బోండా ఉమామహేశ్వర రావు

భారతీయ రాజకీయ నాయకుడు

బోండా ఉమామహేశ్వర రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన విజయవాడ సెంట్రల్ నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.

బోండా ఉమామహేశ్వర రావు

ఎమ్మెల్యే
పదవీ కాలం
2 జూన్ 2024 - ప్రస్తుతం
ముందు మల్లాది విష్ణు
నియోజకవర్గం విజయవాడ సెంట్రల్

ఎమ్మెల్యే
పదవీ కాలం
2014- 2019
ముందు మల్లాది విష్ణు
తరువాత మల్లాది విష్ణు
నియోజకవర్గం విజయవాడ సెంట్రల్

వ్యక్తిగత వివరాలు

జననం 30 జనవరి 1966
విజయవాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు కనకరావు, పుష్పవతి
జీవిత భాగస్వామి సుజాత
సంతానం బోండా సిద్ధార్థ, బోండా రవితేజ
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

బోండా ఉమామహేశ్వర రావు 2004లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009లో విజయవాడ తూర్పు నియోజకవర్గ టిక్కెట్ కేటాయించగా ఆ తరువాత జరిగిన పరిణామాల వల్ల సీటును గద్దె రామ్మోహన్ రావుకు టీడీపీ కేటాయించింది. 2010లో నియోజకవర్గాల పునర్విభజనలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నూతనంగా ఏర్పడడంతో ఆయన ఈ నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేసి 2014లో జరిగిన శాసనసభ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి పూనూరు గౌతమ్ రెడ్డి పై 27,161 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1]

బోండా ఉమా 2018లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యుడిగా నియమితుడయ్యాడు.[2] 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆ పదవికి రాజీనామా చేసి,[3] 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో విజయవాడ సెంట్రల్ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి మల్లాది విష్ణు చేతిలో 25 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాడు.

బోండా ఉమా 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్ పై 68,886 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[4] నవంబర్ 12న శాసనసభలో విప్‌గా నియమితుడయ్యాడు.[5]

పార్టీ పదవులు

మార్చు

బోండా ఉమామహేశ్వర రావు పరిటాల రవి చనిపోయిన తర్వాత టీడీపీ అనంతపురం ఇన్‌చార్జ్‌గా, ఆ తరువాత టీడీపీ ఆధికార ప్రతినిధిగా, టీడీపీ ఉపాధ్యక్షుడిగా, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వైఎస్‌ఆర్‌సీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేశాడు.

మూలాలు

మార్చు
  1. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  2. Sakshi (20 April 2018). "తితిదే బోర్డు మెంబర్ల నియామకం." Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.
  3. Sakshi (19 March 2019). "బొండా ఉమా, పార్థసారధి రాజీనామా". Archived from the original on 20 May 2022. Retrieved 20 May 2022.
  4. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Vijayawada Central". Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.
  5. Eenadu (12 November 2024). "ఏపీ శాసనసభలో చీఫ్‌విప్‌గా జీవీ ఆంజనేయులు, మండలిలో అనురాధ". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.