1973 జనవరి 11మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో మరాఠీ మాట్లాడే దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో[2] జన్మించిన రాహుల్ ద్రవిడ్ (Rahul Sharad Dravid) 1996 నుంచి భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చే ప్రపంచంలోని 10 అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా గుర్తింపును పొందినాడు.[3] అంతేకాకుండా టెస్ట్ క్రికెట్ బ్యాటింగ్ సగటులో భారతీయులలో అతనిదే అగ్రస్థానం [4] .సునీల్ గవాస్కర్, సచిన్ టెండుల్కర్ ల తర్వాత భారత్ తరఫున టెస్ట్ క్రికెట్ లో 9000 పరుగులు పూర్తిచేసిన మూడవవాడు రాహుల్ ద్రవిడ్.[5]. ఫిబ్రవరి 6, 2007న వన్డేలలో 10,000 పరుగులు పూర్తిచేసి ఈ ఘనతను సాధించిన ఆరవ బ్యాట్స్‌మెన్ గా, సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీల తర్వాత మూడో భారతీయుడిగా అవతరించాడు.[6] సెప్టెంబర్ 14, 2007న భారత జట్టు నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నట్లు ప్రకటించాడు.[7] ప్రస్తుతం భారత టెస్ట్, వన్డే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మార్చి 29, 2008న దక్షిణాఫ్రికాతో జరిగిన చెన్నై టెస్టులో 10,000 పరుగుల మైలురాయిని అధికమించి ఇందులోనే ఈ ఘనత వహించిన ఆరవ బ్యాట్స్‌మెన్‌గాను, మూడవ భారతీయుడిగాను రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా అతి తక్కువ కెరీర్ సమయంలో 10 వేల పరుగులను పూర్తి చేసిన రికార్డు స్థాపించాడు.[8]

రాహుల్ ద్రవిడ్
2012 లో ద్రవిడ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రాహుల్ శరద్ ద్రవిడ్
పుట్టిన తేదీ (1973-01-11) 1973 జనవరి 11 (వయసు 51)
ఇండోర్, మధ్య ప్రదేశ్
మారుపేరుది వాల్, ది గ్రేట్ వాల్, జామీ, మిస్టర్ డిపెండబుల్[1]
ఎత్తు1.80 మీ. (5 అ. 11 అం.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి వాటం ఆఫ్ బ్రేక్
పాత్రబ్యాట్స్‌మన్, అప్పుడప్పుడు వికెట్ కీపరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 207)1996 జూన్ 20 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు2012 జనవరి 24 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 95)1996 ఏప్రిల్ 3 - శ్రీలంక తో
చివరి వన్‌డే2011 సెప్టెంబరు 16 - ఇంగ్లాండ్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.19
ఏకైక T20I (క్యాప్ 38)2011 ఆగస్టు 31 - ఇంగ్లాండ్ తో
T20Iల్లో చొక్కా సంఖ్య.19
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1990–2012కర్ణాటక
2000Kent
2003Scottish Saltires
2008–2010రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్
2011–2013రాజస్థాన్ రాయల్స్
ప్రధాన కోచ్‌గా
Yearsజట్టు
2015–2021India U-19
2015–2021India A
2021–India
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫస్ట్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 164 344 298 449
చేసిన పరుగులు 13,288 10,889 23,794 15,271
బ్యాటింగు సగటు 52.31 39.16 55.33 42.30
100లు/50లు 36/63 12/83 68/117 21/112
అత్యుత్తమ స్కోరు 270 153 270 153
వేసిన బంతులు 120 186 617 477
వికెట్లు 1 4 5 4
బౌలింగు సగటు 39.00 42.50 54.60 105.25
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/18 2/43 2/16 2/43
క్యాచ్‌లు/స్టంపింగులు 210/0 196/14 353/1 233/17
మూలం: ESPNcricinfo, 2012 జనవరి 30

అంతేకాకుండా కెరీర్ లో 10 వేల పరుగులను వన్డేలలో, టెస్టులో పూర్తి చేసిన ప్రపంచ మూడవ ఆటగాడు. ఇప్పటికి ఆ ఘనతను సాధించినది సచిన్ టెండుల్కర్, బ్రియాన్ లారా మాత్రమే.

ఆయన 2021 నుండి 2024 వరకు భారత జట్టు కోచ్​గా పని చేశాడు.[9][10]

కాలరేఖ

మార్చు
  • 1991: రంజీ ట్రోఫిలో ఆరంగేట్రం
  • 1996: రంజీట్రోఫిలో డబుల్ సెంచరీ సాధించాడు.
  • 1996: టెస్ట్ క్రికెట్‌లో రంగప్రవేశం (ఇంగ్లాండుపై, లార్డ్స్‌లో)
  • 1997: తొలి టెస్ట్ సెంచరీ దక్షిణాఫ్రికాపై జొహన్నెస్‌బెర్గ్‌లో సాధించాడు
  • 1999: ఒకే టెస్ట్ రెండు ఇన్నింగ్సులలోనే సెంచరీ సాధించాడు. (న్యూజీలాండ్ పై, హామిల్టన్‌లో)
  • 2001: వి.వి.యెస్.లక్ష్మణ్తో కలిసి ఆస్ట్రేలియాపై ఐదవ వికెట్టుకు 376 పరుగుల భాగస్వామ్యం నమోదుచేశాడు.
  • 2004: రావల్పిండిలో పాకిస్తాన్ పై 270 పరుగులు చేసిన తన అత్యుత్తమ స్కోరు మెరుగుపర్చుకున్నాడు.
  • 2005: టెస్ట్, వన్డే క్రికెట్‌కు భారత జట్టు కెప్టెన్‌గా పగ్గాలు స్వీకరించాడు.
  • 2008: టెస్ట్ క్రికెట్‌లో 10000 పరుగుల మైలురాయిని అధికమించాడు.
  • 2009: అలాన్ బోర్డర్ రికార్డును వెనక్కి నెట్టి టెస్టులలో అత్యధిక పరుగులు చేసిన నాలుగవ బ్యాట్స్‌మెన్‌గా అవతరించాడు.

అవార్డులు

మార్చు
 
పద్మశ్రీ పురస్కారం
  • 1999: 1999 ప్రపంచ కప్ సియెట్ క్రికెటర్‌గా ఎంపికైనాడు.
  • 2000: విజ్డెన్ క్రికెటర్‌గా ఎంపికయ్యాడు.[11]
  • 2004: గార్‌ఫీల్డ్ ట్రోఫి విజయం. ) [12]
  • 2004: భారత ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డుచే సత్కరించబడ్డాడు.[13]
  • 2004: ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైనాడు.

రికార్డులు

మార్చు
  • టెస్ట్ క్రికెట్‌లో 10000 పరుగులు పూర్తి చేసిన ఆరవ బ్యాట్స్‌మెన్ (మూడవ భారతీయుడు)
  • టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక భాగస్వామ్య సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్ (72 సార్లు)
  • టెస్ట్ క్రికెట్‌లో అతి తక్కువ ఇన్నింగ్సులలో 9000 పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మెన్
  • టెస్ట్ క్రికెట్‌లో అతి తక్కువ కెరీర్ సమయంలో 10000 పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మెన్
  • వరుసగా 4 టెస్ట్ ఇన్నింగ్సులలో సెంచరీలు నమోదుచేసిన ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లలో ఒకడు.
  • ఒకే టెస్ట్ రెండు ఇన్నింగ్సులలోనే సెంచరీలను రెండు సార్లు చేసిన బ్యాట్స్‌మెన్‌లలో తొమ్మిదోవాడు (సునీల్ గవాస్కర్ తరువాత రెండో భారతీయుడు)
  • టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక డబుల్ సెంచరీలు (5) చేసిన భారతీయుడు.
  • ఫీల్డర్‌గా అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారతీయుడు
  • వన్డే క్రికెట్‌లో 300పైగా భాగస్వామ్యాలను రెండు సార్లు నమోదుచేసిన ఏకైక బ్యాట్స్‌మెన్.
  • వన్డే క్రికెట్‌లో అత్యధిక భాగస్వామ్య రికార్డు (సచిన్ టెండుల్కర్తో కలిసి న్యూజీలాండ్ పై హైదరాబాదులో 331 పరుగుల పాట్నర్‌షిప్)
  • 1999 ప్రపంచ కప్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాత్స్‌మెన్.
  • వికెట్ కీపర్‌గా ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు పూర్తిచేసిన క్రికెటర్.
  • వన్డే క్రికెట్‌లో కెప్టెన్‌గా అత్యధిక బ్యాటింగ్ సగటు కలిగిన రికార్డు (10 టెస్టుల కంటే అధికంగా కెప్టెన్సీ చేపట్టినవారిలో)
  • వరుసగా 120 వన్డేలలో డకౌట్ కాకుండా రికార్డు.
  • వన్డేలలో అత్యధిక అర్థసెంచరీలు చేసిన మూడవ బ్యాట్స్‌మెన్ (రెండో భారతీయుడు)
  • టెస్టులు, వన్డేలు రెండింటిలోనూ 10000 పరుగులు పూర్తిచేసిన మూడవ బ్యాట్స్‌మెన్ (రెండో భారతీయుడు)

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Jammy: Advertisers' Mr Dependable. The Hindu Businessline. Retrieved 10 March 2010.
  2. "Meet Rahul Sharad Dravid". The Times of India. Retrieved 24 February 2007.
  3. "LG ICC Cricket Rankings".
  4. "Cricinfo - Records - India - Test matches - Highest averages".
  5. "Cricinfo - Records - India - Test matches - Most runs".
  6. "Cricinfo - Dravid joins the 10,000 club".
  7. Resignation from India Cricket Captiancy
  8. ఈనాడు దినపత్రిక, పేజీ 12, తేది మార్చి 30, 2008
  9. Sakshi (30 June 2024). "'ది గ్రేట్ వాల్‌'.. కప్పు కొట్టించాడు! త‌న ప్ర‌స్ధానాన్ని ముగించాడు". Archived from the original on 30 June 2024. Retrieved 30 June 2024.
  10. ETV Bharat News (30 June 2024). "కెప్టెన్​గా విఫలమైనా కోచ్​గా ద్రవిడ్ సక్సెస్​- 17ఏళ్ల తర్వాత అదే గడ్డపై కప్పు సొంతం!". Archived from the original on 30 June 2024. Retrieved 30 June 2024. {{cite news}}: zero width space character in |title= at position 9 (help)
  11. "Rahul Dravid - Wisden Cricketer of the Year". Wisden Almanack. Retrieved 2007-03-27.
  12. "Dravid walks away with honours". The Hindu. 2004-09-09. Archived from the original on 2007-10-01. Retrieved 2007-03-27.
  13. "Rahul Dravid awarded Padma Shri". Deccan Herald. 2004-07-01. Retrieved 2007-03-27.