బ్రజేష్ పాఠక్
బ్రజేష్ పాఠక్ (జననం 25 జూన్ 1964) ఒక భారతీయ రాజకీయ నాయకుడు, ఉత్తర ప్రదేశ్ 18వ శాసనసభ సభ్యుడు. ప్రస్తుతం, అతను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో 7వ ఉప ముఖ్యమంత్రిగా,[1] వైద్య విద్య, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కేబినెట్ మంత్రిగా పనిచేస్తున్నారు.
బ్రజేష్ పాఠక్ | |
---|---|
7వ ఉత్తర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి | |
Assumed office 2022 మార్చి 25 | |
గవర్నర్ | ఆనందిబెన్ పటేల్ |
ముఖ్యమంత్రి | యోగి ఆదిత్యనాథ్ |
మంత్రిత్వ శాఖ & విభాగాలు |
|
అంతకు ముందు వారు | దినేష్ శర్మ |
కేబినెట్ మినిస్టర్, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం | |
In office 2017 మార్చి 19 – 2022 మార్చి 25 | |
మంత్రిత్వ శాఖలు |
|
తరువాత వారు | యోగి ఆదిత్యనాథ్ |
మెంబర్, ఉత్తర ప్రదేశ్ శాసనసభ | |
Assumed office 2022 మార్చి 10 | |
అంతకు ముందు వారు | సురేష్ చంద్ర తివారీ |
నియోజకవర్గం | లక్నో కంటోన్మెంట్ |
In office 2017–2022 | |
అంతకు ముందు వారు | రవిదాస్ మెహ్రోత్రా |
తరువాత వారు | రవిదాస్ మెహ్రోత్రా |
నియోజకవర్గం | లక్నో సెంట్రల్ |
రాజ్యసభ సభ్యుడు | |
In office 2008 నవంబరు 26 – 2014 నవంబరు 25 | |
అంతకు ముందు వారు | అమర్ సింగ్ |
తరువాత వారు | జావేద్ అలీ ఖాన్ |
నియోజకవర్గం | ఉత్తర ప్రదేశ్ |
లోక్‍సభ సభ్యుడు | |
In office 2004–2009 | |
అంతకు ముందు వారు | దీపక్ కుమార్ |
తరువాత వారు | అన్నూ టాండన్ |
నియోజకవర్గం | ఉన్నావ్, ఉత్తర ప్రదేశ్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | మల్లవన్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | 1964 జూన్ 25
రాజకీయ పార్టీ | Bharatiya Janata Party (2016–present) |
ఇతర రాజకీయ పదవులు | Bahujan Samaj Party (2004–2016) |
జీవిత భాగస్వామి | నమ్రతా పాఠక్ |
కళాశాల | లక్నో విశ్వవిద్యాలయం |
వృత్తి | రాజకీయనాయకుడు |
నైపుణ్యం | లాయరు |
As of 2022 మార్చి 29 |
అతను ఉత్తరప్రదేశ్ 17వ శాసనసభలో లా అండ్ జస్టిస్ కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశాడు.అతను 2004 నుండి 2009 వరకు ఉన్నావ్ నియోజకవర్గం నుండి పార్లమెంటు లోక్‍సభ సభ్యుడుగా,2008 నుండి 2014 వరకు పార్లమెంట్ రాజ్యసభ సభ్యునిగా కూడా పనిచేసారు.2022 ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో, అతను లక్నో జిల్లాలోని, లక్నో కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో గెలిచాడు. అతను ఉత్తర ప్రదేశ్‌లో తన వినయం ద్వారా అతని నియోజకవర్గం ప్రజలతో బాగా పాతుకుపోయిన సంబంధానికి పేరుగాంచిన ప్రముఖ నాయకుడిగా కనిపిస్తాడు.[2]
ప్రారంభ జీవితం, విద్య
మార్చుఅతను లక్నో విశ్వవిద్యాలయంలో ఉన్న రోజుల నుండి విద్యార్థి రాజకీయాలు, ప్రజా సేవలో క్రియాశీల సభ్యుడు.1990లో ప్రతిష్టాత్మకమైన లక్నో యూనివర్శిటీకి స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేశాడు.1987లో లక్నో యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్‌లో లా ఫ్యాకల్టీ ప్రతినిధిగా కూడా ఉన్నారు. కబడ్డీ, వాలీబాల్ తనకు ఇష్టమైన క్రీడలు.[2]
వ్యక్తిగత జీవితం
మార్చుబ్రజేష్ పాఠక్ 1964 జూన్ 25న ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయి జిల్లా మల్లవాన్ పట్టణంలో శ్రీ సురేష్ పాఠక్, శ్రీమతి కమ్లా పాఠక్ దంపతులకు జన్మించాడు. అతను నమ్రత పాఠక్‌ను వివాహం చేసుకున్నాడు. వారికి ముగ్గురు పిల్లలు వారిలో ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు.[3]
రాజకీయ జీవితం
మార్చుబ్రజేష్ పాఠక్ లక్నో విద్యార్థి రాజకీయాల నుండి,2004 సార్వత్రిక ఎన్నికలలో, బ్రజేష్ పాఠక్ ఉన్నావ్ లోక్ సభ నియోజకవర్గం నుండి దీపక్ కుమార్‌ను ఓడించి పార్లమెంటు సభ్యుడు అయ్యాడు.తరువాత 2008 నుండి 2014 వరకు రాజ్యసభ సభ్యుడుగా భాగమయ్యాడు.
2017లో, అతను సమాజ్‌వాదీ పార్టీ నుండి రవిదాస్ మల్హోతారాను ఓడించి లక్నో సెంట్రల్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో లా అండ్ జస్టిస్ క్యాబినెట్ మంత్రిగా నియమించబడ్డాడు. అతను 2017 మార్చి 19న లా, శాసనసభ, అదనపు శక్తి వనరులు, రాజకీయ పెన్షన్ల కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019 ఆగస్టు 21న, యోగి ప్రభుత్వంలో మొదటి మంత్రివర్గ విస్తరణ తర్వాత, అతని పోర్ట్‌ఫోలియో శాసనసభ, న్యాయ, గ్రామీణ ఇంజనీరింగ్ సేవల మంత్రిగా మార్చబడింది. 2022 మార్చి 25న, అతను ఉత్తరప్రదేశ్ 7వ ఉప ముఖ్యమంత్రి అయ్యాడు.
అతను పార్లమెంటు సభ్యుడిగా ఉన్న సమయంలో, అతను పబ్లిక్ గ్రీవెన్స్ కమిటీ, లా అండ్ జస్టిస్ కమిటీ, బిజినెస్ అడ్వైజరీ కమిటీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, హోం మంత్రిత్వ శాఖ సభ్యుడు,డీలిమిటేషన్ కమిషన్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నారు. సభ్యుడు, విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ, ప్రివిలేజెస్ కమిటీ,బొగ్గు, ఉక్కుపై స్టాండింగ్ కమిటీ,ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీ, ఎన్.సి.సి. పై జాతీయ కమిటీ సభ్యుడు. రైల్వేస్‌పై కమిటీ,పెట్రోలియం,సహజ వాయువు మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ, హోం వ్యవహారాల కమిటీ,సాధారణ ప్రయోజనాల కమిటీ,హౌస్ కమిటీ సభ్యుడు, ఆరోగ్య. కుటుంబ సంక్షేమ కమిటీ ఛైర్మన్‌గా నామినేట్ అయ్యారు.
మూలాలు
మార్చు- ↑ "Uttar Pradesh Chief Minister Office Lucknow". upcmo.up.nic.in. Retrieved 2024-11-03.
- ↑ 2.0 2.1 News, India TV. "Brajesh Pathak Latest News, Profile, Biography, Photos and Videos". India TV News (in ఇంగ్లీష్). Retrieved 2024-11-03.
{{cite web}}
:|last=
has generic name (help) - ↑ "Uttar Pradesh Legislative Assembly (UPLA): Member info". web.archive.org. 2022-10-17. Archived from the original on 2022-10-17. Retrieved 2024-11-03.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)