బొర్రగూడెం
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
బొర్రగూడెం, కృష్ణా జిల్లా, మైలవరం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
బొర్రగూడెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°48′54″N 80°37′54″E / 16.815089°N 80.631752°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | మైలవరం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521230 |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామ భౌగోళికం
మార్చుఇది కృష్ణా జిల్లా, మైలవరమునకు 5 కి.మి దూరములో విజయవాడ-తిరువూరు మార్గంలో ఉంది.
గ్రామ పంచాయతీ
మార్చుఈ గ్రామం, చండ్రగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం. ఇది చిన్న గ్రామమైనప్పటికి, గ్రామస్థులు వర్షాధారపు పంటలపై జీవిస్తున్నారు.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుశ్రీ లక్ష్మీతిరుపతమ్మ, గోపయ్యస్వామివారల ఆలయం
మార్చుఇక్కడ "తిరుపతమ్మ అమ్మవారు" వెలిసిన కారణంగా ఆమె తిరునాళ్ళను ప్రతి సంవత్సరము అతి వైభవంగా జరుపుతారు. పెనుగంచిప్రోలును తలపించే రీతిలో ఈ ఉత్సవాలు జరపడం ఇక్కడి విశేషం.
ఉత్సవాల వివరాలు
మార్చునూతనముగా నిర్మించిన ఆలయమందు ది 14.02.2011న అమ్మవారి పున: ప్రతిష్ఠ జరిగింది. ఈ ఆలయ నిర్మాణానికి దేవస్థానం నిధులు నుంచి 10 లక్షలు, భక్తుల విరాళాలతో 15 లక్షలతో ఆలయన్ని సుందరవనంగా తీర్చిదిద్దారు. ఆ రోజు, శ్రీగోపయ్య-తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణం జరిగింది. వేలాదిగా వచ్చిన భక్తులతో బొర్రగూడెం గ్రామం పులకించిపోయింది. గ్రామంలోని ప్రతి ఇల్లు వారి ఆడపడుచుల రాకతో - మునుపెన్నడూలేని ఆనందాలు వెల్లువెత్తాయి. ఈ కార్యక్రమాలు నాలుగురోజులుపాటు శాస్త్రవిహితంగా జరిగాయి. ఈ ఆలయ ఛైర్మన్, వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ చెలికాని ప్రసాద్ బాబు, ఈ.ఓ శ్రీ సాంబశివరావు, ఆలయ కత్రుత్వ మండలి -వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కలుగజేసినారు. నాటి కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికి ఊచిత భోజన ఏర్పాట్లు చాలా సమర్ధవంతముగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాదికారి సాంబశివరావు ఈ దేవాలయన్ని దినాదినాభివృద్ధి చేస్తూ భక్తుల మన్ననలను పొందుతున్నారు. మైలవరం పరిసర ప్రాంతాల్లో 25 లక్షలు వెచ్చించి నిర్మించిన దేవాలయం శ్రీ తిరుపతమ్మ, గోపయ్య వార్ల దేవాలయం ఒక్కటేనని, ఇదంతా అమ్మవారి దయేనని గ్రామస్థులు అంటున్నారు.బొర్రగూడెంలో వేంచేసియున్న "శ్రీ తిరుపతమ్మ" అమ్మవారు, అతి మహిమగల తల్లిగా పేరుపొంది భక్తుల కొంగు బంగారమై విలసిల్లుతుంది.ఈ పరంపరను కొనసాగిస్తూ, వార్షిక ఉత్సవాల సందర్భముగా ది.07/02/2012 వ తేదీన శ్రీగోపయ్య-తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణం జరిగింది. తప్పక అందరు దర్శించి తరించగలరు. ది.30/08/2012 ఈనాడు దినపత్రిక: హుండీ ఆదాయం రూ.3.69 లక్షలు:- బొర్రగూడెం (మైలవరం) : మండలంలోని బొర్రగూడెం తిరుపతమ్మ, గోపయ్యవారి దేవస్థానంలో బుధవారం నిర్వహించిన హుండీ లెక్కింపు ద్వారా రూ.3.69 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎన్.వి.సాంబశివరావు తెలిపారు. గడచిన అయిదు నెలలకు సంబంధించిన హుండీ లెక్కింపును బుధవారం దేవాదాయ శాఖ గ్రేడ్ కార్యనిర్వహణాధికారి వై.శివరామయ్య, ఆలయ ధర్మకర్త చెలికాని సత్య వరప్రసాద్, గ్రామస్ధులు వెంకటేశ్వరరెడ్డి, పుల్లయ్య తదితరుల సమక్షంలో లెక్కింపు చేపట్టినట్లు తెలిపారు. దాంతోపాటు మార్చి నెలలో భక్తులు సమర్పించిన తలనీలాల విక్రయానికి బహిరంగ వేలం నిర్వహించగా రూ.9,400 ఆదాయం వచ్చినట్లు తెలిపారు.
2014, ఫిబ్రవరి-14, శుక్రవారం నాడు, శ్రీ గోపయ్య-తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణం జరుపుటకు మిక్కిలి భక్తీ శ్రద్ధలతో ఏర్పాట్లు జరుగుచున్నవి.
ఈ ఆలయంలో 2015, మార్చి-5వతేదీ గురువారం నుండి, 9వ తేదీ సోమవారం వరకు నెలబోణాలు నిర్వహించెదరు. [1]
గ్రామంలో ప్రధాన పంటలు
మార్చువరి, అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
మార్చువ్యవసాయం, వ్యవసాయాదారిత వృత్తులు