజకవర్గం | ఆముదాలవలస నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయురాలు | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | ఎం. జంగమయ్య | ||
జీవిత భాగస్వామి | బొడ్డేపల్లి చిట్టిబాబు | ||
సంతానం | రమేష్, రజినీ, విద్యామందాకినీ |
రాజకీయ జీవితం
మార్చుబొడ్డేపల్లి సత్యవతి తన భర్త మరణాంతరం కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1995 నుండి 2004 వరకు ఆమదాలవలస మున్సిపల్ ఛైర్మన్‌గా పని చేసింది. ఆమె 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆముదాలవలస నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయింది. సత్యవతి ఆ తరువాత 2004, 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఆమె రాష్ట్ర విభజన అనంతరం 2014, 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి పోటీ చేసి ఓడిపోయింది.
మూలాలు
మార్చు- ↑ Sakshi (2019). "ఆముదాలవలస నియోజకవర్గం ముఖచిత్రం". Archived from the original on 21 May 2022. Retrieved 21 May 2022.
- ↑ Sakshi (5 April 2019). "ఆమదాలవలస.. మారుతోంది దిశ!". Retrieved 21 May 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)