బోరబండ, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక నివాస ప్రాంతం.[2] ఈ ప్రాంతం ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, జూబ్లీ హిల్స్, మాదాపూర్‌ ప్రాంతాలకు దగ్గరగా ఉంది.

బోరబండ
సమీపప్రాంతం
బోరబండ is located in Telangana
బోరబండ
బోరబండ
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
బోరబండ is located in India
బోరబండ
బోరబండ
బోరబండ (India)
Coordinates: 17°27′N 78°24′E / 17.450°N 78.400°E / 17.450; 78.400[1]
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500 018
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకగర్గంజూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

పరిపాలన

మార్చు

ఇది హైదరాబాదు మహానగరపాలక సంస్థ లోని వార్డు నంబరు 103 లో ఉంది.[3]

సమీప ప్రాంతాలు

మార్చు

రాధాకృష్ణ నగర్, ఎన్.ఆర్.ఆర్. పురం, పద్మావతి నగర్, రాజానగర్, మోతీనగర్, కార్మిక నగర్, కళ్యాణ్ నగర్ మొదలైన ప్రాంతాలు బోరబండకు సమీపంలో ఉన్నాయి.[2]

ప్రార్థనా స్థలాలు

మార్చు

ఇక్కడ సాయిబాబా దేవాలయం, దుర్గా దేవాలయం, శివాలయం, ఆంజనేయస్వామి దేవాలయం, పీలీ దర్గా, నూర్ మసీదు, మెథడిస్ట్ చర్చి మొదలైన ప్రార్థనా స్థలాలు ఉన్నాయి.

ఉత్సవాలు

మార్చు

తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల పండుగ సందర్భంగా బోరబండ పుట్టనాగులమ్మ, ఎల్లమ్మ తల్లి ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి.[4]

రవాణా

మార్చు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో బోరబండ నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. హైదరాబాదు ఎం.ఎం.టి.ఎస్ ఆధ్వర్యంలో బోరబండ రైల్వే స్టేషను నుండి ఫలక్‌నామా రైల్వే స్టేషను, లింగంపల్లి రైల్వే స్టేషను, నాంపల్లి రైల్వే స్టేషనులకు రైలు సౌకర్యం ఉంది.[2]

మూలాలు

మార్చు
  1. "Where is Borabanda, Hyderabad, Telangana, India on Map Lat Long Coordinates". www.latlong.net. Retrieved 2021-01-16.
  2. 2.0 2.1 2.2 "Borabanda Locality". www.onefivenine.com. Retrieved 2021-01-16.
  3. "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 15 జూన్ 2019. Retrieved 16 January 2021.
  4. ఆంధ్రజ్యోతి, హైదరాబాదు (20 July 2020). "నిరాడంబరంగా బోనాలు". www.andhrajyothy.com. Archived from the original on 21 July 2020. Retrieved 16 January 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=బోరబండ&oldid=4149893" నుండి వెలికితీశారు