బ్లెయిర్ హార్ట్‌ల్యాండ్

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

బ్లెయిర్ రాబర్ట్ హార్ట్‌ల్యాండ్ (జననం 1966, అక్టోబరు 22) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. న్యూజీలాండ్ క్రికెట్ జట్టు తరపున తొమ్మిది టెస్టులు, 16 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.[1] స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ గా రాణించాడు. సాధారణంగా ఇన్నింగ్స్ ప్రారంభించి తన సీనియర్ కెరీర్‌లో మొత్తం మూడు ఓవర్లు బౌలింగ్ చేశాడు. కాంటర్‌బరీ మాజీ క్రికెటర్ ఇయాన్ హార్ట్‌ల్యాండ్ కుమారుడు. ఇతను చాలా ప్రతిభావంతుడైన హాకీ ఆటగాడు కూడా.

బ్లెయిర్ హార్ట్‌ల్యాండ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
బ్లెయిర్ రాబర్ట్ హార్ట్‌ల్యాండ్
పుట్టిన తేదీ22 October 1966 (1966-10-22) (age 58)
క్రైస్ట్‌చర్చ్, కాంటర్‌బరీ, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 175)1992 18 January - England తో
చివరి టెస్టు1994 2 June - England తో
తొలి వన్‌డే (క్యాప్ 81)1992 9 November - Zimbabwe తో
చివరి వన్‌డే1994 19 December - Pakistan తో
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI FC LA
మ్యాచ్‌లు 9 16 83 68
చేసిన పరుగులు 303 311 3,753 1,705
బ్యాటింగు సగటు 16.83 20.73 26.42 26.23
100లు/50లు 0/1 0/2 5/19 2/9
అత్యుత్తమ స్కోరు 52 68* 150 161
వేసిన బంతులు 0 0 0 18
వికెట్లు 1
బౌలింగు సగటు 22.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 1/14
క్యాచ్‌లు/స్టంపింగులు 5/– 5/– 52/– 19/1
మూలం: Cricinfo, 2017 2 May

అంతర్జాతీయ కెరీర్

మార్చు

1991లో ఇంగ్లీష్ క్రికెట్ జట్టు న్యూజీలాండ్‌ను సందర్శించినప్పుడు న్యూజీలాండ్ ఎమర్జింగ్ ప్లేయర్స్ జట్టు కోసం హార్ట్‌ల్యాండ్ ఆడడం ప్రారంభించాడు. తన రెండు ఇన్నింగ్స్‌లలో 36 బంతులు ఎదుర్కొన్నప్పటికీ, రెండుసార్లు కేవలం ఒక పరుగుకే అవుటయ్యాడు.[2]

1992–93లో జింబాబ్వే, శ్రీలంక పర్యటనలకు వెళ్ళాడు. జింబాబ్వేతో టెస్టు ఆడనప్పటికీ ఆ పర్యటనలో తన మొదటి వన్డే ఆడాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో మూడవ నంబర్ నుండి ఐదు పరుగులు చేయడంతో న్యూజీలాండ్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది.[3]

మూలాలు

మార్చు
  1. "Blair Hartland Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-02.
  2. "Tour Match, England tour of New Zealand at Hamilton, Jan 3-5 1992 Match Summary". ESPNCricinfo. Retrieved 6 December 2017.
  3. "ZIM vs NZ, New Zealand tour of Zimbabwe 1992/93, 2nd ODI at Harare, November 08, 1992 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-02.

బాహ్య లింకులు

మార్చు