కెప్టెన్ బ్రిజేష్ చౌతా (జననం 31 ఆగస్టు 1981) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో దక్షిణ కన్నడ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

కెప్టెన్ బ్రిజేష్ చౌతా

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు నళిన్ కుమార్ కటీల్
నియోజకవర్గం దక్షిణ కన్నడ

వ్యక్తిగత వివరాలు

జననం (1981-08-31) 1981 ఆగస్టు 31 (వయసు 43)
మంగళూరు , కర్ణాటక, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు శేషన్న చౌతా, పుష్పా చౌతా
వృత్తి రాజకీయ నాయకుడు

జననం, విద్యాభాస్యం

మార్చు

బ్రిజేష్ చౌతా 1981 ఆగస్టు 31న కర్ణాటక రాష్ట్రం, మంగళూరులో శేషన్న చౌతా, పుష్పా చౌతా దంపతులకు జన్మించాడు. ఆయన 2002 సంవత్సరంలో మంగుళూరు విశ్వవిద్యాలయంలోని సెయింట్ అలియోస్ కళాశాల నుండి బీఎస్సీ పూర్తి చేసి ఆ తర్వాత 2010లో ఇండోర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

మార్చు

బ్రిజేష్ చౌతా భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో దక్షిణ కన్నడ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పద్మరాజ్ పూజారిపై 1,49208 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]

మూలాలు

మార్చు
  1. The Week (30 June 2024). "Captain Brijesh Chowta: From the 8th Gorkha Rifles to Parliament" (in ఇంగ్లీష్). Archived from the original on 28 July 2024. Retrieved 28 July 2024.
  2. Times Now (25 April 2024). "Who Is Captain Brijesh Chowta, BJP's Fresh Face Replacing Current MP From Karnataka's Dakshina Kannada" (in ఇంగ్లీష్). Archived from the original on 28 July 2024. Retrieved 28 July 2024.
  3. TV9 Bharatvarsh (7 June 2024). "दक्षिण कन्नड़ सीट से बीजेपी के कैप्टन ब्रिजेश चौटा को मिली शानदार जीत, जानें अपने सांसद को". Archived from the original on 28 July 2024. Retrieved 28 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)