కూన రవికుమార్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు.[1] ఆయనను 2024 ఎన్నికల్లో 2024 ఫిబ్రవరి 24న ఆమ‌దాల‌వ‌ల‌స టీడీపీ అభ్యర్థిగా ప్రకటించింది.[2]

కూన రవికుమార్
కూన రవికుమార్

కూన రవికుమార్


ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు
ఆమదాలవలస శాసనసభ నియోజకవర్గం
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 జూన్ 2014 - 30 మే 2019
ముందు బొడ్డేపల్లి సత్యవతి
తరువాత తమ్మినేని సీతారాం

వ్యక్తిగత వివరాలు

జననం (1968-07-15) 1968 జూలై 15 (వయసు 56)
పెనుబర్తి (పొందూరు) , శ్రీకాకుళం జిల్లా
రాజకీయ పార్టీ తెలుగు దేశం
తల్లిదండ్రులు కృష్ణారావు
జయలక్ష్మీ
జీవిత భాగస్వామి ప్రమీళ
సంతానం నీలిమ, రేష్మా, రేవతి
నివాసం శ్రీకాకుళం, శ్రీకాకుళం జిల్లా
వృత్తి ఇంజనీరు
మతం హిందూ

జీవిత విశేషాలు

మార్చు

కూన రవికుమార్ శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలానికి చెందిన పెనుబర్తి గ్రామంలో 1968 జూలై 15న జన్మించాడు. బి.ఇ (సివిల్) చదివాడు. 1994లో రాజకీయ ప్రవేశం చేసి పొందూరు మండలానికి ఎం.పి.పిగా, జెడ్.పి.టి.సి సభ్యునిగా తన సేవలనందించాడు. అతను శ్రీకాకుళం జిల్లా ఆముదాల‌వ‌ల‌స శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ త‌ర‌పున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ విప్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[3] ఆమ‌దాల‌వ‌ల‌స నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపొందిన అతను సీనియ‌ర్ నాయ‌కుడు త‌మ్మినేని సీతారాం పై 5వేల ఓట్ల‌తో విజ‌యం సాధించాడు. అతను తమ్మినేని సీతారాంకు మేనల్లుడే కాక స్వయానా ఆయన భార్యకు తమ్ముడు కూడా. 1983, 1985 ఎన్నికలలో ఆమదాలవలస ఎమ్మెల్యేగా విజయం సాధించిన మాజీ మంత్రి తమ్మినేని సీతారాం నాలుగున్నరేళ్లకు పైగా అసెంబ్లీ విప్‌ పదవి నిర్వహించి 1989లో ఓడిపోయాడు.[4] 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఆమదాలవలస శాసనసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేసి ఓడిపోయాడు.

మూలాలు

మార్చు
  1. "KOONA RAVIKUMAR MLA of Amadalavalasa Andhra Pradesh contact address & email". nocorruption.in. Archived from the original on 2016-03-26. Retrieved 2018-06-09.
  2. Andhrajyothy (24 February 2024). "టీడీపీ అభ్యర్థులు జాబితా ఇదే.. మామూలుగా లేదుగా..!". Archived from the original on 24 February 2024. Retrieved 24 February 2024.
  3. "Whips". aplegislature.org. Archived from the original on 2018-06-01. Retrieved 2018-06-09.
  4. "బావ సెంటిమెంట్‌ బావ‌మ‌రిదికీ వ‌ర్తిస్తుందా!". Archived from the original on 2018-10-06. Retrieved 2018-06-09.

బయటి లంకెలు

మార్చు