పెనుగంచిప్రోలు

ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు మండలం లోని గ్రామం


పెనుగంచిప్రోలు కృష్ణా జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన జగ్గయ్యపేట నుండి 20 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3894 ఇళ్లతో, 14374 జనాభాతో 3880 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 7098, ఆడవారి సంఖ్య 7276. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3659 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 326. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 588859[1].పిన్ కోడ్: 521190.

పెనుగంచిప్రోలు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పెనుగంచిప్రోలు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి చింతల శ్రీలక్ష్మి
జనాభా (2011)
 - మొత్తం 14,374
 - పురుషులు 25,782
 - స్త్రీలు 26,029
 - గృహాల సంఖ్య 14,262
పిన్ కోడ్ 521 190
ఎస్.టి.డి కోడ్ 08678
పెనుగంచిప్రోలు
—  మండలం  —
కృష్ణా జిల్లా పటములో పెనుగంచిప్రోలు మండలం స్థానం
కృష్ణా జిల్లా పటములో పెనుగంచిప్రోలు మండలం స్థానం
పెనుగంచిప్రోలు is located in Andhra Pradesh
పెనుగంచిప్రోలు
పెనుగంచిప్రోలు
ఆంధ్రప్రదేశ్ పటంలో పెనుగంచిప్రోలు స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°55′00″N 80°15′00″E / 16.9167°N 80.2500°E / 16.9167; 80.2500
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండల కేంద్రం పెనుగంచిప్రోలు
గ్రామాలు 13
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 50,695
 - పురుషులు 25,551
 - స్త్రీలు 25,144
అక్షరాస్యత (2001)
 - మొత్తం 57.08%
 - పురుషులు 66.59%
 - స్త్రీలు 47.48%
పిన్‌కోడ్ 521190

గ్రామ చరిత్రసవరించు

పెనుగంచిప్రోలు గ్రామం పూర్వ పేరు పెదకంచి. తదనంతరం పెనుగంచిగా పెనుగంచిప్రోలుగా పిలువబడింది. పెనుగంచిప్రోలు అను పేరు పెద్ద కంచీపురం నుండి వచ్చింది. ఇప్పుడు తమిళనాడులోనున్న కంచి చిన్న కంచి అయితే, ఇది పెద్ద కంచి. ఈ ఊరిలో 108 దేవాలయములు ఉండేవని అంటారు. అయితే కాల క్రమలో ఈ ఊరి ప్రక్కనే ప్రవహించుచున్న మునియేరు వరదల వల్ల ఆ ఊరు, ఆ దేవాలయములు భూగర్భంలో కలిసిపోయాయి. అందుకే ఇప్పటికనీ ఆ ఏటికి వరద వచ్చినపుడు ఇసుక తిన్నెల మధ్యన పురాతన దేవాలయాల స్ధంభాలు నీటిలో కనిపిస్తాయి. కొన్ని బయటకు కూడా కనిపిస్తాయి. కాని వాటి గురించి ఎవరూ పట్టించుకోరు. ఈ ఊరిలోనున్న ఆదినారాయణస్వామి, గోపాలస్వామి విగ్రహాలు భూమిలో దొరికినవే. పెనుగ్రంచిపోలు సంస్థానానికి సంబంధిచిన అనేక తవ్వకాలలో అనేక శాసనాలు లభ్యమయ్యాయి. పెనుగంచిప్రోలు గ్రామమే పాలంచెన్నూర్ అని షుమారు 1520 వ సంవత్సరములో హిందూరాజులకు గోల్కొండ నవాబైన కులీ కుతుబ్ షా సైన్యానికి మున్నేటి ఒడ్డున పెద్ద యుద్ధం జరిగిందని ఆయుద్ధంలో హిందూ సైన్యం ఓటమి చెందిందని మనకు చరిత్ర బట్టి తెలియజేస్తుంది. బహుశా ఆ యుద్ధం తరువాత గ్రామ దేవాలయాలు శిల్ప సంపద కొల్లగొట్టబడి ఉంటుంది. అందువల్లనే ఈ గ్రామంలో మున్నేటి వొడ్డున ఎక్కడ పునాదులు త్రవ్వినా ఏదోవొక ఆనాటి ప్రాభవ శిల్పసంపద ఆనవాళ్లు బయల్పడుచున్నవి.

సమీప గ్రామాలుసవరించు

ముండ్లపాడు 3 కి.మీ, లింగగూడెం 3 కి.మీ, కొల్లికుల్ల 4 కి.మీ, వేమవరం 5 కి.మీ, ముచ్చింతాల 5 కి.మీ,నందిగామ16  కి.మీ, తోటచర్ల 10  కి.మీ  

సమీప మండలాలుసవరించు

వత్సవాయి, మధిర, నందిగామ, బోనకల్,జగ్గయ్యపేట 

సమాచార, రవాణా సౌకర్యాలుసవరించు

పెనుగంచిప్రోలులో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. జగ్గయ్యపేటనుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. విజయవాడ రైల్వేస్టేషన్ 62 కి.మీ దూరంలో ఉంది.

విద్యా సౌకర్యాలుసవరించు

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఉన్నాయి. సమీప బాలబడి జగ్గయ్యపేటలో ఉంది. సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల జగ్గయ్యపేటలోను, ఇంజనీరింగ్ కళాశాల భీమవరంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల విజయవాడలోను, పాలీటెక్నిక్ నందిగామలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం జగ్గయ్యపేటలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విజయవాడ లోనూ ఉన్నాయి.

గ్రామంలోని మౌలిక వసతులుసవరించు

 1. ప్రాథమిక వైద్యశాల.
 2. అంగనవాడీ కేంద్రం.
 3. ఆంధ్రా బ్యాంక్.
 4. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇతర 3 బ్యాంకులు కలవు .

వైద్య సౌకర్యంసవరించు

ప్రభుత్వ వైద్య సౌకర్యంసవరించు

పెనుగంచిప్రోలులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, ఐదుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యంసవరించు

గ్రామంలో10 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు ఇద్దరు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ముగ్గురు, డిగ్రీ లేని డాక్టర్లు ఆరుగురు, ఇద్దరు నాటు వైద్యులు ఉన్నారు. ఆరు మందుల దుకాణాలు ఉన్నాయి.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు

అందమైన మునేరు నది, చెరువు, నాగార్జున సాగర్ కాలువలు ఈ ఊరి వ్యవసాయానికి జీవానాధారాలు.

తాగు నీరుసవరించు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యంసవరించు

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

గ్రామ పంచాయతీసవరించు

2013 జూలై 28లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి చింతల శ్రీలక్ష్మి, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ సీతారామయ్య ఎన్నికైనారు. అనంతరం పంచాయతీ పాలకవర్గం ఏర్పడగానే, తొలి తీర్మానంలోనే, గ్రామంలోని తుఫాన్ కాలనీ మరియూ బంగారు కాలనీలలోని అధ్వాన్నంగా ఉన్న అంతర్గత రహదారులకు మోక్షం కలిగించాలని ఆమోదముద్ర వేసినారు. వెంటనే పనులు ప్రారంభించి ఆరు నెలలలో పనులు పూర్తి చేసి, అందరి ప్రశంసలనందుకున్నారు. ఈ రెండు కాలనీలలో ఉన్న రహదారుల మీద, వర్షం వస్తే కనీసం నడిచేటందుకు గూడా వీలుపడేదికాదు. ఈ రహదారులను 15 లక్ష్ల రూపాయలతో అభివృద్ధి పరచారు. ఇదిగాక, మరికొన్ని కాలనీలలో రహదార్లకు మొదటి విడతగా గ్రావెల్ పరిచారు. మరి కొన్నిటిని సిమెంటు రహదారులుగా అభివృద్ధిచేసారు. తొలి ఏడాదిలోనే అంతర్గత రహదారుల అభివృద్ధికి రు.30 లక్షలు వెచ్చించారు. ] [3]==గ్రామంలోని దర్శనీయ స్థలాలు/ప్రార్థనా ప్రదేశాలు==

శ్రీ తిరుపతమ్మ తల్లి ఆలయంసవరించు

ఈ గ్రామంలో శ్రీ తిరుపతమ్మ తల్లి గ్రామ దేవత తిరునాళ్లు బాగా జరుగుతాయి. గ్రామంలో 101 దేవాలయలు ఉన్నాయి. తిరుపతమ్మ దేవాలయము రాష్ట్రములో 11 వ స్థానం, 9 వ నంబరు జాతీయ రహదారి నుండి 8 కి.మీ. దూరంలో ఉంది. ఈ ఆలయ ఆవరణలోనే అంకమ్మ అమ్మవారు వెలసినారు. ఈ ఆలయానికి పెనుగంచిప్రోలు, ముచ్చింతాల, సుబ్బాయిగూడెం గ్రామాల పరిధిలో 35 ఎకరాల వ్యవసాయ భూములు మాన్యం భూములుగా ఉన్నాయి. [5]

ఇతర దేవాలయాలుసవరించు

 1. ప్రసిద్ధి చెందిన శ్రీ ధర్మపురి యోగానంద నృసింహస్వామివారి దేవాలయం.
 2. అతి పురాతనమైన రుక్మిణి, గోదా సమేత గోపాలస్వామివారి దేవాలయం.
 3. పడమటి బజారున పురాతన ఆదినారాయణ స్వామివారి దేవాలయం.
 4. శ్రీ శంభులింగేశ్వరస్వామివారి ఆలయం.
 5. శ్రీ రామాలయం:- ఈ ఆలయం స్థానిక జమ్మిచెట్టు కూడలి (సెంటర్) లో ఉంది. ఈ ఆలయానికి అనుబంధంగా, 2017,ఫిబ్రవరి-10వతేదీ శుక్రవారంనాడు, ఒక కళ్యాణ మండపం ప్రారంభించారు. [4]
 6. శ్రీ వరలక్ష్మీ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయ ఆవరణలో, 2017,జూన్-3వతేదీ శనివారంనాడు, శ్రీ విఘ్నేశ్వరస్వామివారి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. [6]
 7. శ్రీ కట్టమైసమ్మ తల్లి ఆలయం:- స్థానిక శాలిగడ్డపై ఉన్న ఈ ఆలయంలో, అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం, 2017,ఆగస్టు-8వతేదీ మంగళవారంనాడు ప్రారంభమైనది. [11]

సమీప దేవాలయాలుసవరించు

 
మరకత రాజేశ్వరి

మార్కెటింగు, బ్యాంకింగుసవరించు

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

 • state bank of india
 • andhra Bank
 • sapthagiri grameena bank
 • AP state co-operative central bank

Axis bank-ATM Sbi-Atm Andhra bank ATM Ap state co-operetive central bank -ATM

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలుసవరించు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తుసవరించు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగంసవరించు

పెనుగంచిప్రోలులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

 • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 446 హెక్టార్లు
 • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 4 హెక్టార్లు
 • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 871 హెక్టార్లు
 • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 33 హెక్టార్లు
 • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 96 హెక్టార్లు
 • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 76 హెక్టార్లు
 • బంజరు భూమి: 81 హెక్టార్లు
 • నికరంగా విత్తిన భూమి: 2273 హెక్టార్లు
 • నీటి సౌకర్యం లేని భూమి: 1544 హెక్టార్లు
 • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 886 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలుసవరించు

పెనుగంచిప్రోలులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

 • కాలువలు: 127 హెక్టార్లు
 • బావులు/బోరు బావులు: 659 హెక్టార్లు
 • చెరువులు: 89 హెక్టార్లు
 • ఇతర వనరుల ద్వారా: 11 హెక్టార్లు

ఉత్పత్తిసవరించు

పెనుగంచిప్రోలులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలుసవరించు

వరి, ప్రత్తి, మిరప, కందులు, పెసలు, జొన్న పంటలు పండిస్తారు. ఈ గ్రామం మామిడి తోటలకు ప్రసిద్ధి.

పారిశ్రామిక ఉత్పత్తులుసవరించు

బియ్యం, పప్పులు

చేతివృత్తులవారి ఉత్పత్తులుసవరించు

కుండలు

ప్రధాన వృత్తులుసవరించు

గ్రామం పాడి పంటలకు, వ్యవసాయమనకు పేరు గాంచింది.

గ్రామ ప్రముఖులుసవరించు

 • భండారు అచ్చమాంబ
 • దుగ్గిరాల గోపాలక్రిష్ణయ్య
 • కొమర్రాజు లక్ష్మణరావు
 • మంచికంటి రాం కిషన్ రావు (ప్రముఖ కమ్యూనిస్ట్ యోధుడు. మాజీ శాసన సభ్యులు ఖమ్మం నియోజక వర్గం )
 • యేరువ వెంకట నరసయ్య (మునసబు గారు )
 • సూరంపల్లి నరసయ్య గారు (మాజీsarpunch)
 • నీరుకొండ గోపాలరావు (మాజీ సర్పంచ్ )
 • నలమోలు లక్ష్మయ్య (గ్రామ కరణం )
 • యేరువ గోపయ్య (గ్రామ మునసబు )
 • నలమోలు కోటేశ్వరరావు (యువ శాస్త్రవేత్త అవార్డు గ్రహీత. అమెరికా )
 • Seshu Karla9
 • కర్ల లింగయ్య బుర్రకథ కళాకారులు.
 • పి.వి.అప్పాజీ"ఫార్మస్యూటికల్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా" (ఫార్మకిల్స్) కు డైరెక్టరు జనరలుగా ఉన్న డాక్టర్ పి.వి.అప్పాజీ గారి స్వగ్రామం ఈ వూరే. [2]

== చిత్ర మాలిక ==

గ్రామాలుసవరించు

జనాభాసవరించు

 • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు :[2]
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషుల సంఖ్య స్త్రీలు
1. అనిగండ్లపాడు 2,028 8,238 4,121 4,117
2. గుమ్మడిదుర్రు 792 3,239 1,603 1,636
3. కొల్లికుల్ల 329 1,317 683 634
4. కొనకంచి 907 3,481 1,761 1,720
5. లింగగూడెం 423 1,831 916 915
6. ముచ్చింతాల 540 2,426 1,224 1,202
7. ముండ్లపాడు 748 3,209 1,642 1,567
8. నవాబ్ పేట 1,165 4,991 2,504 2,487
9. పెనుగంచిప్రోలు 3,202 13,390 6,739 6,651
10. శనగపాడు 917 3,630 1,823 1,807
11. సుబ్బాయిగూడెం 433 1,811 888 923
12. తోటచెర్ల 481 1,902 999 903
13. వెంకటాపురం 255 1,230 648 582

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 51,811 - పురుషుల సంఖ్య 25,782 - స్త్రీల సంఖ్య 26,029 - గృహాల సంఖ్య 14,262;

+జనాభా (2001) - మొత్తం 50,695 - పురుషులు 25,551 - స్త్రీలు 25,500

వనరులుసవరించు

 1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
 2. "2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు". Archived from the original on 2013-10-05. Retrieved 2013-05-03.

వెలుపలి లింకులుసవరించు

[2] ఈనాడు కృష్ణా; 2013,నవంబరు25; 2వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2014,సెప్టెంబరు-27; 9వపేజీ. [4] ఈనాడు అమరావతి/జగ్గయ్యపేట; 2017,ఫిబ్రవరి-11; 2వపేజీ. [5] ఈనాడు అమరావతి/జగ్గయ్యపేట; 2017,ఫిబ్రవరి-19; 1వపేజీ. [6] ఈనాడు అమరావతి/జగ్గయ్యపేట; 2017,జూన్-4; 1వపేజీ. [7] ఈనాడు అమరావతి/జగ్గయ్యపేట; 2017,ఆగస్టు-9; 2వపేజీ.