నీల్ ఆర్మ్స్ట్రాంగ్
నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ (ఆంగ్లం :Neil Alden Armstrong) (ఆగస్టు 5, 1930 - ఆగష్టు 25, 2012) అ.సం.రా.నికి చెందిన ఒక పూర్వపు వ్యోమగామి, పరీక్షా చోదకుడు (పైలట్), విశ్వవిద్యాలయపు ప్రొఫెసర్, మరియు యు.ఎస్. నావికదళ చోదకుడు (అవియేటర్). ఇతను చంద్రుడిపై కాలు మోపిన మొదటి మానవుడు. ఇతడి మొదటి అంతరిక్ష నౌక జెమినీ 8 1966 లో ప్రయోగింపబడినది, దీనికి ఇతను మొదటి కమాండ్ పైలట్. ఈ కార్యక్రమంలో, మొదటి మానవ సహిత అంతరిక్ష నౌక లో తోటి పైలట్ డేవిడ్ స్కాట్తో ప్రయాణించాడు. ఆర్‌మ్‌స్ట్రాంగ్ యొక్క రెండవ మరియు ఆఖరి దఫా అంతరిక్ష ప్రయాణం అపోలో 11 చంద్రుడిపై యాత్ర మిషన్ కొరకు జూలై 20 1969 న అమలుపరచబడింది. ఈ మిషన్ లో ఆర్మ్స్ట్రాంగ్ మరియు బజ్జ్ ఆల్డ్రిన్ చంద్రుడిపై కాలుమోపి రెండున్నర గంటల సమయం సంచరించారు. ఆ సమయంలో మైకేల్ కాలిన్స్ కమాండ్ మాడ్యూల్ నందే ఉండి కక్ష్యలో పరిభ్రమించసాగాడు. ఆర్‌మ్‌స్ట్రాంగ్ కు అంతరిక్షయాత్రల గౌరవ పతాకం ప్రసాదింపబడింది.
నీల్ ఆర్మ్స్ట్రాంగ్ | |
---|---|
![]() | |
అమెరికా నేవీ/నాసా వ్యోమగామి | |
జాతీయత | అమెరికన్ |
ప్రస్తుతం | పదవీ విరమణ - వ్యోమగామి |
జననం | వపాకొనేటా, ఓహియా, అమెరికా. | 1930 ఆగస్టు 5
మునుపటి వృత్తి |
నౌకాదళ విమాన చోదకుడు, పరీక్షా చోదకుడు |
అంతరిక్షంలో గడిపిన కాలం | 8 రోజులు, 14 గంటలు మరియు 12 నిముషాలు |
ఎంపిక | 1958 MISS; 1960 డైనా-సోర్; 1962 నాసా వ్యోమగాముల గ్రూప్ 2 |
మిషన్ | జెమినీ 8, అపోలో 11 |
Mission insignia |
![]() ![]() |
చంద్రుడిపై యాత్రసవరించు
అనుభవాలుసవరించు
అపోలో-11 నింగికెగిసిన తరువాత ఆర్‌మ్‌స్ట్రాంగ్ గుండె లయ నిముషానికి 109 చొప్పున విపరీతంగా పెరిగింది. జెమిని-8 వాహనంలో ఉన్న శబ్దంకన్నా విపరీతస్థాయిలో అపోలో 11 శబ్దం ఉంది. ఈ విపరీత పరిణామాలలో ఏర్పడే అంతరిక్ష దౌర్బల్యాన్ని తట్టుకుని, అంతరిక్షంలోగి ఎగిసినపుడు మానసికంగా కలిగే గతి దౌర్బల్యము మరియు భయావహనం మొదలగువాటిని అనుభవించాడు.
చంద్రుడిపై మొదటి మానవుని నడకసవరించు
ఇవీ చూడండిసవరించు
గ్రంధాలుసవరించు
Wikimedia Commons has media related to నీల్ ఆర్మ్స్ట్రాంగ్. |
- Hansen, James R. (2005). First Man: The Life of Neil A. Armstrong. Simon & Schuster. ISBN 0-7432-5631-X.
- Kranz, Gene (2000). Failure is not an Option: Mission Control From Mercury to Apollo 13 and Beyond. Simon & Schuster. ISBN 0-7432-0079-9.
- Andrew Smith (2005). In Search of the Men Who Fell to Earth: Moondust. Bloomsbury. ISBN 0-7475-6368-3.
- Francis French and Colin Burgess (2007). In the Shadow of the Moon: A Challenging Journey to Tranquility, 1965-1969.
- Cambridge Biographical Dictionary (1990). Cambridge: Cambridge University Press.