బోయపల్లి (మహబూబ్ నగర్ అర్బన్)

తెలంగాణ, మహబూబ్ నగర్ జిల్లా, మహబూబ్ నగర్ మండలంలోని జనగణన పట్టణం
(బోయపల్లి (మహబూబ్ నగర్ అర్బన్ మండలం) నుండి దారిమార్పు చెందింది)

బోయపల్లి, తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లా, మహబూబ్ నగర్ (అర్బన్) మండలంలోని గ్రామం.[1]ఇది జనగణన పట్టణం.

బోయపల్లి (గ్రామీణ)
—  రెవిన్యూ గ్రామం  —
బోయపల్లి (గ్రామీణ) is located in తెలంగాణ
బోయపల్లి (గ్రామీణ)
బోయపల్లి (గ్రామీణ)
అక్షాంశరేఖాంశాలు: 16°46′48″N 77°59′25″E / 16.780014°N 77.990338°E / 16.780014; 77.990338
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్ జిల్లా
మండలం మహబూబ్ నగర్ (అర్బన్)
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 9,247
 - పురుషుల సంఖ్య 4,613
 - స్త్రీల సంఖ్య 4,634
 - గృహాల సంఖ్య 1,939
పిన్ కోడ్ 509001
ఎస్.టి.డి కోడ్

ఈ గ్రామం మహబూబ్ నగర్ పట్టణానికి అతిచేరువలో నవాబ్ పేట్ వెళ్ళు ప్రధాన మార్గంలో ఉంది.2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని మహబూబ్ నగర్ మండలంలో ఉండేది. [2] మహబూబ్ నగర్ పట్టణంలో కొత్తగంజ్, నవాబ్ పేట్ వైపు వెళ్ళే దారిలో కల రైల్వేగేటును ఈ గ్రామం పేరుమీదుగా బోయపల్లి రైల్వేగేటుగా వ్యవహరిస్తారు. ఇది గ్రామపంచాయతి కేంద్రం.మండలంలోని 16 ఎమ్పీటిసీ నియోజకవర్గాలలో ఒకటి.

గణాంకాలు

మార్చు

2011భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ జనాభా - మొత్తం 9,247 - పురుషుల సంఖ్య 4,613 - స్త్రీల సంఖ్య 4,634 - గృహాల సంఖ్య 1,939

రవాణాసౌకర్యాలు

మార్చు

ఈ గ్రామం మహబూబ్‌నగర్ నుంచి నవాబ్‌పేటకు వెళ్ళు మార్గములో ఉంది. బస్సులు, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉన్నాయి.

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మహబూబ్ నగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.

వెలుపలి లింకులు

మార్చు