బ్రూస్ మెక్ కాండ్లెస్స్ II

(బ్రూస్‌ మెక్‌ కాండ్లెస్స్‌ II నుండి దారిమార్పు చెందింది)

బ్రూస్ మెక్ కాండ్లెస్స్ II ( 1937 జూన్ 8 – 2017 డిసెంబరు 21) అమెరికా సంయుక్త రాష్ట్రాల నావికాదళ అధికారి, వైమానికుడు, నాసా వ్యోమగామి. అతడు నాసా తరపున తొలిసారి అంతరిక్షంలో స్వేచ్ఛా విహారం చేసిన యాత్రికుడు. 1984లో ఛాలెంజర్‌ స్పేస్‌ షటిల్‌లో ప్రయాణించిన ఆయన అంతరిక్షంలో ఎలాంటి ఆధారం లేకుండా తేలియాడిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఆయన అలా తేలుతున్న ఫోటోకు ఐకానిక్‌ ఫోటోగా గుర్తింపు కూడా లభించింది.

బ్రూస్ మెక్ కాండ్లెస్స్ II
జననం(1937-06-08)1937 జూన్ 8
బోస్టన్, యు.ఎస్.ఏ
మరణం2017 డిసెంబరు 21(2017-12-21) (వయసు 80)
సమాధి స్థలంయునైటెడ్ స్టేట్స్ నేవల్ అకాడమీ సెమెటెరీ
జాతీయతఅమెరికా
ఇతర పేర్లుబ్రూస్ మెక్ కాండ్లెస్స్ II
విద్యాసంస్థయునైటెడ్ స్టేట్స్ నేవల్ అకాడమీ , B.S. 1958
స్టాన్‌ఫర్డు విశ్వవిద్యాలయం, M.S. 1965
హోస్టన్ క్లియర్ లేక్ విశ్వవిద్యాలయం , MBA 1987
వృత్తినావికాదళ వైమానికిడు, ఇంజనీర్
అంతరిక్ష జీవితం
నాసా వ్యోమగామి
ర్యాంకు25 కెప్టెన్, యునైటెడ్ స్టేట్స్ నేవీ
అంతరిక్షంలో గడిపిన కాలం
13రోజుల 00గంటల 31నిమిషాలు
ఎంపిక1966 నాసా గ్రూపు 5
మొత్తం ఇ.వి.ఎ.లు
2
మొత్తం ఇ.వి.ఎ సమయం
12 గంటలు 12 నిమిషాలు[1]
అంతరిక్ష నౌకలుSTS-41-B, STS-31
అంతరిక్ష నౌకల చిత్రాలు
పదవీవిరమణఆగస్టు 31, 1990
జీవిత భాగస్వామిBernice Doyle McCandless, Ellen Shields McCandless
పిల్లలు2

ప్రారంభ జీవితం, విద్య మార్చు

కాండ్లెస్స్ 1937 జూన్ 8 న బోస్టన్, మస్సాచుసెట్ట్స్ లో జన్మించాడు.[2] అతడు మూడవ తరం యు.ఎస్.నేవీ అధికారి. అతడు "బ్రూస్ మెక్ కాండ్లెస్" కుమారుడు, "విల్లిస్ డబ్ల్యూ. బ్రాడ్లీ" మనుమడు. వారిద్దరూ యుద్ద వీరులు. అతడు 1954 లో కాలిఫోర్నియాలోని వుడ్రో విల్సన్ సీనియర్ ఉన్నత పాఠశాలలో గ్రాడ్యుయేషన్ చేసాడు. [2]

1968లో యునైటెడ్ స్టేట్స్ నేవల్ అకాడమీ నుండి బ్యాచిలర్స్ ఆఫ్ సైన్స్ పట్టాను పొందాడు. [2] వృత్తి జీవితంలో అతడు 1965లో స్టాన్‌ఫర్డు విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్ ఆఫ్ సైన్స్ పట్టాను పొందాడు.1987లో హోస్టన్-క్లియర్ లేక్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ ఆఫ్ బిజినెస్ మేనేజిమెంటు చేసాడు.[2]

యునైటెడ్ స్టేట్స్ నేవీ మార్చు

ఫ్లోరిడా లోని నేవల్ ఎయిర్ స్టేషన్ పెన్సకోలా, టెక్సాస్ లోని నేవల్ ఎయిర్ స్టేషన్ కింగ్స్‌విల్ నుండి విమాన చోదక శిక్షణను పొందాడు.

మార్చి 1960లో యునైటెడ్ స్టేట్స్ నేవల్ ఆవియేటర్ హోదాను పొందాడు. ఆయుధాల వ్యవస్థ కొరకు నేవల్ ఎయిర్ స్టేషన్ కీ వెస్ట్ లో చేరాడు. డగ్లస్ F4D-1 స్కైరేలో లేండింగ్ శిక్షణను పొందాడు. [3]

1960 డిసెంబరు, 1964 ఫిబ్రవరి మధ్య "ఫైటర్ స్క్వార్డన్ 102", ఫ్లయింగ్ స్కైరే, మెక్ డోనెల్ డగ్లస్ F4B ఫాంటం II లకు నియమితుడయ్యాడు. అతడు క్యూబా క్షిపణి సంక్షోభంలో పాల్గొన్నాడు. [4]

1964లో అతడు వర్జీనియాలోని నేవల్ ఎయిర్ స్టేషన్ ఓసియానా వద్ద స్క్వార్డన్ 43 దాడిలో ఫైట్ బోధకునిగా ఉన్నాడు. తరువాత స్టాన్‌ఫర్డు విశ్వవిద్యాలయం లోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో నేవల్ రిజర్వ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ కార్ప్స్ లో పనిచేసాడు.

అతడు 5,200 గంటలకు పైగా వైమానికునిగా ఎగురుతూ గడిపాడు. దానిలో జెట్ ఎయిర్ క్రాప్ట్ లో 5,000 గంటలు ఉన్నాయి.[5]

నాసా కెరీర్ మార్చు

1966 ఏప్రిల్ లో తన 28వ ఏట నాసా వ్యోమగామి గ్రూప్ 5 లో యువ సభ్యునిగా ఎంపిక కాబడ్డాడు.[6] చంద్రునిపై మొదటిసారి కాలుమోపిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అంతరిక్ష యాత్ర చేసిన అపోలో 11 కు "మిషన్ కంట్రోల్ కాప్సూల్ కమ్యూనికేటర్"గా ఉన్నాడు. [7] స్కైలాబ్ 3, స్కైలాబ్ 4 లకు మిషన్ కంట్రోల్ కాప్సూల్ కమ్యూనికేటర్ గా పనిచేసాడు.

అతడు అంతరిక్షంలో మొత్తం 312 గంటలు గడిపాడు. అందులో MMU ఫైట్ కాలం 4 గంటలు. [8] STS-41-B, STS-31 పై మిషన్ స్పెషలిస్టుగా ఎగిరాడు.[9]

పురస్కారాలు మార్చు

  • నాసా ఎక్సెప్షనల్ సర్వీస్ మెడల్ (1974) [10]
  • నేషనల్ డిఫెన్స్ సరీస్ మెడల్ (1974) [10]
  • ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఎక్స్‌పెందిషనరీ మెడల్ (1974) [10]
  • అమెరికన్ ఆస్ట్రనాటిక్స్ సొసైటీ విక్టర్ ఎ.ప్రథెర్ అవార్డు. (1975, 1985) [10]
  • నాసా స్పేస్ ఫ్లైట్ మెడల్ (1984) [10]
  • డెఫెన్స్ డిస్టింగ్విష్‌డ్ సర్వీస్ మెడల్ (1985) [10]
  • నాసా ఎక్సెప్షనల్ ఇంజనీరింగ్ అచీవ్‌మెంటు మెడల్ (1985) [10]
  • నేషనల్ ఏరోనాటిచ్ అసోసియేషన్ కోలీర్ ట్రోఫీ (1984) [10]
  • లెగియన్ ఆఫ్ మెరిట్ (1988) [10]
  • యునైటెడ్ స్టేట్స్ ఆస్ట్రనాట్ హాల్ ఆఫ్ ఫేం (2005) [11]

మూలాలు మార్చు

  1. Becker, Joachim. "Bruce McCandless - EVA experience". spacefacts.de. Retrieved 2018-04-14.
  2. 2.0 2.1 2.2 2.3 "The first human to make an untethered, free flight spacewalk". New Mexico Museum of Space History. Archived from the original on 2017-06-12. Retrieved December 23, 2017.
  3. "International Space Hall of Fame :: New Mexico Museum of Space History  :: Inductee Profile". www.nmspacemuseum.org. Archived from the original on 2017-06-12. Retrieved 2018-04-14.
  4. "International Space Hall of Fame :: New Mexico Museum of Space History  :: Inductee Profile". www.nmspacemuseum.org. Archived from the original on 2017-06-12. Retrieved 2018-04-14.
  5. "Astronaut Bio: Bruce McCandless II". www.jsc.nasa.gov. Retrieved 2018-04-14.
  6. Hersch, M. (October 8, 2012). "Inventing the American Astronaut". Springer – via Google Books.
  7. "BRUCE MCCANDLESS, CAPCOM FOR APOLLO 11, VISITS KENNEDY SPACE CENTER, DISCUSSES HISTORIC MISSION". Spaceflight Insider. Retrieved December 23, 2017.
  8. Loff, Sarah (2017-12-21). "NASA Remembers Astronaut Bruce McCandless II". NASA (in ఇంగ్లీష్). Archived from the original on 2017-12-24. Retrieved 2018-04-14.
  9. "NASA Remembers Astronaut Bruce McCandless II". NASA. December 22, 2017. Archived from the original on 2017-12-24. Retrieved December 23, 2017.
  10. 10.0 10.1 10.2 10.3 10.4 10.5 10.6 10.7 10.8 "Bruce McCandless II NASA Biography". NASA. Retrieved December 23, 2017.  This article incorporates text from this source, which is in the public domain.
  11. "The first human to make an untethered, free flight spacewalk". New Mexico Museum of Space History. Archived from the original on 2017-06-12. Retrieved December 23, 2017.

బయటి లింకులు మార్చు