బోర్డర్ గవాస్కర్ ట్రోఫి

బోర్డర్ గవాస్కర్ ట్రోఫి, భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే టెస్టు సిరీస్. ఇది ఐ.సీ.సీ చే నిర్వహించబడుచున్న సిరీస్. ఆస్ట్రేలియా క్రికెటర్ అల్లెన్ బొర్డర్, భారత క్రికెటర్ సునిల్ గవాస్కర్ ల పేరుతో నిర్వహించబడుచున్నది. వీరిద్దరూ టెస్టు క్రికెట్ లో 10వేలకు పైగా పరుగులు, వారి వారి జట్లకు సారథులుగా వ్యవహరించారు. తొలి బొర్డర్-గవాస్కర్ ట్రోఫిని 1996-97 సీజన్ లో ఆడారు. ఈ సీరీస్ ను భారత్ 1-0 తో నెగ్గింది. ఇప్పటివరకు 14 సిరీస్ లు జరుగగా అందులో భారత్ 8 సార్లు గెలిస్తే, ఆస్ట్రేలియా 5 సార్లు నెగ్గింది, ఒక సిరీస్ 1-1తో డ్రా అయ్యింది. తదుపరి సీరీస్ 2020-21లో ఆస్ట్రేలియాలో జరగనుంది.

ఫలితాలుసవరించు

సంవత్సరం ఆతిథ్య దేశం ఫలితం మ్యాన్ ఆఫ్ ది సిరీస్
1996-1997 భారత్ 1-0 తో సిరీస్ నెగ్గిన భారత్ నయాన్ మోంగియా
1997-1998 భారత్ మూడు మ్యాచ్ ల సిరీస్ ను 2-1 తో నెగ్గిన భారత్ సచిన్ టెండుల్కర్
1999-2000 ఆస్ట్రేలియా మూడు మ్యాచ్ ల సిరీస్ ను 3-0తో నెగ్గిన ఆస్ట్రేలియా సచిన్ టెండుల్కర్
2000-2001 భారత్ మూడు మ్యాచ్ ల సిరీస్ ను 2-1 తో నెగ్గిన భారత్ హర్భజన్ సింగ్
2003-2004 ఆస్ట్రేలియా 1-1తో డ్రా అయిన 4మ్యాచ్ ల సిరీస్ రాహుల్ ద్రవిడ్
2004-2005 భారత్ 4మ్యాచ్ ల సిరీస్ ను 2-1 తో నెగ్గిన ఆస్ట్రేలియా డామియెన్ మార్టిన్
2007-2008 ఆస్ట్రేలియా 4మ్యాచ్ ల సిరీస్ ను 2-1 తో నెగ్గిన ఆస్ట్రేలియా బ్రెట్ లీ
2008-2009 భారత్ 4మ్యాచ్ ల సిరీస్ ను 2-0 తో నెగ్గిన భారత్ ఇషాంత్ శర్మ
2010-2011 భారత్ 2మ్యాచ్ ల సిరీస్ ను 2-0 తో నెగ్గిన భారత్ సచిన్ టెండుల్కర్