విజయ్ సేతుపతి
విజయ్ సేతుపతి, భారతీయ సినిమా నటుడు. ఆయన తమిళ, తెలుగు, మలయాళం, హిందీ చిత్రాల్లో నటించాడు. విజయ్ తమిళంలో వచ్చిన 'తెన్మెర్కు పరువాకత్రు' సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. అంతకుముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. ఆయన తమిళంలో నిర్మాతగా, స్క్రీన్ ప్లే రచయితగా, పాటల రచయితగా, గాయకుడిగా కూడా కొన్ని సినిమాలకు పనిచేశాడు. విజయ్ సేతుపతి తెలుగులో 2019లో వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమా ద్వారా తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టాడు. 2021లో ఉప్పెన సినిమాలోని రాయణం పాత్రలో ఆయన చేసిన నటన ద్వారా తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యాడు.
విజయ్ సేతుపతి | |
---|---|
![]() | |
జననం | విజయ గురునాథ సేతుపతి కాలిముతు 1978 జనవరి 16[1] |
జాతీయత | భారతీయుడు |
విద్యాసంస్థ | ధన్ రాజ్ బైద్ జైన్ కాలేజ్ |
వృత్తి | నటుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత, పాటల రచయిత, గాయకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2006 – ప్రస్తుతం [2] |
జీవిత భాగస్వామి | జేస్సి సేతుపతి [3] |
పిల్లలు | శ్రీజ, సూర్య |
నటించిన చిత్రాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర(లు) | గమనికలు | సూచిక నెం. |
---|---|---|---|---|
1996 | లవ్ బర్డ్స్ | తెలియదు | గుర్తింపు లేనిది | |
గోకులతిల్ సీతై | తెలియదు | గుర్తింపు లేనిది | ||
2004 | ఎం. కుమరన్ మహాలక్ష్మి కుమారుడు | బాక్సింగ్ విద్యార్థి | గుర్తింపు లేనిది | |
2006 | పుదుపెట్టై | అన్బు అనుచరుడు | సహాయ పాత్ర | |
2007 | లీ | లీలాధరన్ స్నేహితుడు | సహాయ పాత్ర | |
2009 | వెన్నిల కబడి కుజు | కబడ్డీ ఆటగాడు | సహాయ పాత్ర | |
2010 | నాన్ మహాన్ అల్లా | గణేష్ | సహాయ పాత్ర | |
బాలే పాండియా | పాండ్య సోదరుడు. | సహాయ పాత్ర | ||
తేన్మేర్కు పరువాకాత్రు | మురుగన్ | ప్రధాన పాత్ర | ||
2011 | వర్ణం | నందా | సహాయ పాత్ర | |
2012 | సుందరపాండ్యన్ | జెగన్ | ఉత్తమ విలన్ గా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు గెలుచుకుంది | |
పిజ్జా | మైఖేల్ కార్తికేయన్ | నామినేషన్ - ఫిలింఫేర్ ఉత్తమ నటుడి అవార్డు - తమిళం | ||
నడువుల కొంజమ్ పక్కత కానోమ్ | సి. ప్రేమ్ కుమార్ | |||
2013 | సూదు కవ్వం | దాస్ | ||
ఇధర్కుతానే ఆసైపట్టై బాలకుమారా | కుమారవేల్ | గెలిచింది— తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు ప్రత్యేక బహుమతి | ||
2014 | రమ్మీ | జోసెఫ్ | తెలుగులో ఫేమస్ లవర్ | |
పన్నైయరుం పద్మినియుం | మురుగేశన్ | గెలిచింది— తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు ప్రత్యేక బహుమతి | ||
జిగర్తాండ | యువ సేతు | కామియో | ||
కథై తిరైకతై వసనం ఇయక్కమ్ | అతనే | కామియో | ||
తిరుడాన్ పోలీస్ | వినాయగం | "ఎన్నోడు వా" పాటలో | ||
వాన్మామ్ | రాధ | |||
2015 | బెంచ్ టాకీస్ | మహేష్ | ఆంథాలజీ ఫిల్మ్ విభాగం; "నీర్" | |
పురంపోక్కు ఎంగిర పొదువుడమై | యమ లింగం | |||
ఆరెంజ్ మిట్టై | కైలాసం | |||
నానుమ్ రౌడీ ధాన్ | పాండియన్ | |||
2016 | సేతుపతి | కా. సేతుపతి | ||
కధలుం కదంధు పోగుం | కతిరవన్ | |||
ఇరైవి | మైఖేల్ | |||
ధర్మ దురై | ధర్మ దురై | తెలుగులో డా.ధర్మరాజు ఎం.బి.బి.యస్ | ||
ఆండవన్ కట్టలై | గాంధీ | |||
రెక్కా | శివ | |||
2017 | కవన్ | తిలక్ | ||
విక్రమ్ వేద | వేద | గెలిచింది— ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు - తమిళం | ||
పురియాత పుతిర్ | కతిర్ | |||
కథా నాయగన్ | ఫీనిక్స్ రాజ్ | కామియో | ||
కరుప్పన్ | కరుప్పన్ | |||
2018 | ఓరు నల్ల నాల్ పాతు సోల్రెన్ | యమన్ | ||
ట్రాఫిక్ రామసామి | అతనే | కామియో | ||
జుంగా | జంగ, రంగ, లింగ | తెలుగులో విక్రమార్కుడు | ||
ఇమైక్కా నోడిగల్ | విక్రమ్ ఆదిత్యన్ | కామియో | ||
చెక్క చివంత వానం | రసూల్ ఇబ్రహీం | |||
'96 | రామచంద్రన్ కృష్ణమూర్తి | గెలిచింది— ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు - తమిళం | ||
సీతాకాథి | అయ్య ఆతిమూలం | 25వ చిత్రం | ||
2019 | పెట్టా | జితు | ||
సూపర్ డీలక్స్ | శిల్ప (మాణిక్యం) | గెలిచింది— ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు | ||
సింధుబాద్ | తిరు | |||
అఖాడ | అధి | కన్నడ సినిమా | ||
మార్కోని మథాయ్ | అతనే | మలయాళం సినిమా | ||
సై రా నరసింహ రెడ్డి | రాజా పాండి | తెలుగు సినిమా | ||
సంగతమిళన్ | సంగ తమిజన్ (మురుగన్) | |||
2020 | ఓ మై కడవులే | కడవుల్ | ప్రత్యేక ప్రదర్శన | |
కా పే రణసింగం | రణసింగం | తెలుగులో వైఫ్ ఆఫ్ రణసింగం | ||
2021 | మాస్టర్ | భవానీ | ||
కుట్టి స్టోరీ | నింజా మానిక్ | ఆంథాలజీ ఫిల్మ్ సెగ్మెంట్; "ఆడల్ పడల్" | ||
ఉప్పెన | రాయణం | తెలుగు సినిమా | ||
లాబామ్ | పక్కిరి సామి | |||
తుగ్లక్ దర్బార్ | సింగార వేలన్ (సింగం) | |||
అన్నాబెల్లె సేతుపతి | వీర సేతుపతి, శూర సేతుపతి | |||
ముగిజ్ | విజయ్ | |||
కడసీల బిర్యానీ | లారీ డ్రైవర్ | కామియో | ||
ఒబామా ఉంగలుకాగా | అతనే | కామియో | ||
2022 | కడాయిసి వివసాయి | రామయ్య | ||
కాతువాకుల రెండు కాదల్ | రాంబో
(రంజనకుడి అన్బరసు మురుగేశ బూపతి ఒహోంధిరన్) |
తెలుగులో కణ్మనీ రాంబో ఖతీజా | ||
విక్రమ్ | సంధానం | |||
మామనితాన్ | రాధా కృష్ణన్ | |||
19(1)(ఎ) | గౌరీ శంకర్ | మలయాళం సినిమా | ||
డిఎస్పీ | డిఎస్పీ వాస్కోడగామా | |||
2023 | మైఖేల్ | మైఖేల్ యొక్క గాడ్ ఫాదర్ | తెలుగు సినిమా | |
విదుతలై భాగం 1 | పెరుమాళ్ (వాతియార్) | తెలుగులో విడుదల పార్ట్ 1 | ||
యాదుం ఊరే యావరుం కేలిర్ | కిరుబానాధి (పునీతన్) | |||
ముంబైకర్ | మున్ను | హిందీ సినిమా | ||
అళగియ కన్నే | అతనే | కామియో | ||
జవాన్ | కాళీ గైక్వాడ్ | హిందీ సినిమా; తమిళ వెర్షన్ కోసం తన డైలాగ్స్ అన్నీ తిరిగి చిత్రీకరించాడు | ||
గాంధీ టాక్స్ | మహాదేవ్ | నిశ్శబ్ద చిత్రం; IFFI
లో ప్రీమియర్ చేయబడింది |
||
2024 | మేరి క్రిస్మస్ | ఆల్బర్ట్ ఆరోగ్యసమి | ఒకేసారి హిందీలో చిత్రీకరించబడింది | |
మహారాజ | మహారాజా | 50వ చిత్రం | ||
విదుతలై పార్ట్ 2 | పెరుమాళ్ (వాతియార్) | తెలుగులో విడుదల పార్ట్ 2 | ||
టిబిఎ | ఏస్ † | టిబిఎ | పూర్తయింది | |
టిబిఎ | రైలు † | టిబిఎ | పోస్ట్-ప్రొడక్షన్ | |
టిబిఎ | పేరులేని పాండిరాజ్ ప్రాజెక్ట్ † | టిబిఎ | పూర్తయింది |
వ్యక్తిగత జీవితం
మార్చువిజయ్ సేతుపతికి ముగ్గురు తోబుట్టువులు, ఒక అన్నయ్య, ఒక తమ్ముడు, ఒక చెల్లెలు ఉన్నారు.[4] ఆయన తన స్నేహితురాలు జెస్సీని వివాహం చేసుకున్నాడు.[4] వీరికి ఇద్దరు పిల్లలు, కుమారుడు సూర్య, కుమార్తె శ్రీజ.
చదువుకునే రోజుల్లోనే మరణించిన తన స్నేహితుడి జ్ఞాపకార్థం కొడుకుకు సూర్య అని పేరు పెట్టాడు.[5] సూర్య నానుమ్ రౌడీ ధాన్ (2015)లో సేతుపతి చిన్న వెర్షన్‌లో నటించడం ద్వారా తన నటనను ప్రారంభించాడు.[6] ఈ చిత్రం తెలుగులో నేను రౌడీగా విడుదలైంది. సూర్య తన తండ్రితో కలిసి సింధుబాద్ (2019)లో మళ్లీ కనిపించాడు.[7] పలు చిత్రాల్లో నటుడిగా గుర్తింపుతెచ్చుకున్న సూర్య సేతుపతి హీరోగా ఫీనిక్స్ చిత్రంతో అరంగేట్రం చేయనున్నాడు.[8]
వెబ్‌సిరీస్
మార్చు- ఫర్జీ (2023)
మూలాలు
మార్చు- ↑ "Vijay Sethupathi Biography". Filmibeat. Archived from the original on 21 డిసెంబరు 2019. Retrieved 24 ఏప్రిల్ 2021.
- ↑ "I was rejected even for the role of a junior artist". The Times of India. 17 డిసెంబరు 2012. Archived from the original on 31 డిసెంబరు 2013. Retrieved 24 ఏప్రిల్ 2021.
- ↑ "vijay sethupathi wife name jessy". THE HINDU. 23 డిసెంబరు 2019. Archived from the original on 21 ఏప్రిల్ 2020. Retrieved 24 ఏప్రిల్ 2021.
- ↑ 4.0 4.1 Sudhish Kamath (31 మార్చి 2010). "Full of pizzazz!". The Hindu. Archived from the original on 16 జూన్ 2018. Retrieved 19 సెప్టెంబరు 2013.
- ↑ Subha J. Rao (18 జూన్ 2013). "Hits, no misses". The Hindu. Archived from the original on 12 జూలై 2013. Retrieved 13 జూలై 2013.
- ↑ "After Vijay's Sanjay, it's time for Vijay Sethupathi's Surya". Behindwoods. Archived from the original on 2 ఏప్రిల్ 2016. Retrieved 29 మార్చి 2016.
- ↑ Cinema Express (15 జూన్ 2019). "Following Vijay Sethupathi's son, the actor's daughter to make a debut in Sanga Tamizhan". Cinema Express. Archived from the original on 10 నవంబరు 2020. Retrieved 10 నవంబరు 2020.
- ↑ "SuryaSethupathi | విజయ్ సేతుపతి వారసుడొస్తున్నాడు.. సూర్య సేతుపతి Phoenix లాంఛ్-Namasthe Telangana". web.archive.org. 24 నవంబరు 2023. Archived from the original on 24 నవంబరు 2023. Retrieved 24 నవంబరు 2023.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)