బొహ్రా వినాయక దేవాలయం

బొహ్రా వినాయక దేవాలయం, రాజస్థాన్ రాష్ట్రం, ఉదయపూర్‌లోని మోహన్‌లాల్ సుఖాడియా విశ్వవిద్యాలయం సమీపంలో ఉన్న చాలా పురాతనమైన, ప్రసిద్ధ వినాయక దేవాలయం.[1][2] ఈ దేవాలయానికి ప్రతివారం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. ఈ దేవాలయం మధ్యలో తూర్పు ముఖంగా నృత్య భంగిమలో ఉన్న వినాయకుడి విగ్రహం ఉంది. జైపూర్‌లోని మోతీ దుంగారి దేవాలయానికి సమానమైన గౌరవం ఈ దేవాలయానికి లభిస్తుంది.[2]

బొహ్రా వినాయక దేవాలయం
బొహ్రా వినాయక దేవాలయం is located in Rajasthan
బొహ్రా వినాయక దేవాలయం
Location in Udaipur
భౌగోళికం
భౌగోళికాంశాలు24°35′22.455″N 73°43′39.6798″E / 24.58957083°N 73.727688833°E / 24.58957083; 73.727688833
దేశంభారతదేశం
రాష్ట్రంరాజస్థాన్
జిల్లాఉదయ్‌పూర్ జిల్లా
స్థలంఉదయ్‌పూర్

చరిత్ర

మార్చు

ఈ దేవాలయం సుమారు 350 సంవత్సరాల నాటిదని ఇక్కడి భక్తుల నమ్మకం. వాస్తవానికి 'బోర్గనేష్' అని పిలువబడే ఈ దేవాలయం అప్పటి ఉదయపూర్ నగరం బయట నిర్మించబడింది. తరువాత నగర విస్తరణ కారణంగా, ఈ ప్రాంతం ఇప్పుడు నగర పరిధిలోకి వచ్చింది. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని బొహ్రా వినాయక అని కూడా పిలుస్తున్నారు.

70-80 సంవత్సరాల క్రితం వివాహం, వ్యాపారం వంటి అవసరాల కోసం డబ్బు అవసరమయ్యే వ్యక్తులు ఒక కాగితంపై ఆ అవసరాన్ని వ్రాసి విగ్రహం ముందు వేయగా, వారికి అవసరమైన మొత్తాన్ని పొందేవారు. కానీ వారు వడ్డీతో మొత్తాన్ని తిరిగి ఇవ్వవలసివచ్చింది. బొహ్రా వర్గానికి చెందినవారు డబ్బును అప్పుగా ఇచ్చే వ్యాపారం చేస్తుంటారు. అందుకే ఇక్కడి వినాయకుడికి బొహ్రా వినాయకుడు అని పేరు వచ్చింది.[2]

వినాయక చవితి వేడుక

మార్చు

వినాయక చవితి పండుగను ఈ దేవాలయంలో ముఖ్యమైన కార్యక్రమంగా జరుపుకుంటారు. పండుగ రోజున, దేవాలయం అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు తెరిచి ఉంటుంది. సుమారు 2 - 2.5 లక్షల మంది భక్తులు దేవాలయాన్ని సందర్శిస్తారు.[3]

అన్నకూట్ వేడుకలు

మార్చు

దీపావళి తర్వాత జరుపుకునే గోవర్ధన్ పూజ లేదా అన్నకూట్ అనేది ఈ దేవాలయంలోని మరో ముఖ్యమైన కార్యక్రమం. ఈ రోజున భక్తులు వినాయకుడికి 'చప్పన్ భోగ్' (అంటే 56 వంటకాలు) సమర్పిస్తారు. తెల్లవారుజామున 'ఆంగి' అనే ఆచారం నిర్వహిస్తారు, తర్వాత వినాయకుడికి చప్పన్ భోగ్ విందును అందిస్తారు. సాయంత్ర సమయంలో దేవాలయ పూజారులు 'మహా ఆరతి' ఇస్తారు, ఆపై భక్తులకు 'ప్రసాదం' అందిస్తారు.[4]

ప్రదేశం, సందర్శన వేళలు

మార్చు

బొహ్రా వినాయక రోడ్డులో ఉన్న బొహ్రా ఈ వినాయక దేవాలయం, సిటీ సెంటర్ నుండి 2 కి.మీ., ఉదయపూర్ సిటీ రైల్వే స్టేషన్ నుండి 4 కి.మీ.ల దూరంలో ఉంది.[5]

ఈ దేవాలయ సందర్శన సమయాలు: [6]

  • సోమవారం - శుక్రవారం: ఉ. 6.00 - సా. 8.00
  • శనివారం: ఉ. 6.00 - సా. 8.00
  • ఆదివారం: ఉ. 6.00 - సా. 8.00
  • పబ్లిక్ సెలవులు: ఉ. 6.00 - సా. 8.00

మూలాలు

మార్చు
  1. "Famous Temples In and Around Udaipur". udaipurblog.com. UdaipurBlog. Archived from the original on 17 సెప్టెంబరు 2015. Retrieved 16 September 2015.
  2. 2.0 2.1 2.2 "GANESH TEMPLES IN UDAIPUR". thetimesofudaipur.com. The Times Of Udaipur. Archived from the original on 4 March 2016. Retrieved 16 September 2015.
  3. "Ganpati Bappa Morya..!!". udaipurtimes.com. udaipurtimes.com. Archived from the original on 5 మార్చి 2016. Retrieved 16 September 2015.
  4. "Chappan Bhog at Bohra Ganesh Ji". udaipurtimes.com. UdaipurTimes.com. Archived from the original on 3 సెప్టెంబరు 2015. Retrieved 16 September 2015.
  5. "Distance between Bohra Ganeshji and Udaipur (city center)". distancebetweencities.co.in. distancebetweencities.co.in. Archived from the original on 6 అక్టోబరు 2015. Retrieved 16 September 2015.
  6. "Bohra Ganesh Ji Temple". holidayiq.com. HolidayIQ.com. Archived from the original on 2 సెప్టెంబరు 2015. Retrieved 16 September 2015.