బ్రాడ్ గేజ్ రైల్వే

రైలు మార్గాల గేజ్‌లలో కెల్లా అతిపెద్ద గేజ్

1,435 మి.మీ. కంటే విశాలమైన ట్రాక్ గేజ్ (పట్టాల మధ్య దూరం) ఉన్న రైలు మార్గాన్ని బ్రాడ్-గేజ్ రైల్వే అంటారు.

Graphic list of track gauges

ఐబీరియన్ గేజ్ అనే 1,668 mm (5 ft 5+2132 in) బ్రాడ్ గేజ్‌ను స్పెయిన్ పోర్చుగల్ లలో వాడతారు.

1,520 మి.మీ. వెడల్పు ఉండే బ్రాడ్ గేజ్‌ను మాజీ సోవియట్ యూనియన్ దేశాలలో (CIS రాష్ట్రాలు, బాల్టిక్ రాష్ట్రాలు, జార్జియా, ఉక్రెయిన్, మంగోలియా) ఎక్కువగా వాడేవారు. దీన్ని రష్యన్ గేజ్ అంటారు. ఫిన్లాండ్‌లో సాధారణంగా ఐదు అడుగుల గేజ్ అనే పేరున్న 1,524 మి.మీ. గేజ్‌ను ప్రధానంగా ఉపయోగిస్తారు. ఐరిష్ గేజ్ అనే పేరున్న 1,600 mm (5 ft3 in) బ్రాడ్ గేజ్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా రాష్ట్రమైన విక్టోరియా, దక్షిణ ఆస్ట్రేలియా లోని అడిలైడ్, బ్రెజిల్‌లో ప్రయాణీకుల రైళ్లకూ వాడతారు.

1,676 mm (5 ft 6 in) ఉండే బ్రాడ్ గేజ్‌ను భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అర్జెంటీనా, చిలీ, శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలలో వినియోగిస్తారు. దీన్ని సాధారణంగా ఇండియన్ గేజ్ అంటారు. ప్రపంచంలో సాధారణ ఉపయోగంలో ఉన్న అత్యంత విశాలమైన గేజ్ ఇది. ఐబీరియన్ గేజ్, ఇండియన్ గేజ్ లు రెండింటి పైనా ఎటువంటి మార్పులు లేకుండా రైళ్లు ప్రయాణించడం సాధ్యమవుతుంది.

5 అడుగుల 6 అంగుళాల గేజ్‌ను మొదట గ్రేట్ బ్రిటన్‌, స్కాట్లాండ్‌లలోని డూండీ అర్బ్రోత్ రైల్వే (1836-1847), అర్బ్రోత్ ఫోర్ఫర్ రైల్వే (1838- 1848) అనే రెండు చిన్న, వివిక్త మార్గాలలో ఉపయోగించారు. తదనంతరం ఈ రెండు లైన్లనూ స్టాండర్డ్ గేజ్‌గా మార్చి, స్కాటిష్ రైలు నెట్‌వర్క్‌కు అనుసంధానించారు.

5 అడుగుల 6 అంగుళాల గేజ్

మార్చు

5 అడుగుల 6 అంగుళాల గేజ్‌ను మొదట గ్రేట్ బ్రిటన్‌, స్కాట్లాండ్‌లలోని డూండీ అర్బ్రోత్ రైల్వే (1836-1847), అర్బ్రోత్ ఫోర్ఫర్ రైల్వే (1838- 1848) అనే రెండు చిన్న, వివిక్త మార్గాలలో ఉపయోగించారు. తదనంతరం ఈ రెండు లైన్లనూ స్టాండర్డ్ గేజ్‌గా మార్చి, స్కాటిష్ రైలు నెట్‌వర్క్‌కు అనుసంధానించారు.

తరువాత ఈ గేజ్‌ను ప్రావిన్స్ ఆఫ్ కెనడా, బ్రిటిషు భారతదేశం వంటి అనేక బ్రిటిషు వలస రాజ్యాల్లో ప్రమాణంగా స్వీకరించారు.

1851లో, 5 అడుగులు 6 అంగుళాల బ్రాడ్ గేజ్ అధికారికంగా కెనడా ప్రావిన్స్‌కు ప్రామాణిక గేజ్‌గా స్వీకరించారు. దీన్ని ప్రొవిన్షియల్ గేజ్‌గా అనేవారు. వేరే గేజ్‌లను ఎంచుకున్న రైల్వేలకు ప్రభుత్వ రాయితీలు ఉండేవి కావు. 1872 - 1874 మధ్య, అమెరికన్ రైల్వేలతో పరస్పర మార్పిడి, రోలింగ్ స్టాక్‌ల మార్పిడిని సులభతరం చేయడానికి కెనడియన్ బ్రాడ్-గేజ్ లైన్లను ప్రామాణిక గేజ్‌గా మార్చారు. నేడు, కెనడియన్ రైల్వేలన్నీ స్టాండర్డ్-గేజ్‌గానే ఉన్నాయి.

USలో, మొదట్లో ఈ గేజ్‌ను అనేక లైన్ల కోసం వాడినప్పటికీ, త్వరలోనే వీటిని స్టాండర్డ్ గేజ్‌కు అనుకూలంగా మార్చారు. నేడు, కాలిఫోర్నియా బే ఏరియా రాపిడ్ ట్రాన్సిట్ (BART) మాత్రమే ఈ గేజ్‌ని ఉపయోగిస్తోంది.

బ్రిటిషు భారతదేశంలో, ప్రారంభ కాలంలో ప్రామాణిక గేజ్‌లో కొన్ని సరుకు రవాణా రైలు మార్గాలను నిర్మించారు. అయితే వాటిని తరువాత తీసేసారు. 1850 వ దశకంలో, గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే, బోరి బందర్, థానేల మధ్య మొదటి ప్రయాణీకుల రైలుమార్గాన్ని 5 అడుగులు 6 అంగుళాల గేజ్‌తో నిర్మించింది.[1][2] ఆ తరువాత ఈ గేజ్‌ను దేశవ్యాప్తంగా ప్రమాణంగా స్వీకరించారు. నిర్మాణ వ్యయాన్ని తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా 1,000 mm (2 ft 3 + 3⁄8 in) గేజ్‌ను, ఆ తరువాత 2 ft 6 in (762 mm), 2 అడుగుల గేజ్‌లనూ అనేక ద్వితీయ స్థాయి, శాఖామార్గాల కోసం న్యారో గేజ్‌లను వాడారు. 20వ శతాబ్దం చివరి భాగంలో, పరస్పర మార్పిడి, నిర్వహణ సమస్య కారణంగా, భారత ఉపఖండం ప్రతి దేశంలోని రైల్వేలు అన్ని మీటర్-గేజ్, న్యారో గేజ్ మార్గాలను బ్రాడ్ గేజ్‌గా మార్చడం ప్రారంభించాయి. నేడు, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్ దేశవ్యాప్త రైలు నెట్వర్క్ పూర్తిగా ఈ గేజ్ పైనే ఉంది. కాగా ప్రాజెక్ట్ యూనిగేజ్ కింద భారతదేశం,[3] బంగ్లాదేశ్ లలో గేజ్ మార్పిడి ఇంకా జరుగుతూనే ఉంది.

సాధారణ ప్రయాణీకుల వినియోగంలో ఈ గేజ్ ప్రపంచంలోనే అత్యంత విశాలమైన గేజ్.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Railroads Asia - Up And Down India".
  2. Indian Railways: Some Fascinating Facts, “Train Atlas”, Train Atlas, Indian Railways, 2003
  3. "Indian Railways: Glorious History". Press Information Bureau, Government of India. New Delhi: Ministry of Railways. 21 February 2007. Retrieved 1 February 2020. The Project Unigauge was launched on April 1, 1992 to develop the backward regions and to connect important places with broad gauge network.