బోండా మణి ( 1963 సెప్టెంబరు 19 - 2023 డిసెంబరు 23) [1] తమిళ భాష సినిమా నటుడు. మూడు దశాబ్దాల పాటు సాగిన తన సినీ ప్రయాణంలో బోండా మణి 270 సినిమాలలో హాస్య సహాయక పాత్రలలో నటించాడు.[2] బోండా మణి కొన్ని సినిమాల ద్వారా గుర్తింపు పొందాడు. విన్నర్ (2003), ఇంగ్లీషుకరణ్ (2005), ఆరు (2005) మరుధమలై (2007) కన్నుమ్ కన్నుమ్ (2008) సినిమాలు బోండా మణికి పేరు తెచ్చిపెట్టాయి. బోండా మణి శ్రీలంక నుండి తమిళనాడుకు శరణార్థిగా వచ్చాడు.[3][4]

బోండామణి
జననం1963 సెప్టెంబర్ 19
శ్రీలంక,
మరణం2023 డిసెంబర్ 23
చెన్నై, తమిళనాడు, భారతదేశం,
వృత్తినటుడు
క్రియాశీలక సంవత్సరాలు1991–2023

నట జీవితం

మార్చు

1980వ దశకంలో సింగపూర్‌లో పనిచేస్తున్నప్పుడు, ఒక ప్రదర్శన కోసం ఆ దేశానికి వచ్చిన దర్శకుడు కె. భాగ్యరాజ్‌తో బోండా మణికి పరిచయం ఏర్పడింది. బోండా మణి తరువాత చెన్నై పర్యటనలో భాగ్యరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన పావున్ను పావునుతన్ (1991)లో బోండా మణి సహాయ పాత్రలో నటించాడు.[5] చిన్నప్పటి నుంచి నటుడిగా రాణించాలని ఉండేది. బోండా మణి ప్రధానంగా సినిమా రంగంలోకి రావాలనే ఉద్దేశంతో తమిళనాడుకు వచ్చాడు. ఆయన, శ్రీలంకలో తమిళ సినిమాలు తీయకపోవడంతో తమిళనాడుకు వచ్చికోలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు.

తేండ్రాల్ వరుమ్ తేరు (1994) సినిమాతో బోండా మణి నటుడిగా పరిచయం అయ్యాడు. బోండా మణి రాజ్ టీవీ టెలివిజన్ ధారావాహిక గంగా యమునా సరస్వతి (1998)లో నటించాడు, అక్కడ అతను విశ్వనాథన్‌తో లాంటి సంగీత దర్శకులతో కలిసి పనిచేశాడు. బొండామణి తమిళ హాస్య నటుడు వడివేలుతో కలిసి చాలా సినిమాలలో నటించాడు.

బోండా మణి చివరిసారిగా ఎంగ వీటు మీనాక్షి (2021)లో నటించాడు .[6]

2022 లో బోండా మణి మధుమేహం వ్యాధితో బాధపడ్డాడు.[7] 2022 సెప్టెంబరులో బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు బోండా మణి స్పృహ తప్పి పడిపోయాడు వెంటనే వైద్య చికిత్స కోసం ఒమాందూరార్ రాజీవ్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. బోండా మణికి తోటి హాస్యనటుడు కింగ్ కాంగ్ఆర్థిక సహాయం చేశాడు.[8][9] బోండా మణికి సినిమా అవకాశాలు లేకపోవడంతో ఆ సమయంలో తనకు ఆసుపత్రి బిల్లు 60వేలు అని తెలిసి బోండా మణి నిస్పృహకు లోనయ్యాడు.[10]

బోండా మణికి విజయ్ సేతుపతి, రజనీకాంత్, ధనుష్ సముద్రఖని వంటి ప్రముఖ నటుల నుండి కూడా ఆర్థిక సహాయం చేశారు.[11][12]

బోండా మణి మూత్రపిండాల జబ్బు కారణంగా 2023 డిసెంబరు 23న చెన్నైలోని పోజిచలూరులో 60 సంవత్సరాల వయస్సులో మరణించాడు.[13][14]

మూలాలు

మార్చు
  1. https://www.indiatoday.in/movies/regional-cinema/story/comedian-bonda-mani-dies-of-kidney-related-illness-at-60-2479830-2023-12-24
  2. Dinamalar (16 January 2017). "என் மீது அதிக பாசம் கொண்டவர் வடிவேலு! -நடிகர் போண்டாமணி - vadivelu has more affection on me says actor bonda mani".
  3. "Tragedy continues in film industry... Actor Bonda Mani passes away..." indiaherald.com (in ఇంగ్లీష్). Retrieved 2023-12-24.
  4. Bonda Mani and Pudhupettai Suresh's Emotional Moment Stole the Show at the Golden Carpet Awards (in ఇంగ్లీష్), retrieved 2023-12-24
  5. Thandora (3 April 2015). "Exclusive interview with Bonda Mani Movie Comedian" – via YouTube.
  6. "Actors Vijayakumar and Bonda Mani to make television comeback after a break". The Times of India. 2022-02-04. ISSN 0971-8257. Retrieved 2023-12-24.
  7. "Please save Bonda Mani- Popular comedian appeals for help in tearful video - Tamil News". IndiaGlitz.com. 2022-09-21. Retrieved 2023-12-24.
  8. "Comedian Bonda Mani hospitalized | Tamil Movie News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-12-24.
  9. "போண்டாமணிக்கு உதவி பண்ணுங்க - நடிகர் பெஞ்சமின் வேண்டுகோள்". Hindu Tamil Thisai (in తమిళము). 2022-09-21. Retrieved 2023-12-24.
  10. Bonda Mani Emotional Untold Story | Sri Lanka to Tamil Cinema | Kumudam | Naan Yaar (in ఇంగ్లీష్), retrieved 2023-12-24
  11. "Dhanush, Vijay Sethupathi donate Rs 1 lakh each to Bonda Mani for medical treatment". India Today (in ఇంగ్లీష్). Retrieved 2023-12-24.
  12. "Vijay Sethupathi donates Rs 1 lakh for Bonda Mani's medical treatment; Vadivelu assures to help too". The Times of India. 2022-09-24. ISSN 0971-8257. Retrieved 2023-12-24.
  13. "நகைச்சுவை நடிகர் "போண்டா" மணி காலமானார் - Dinamalar Tamil News". Dinamalar (in తమిళము). 2023-12-24. Retrieved 2023-12-24.
  14. "Comedian Bonda Mani dies of kidney-related illness at 60". India Today (in ఇంగ్లీష్). Retrieved 2023-12-24.
"https://te.wikipedia.org/w/index.php?title=బోండా_మణి&oldid=4080035" నుండి వెలికితీశారు