భండారా , మహారాష్ట్ర లోని భండారా జిల్లాకు చెందిన పురపాలక సంధ పట్టణం.ఇది భండారా జిల్లా కేంద్రం

Bhandara
भंडारा
Bhannara
City
Nickname(s): 
Brass City and Rice Bowl City Of India
Country India
రాష్ట్రంమహారాష్ట్ర
ప్రాంతంVidarbha
జిల్లాBhandara
Government
 • TypeMunicipal Council
 • BodyBhandara Municipal Council
విస్తీర్ణం
 • Total18 కి.మీ2 (7 చ. మై)
Elevation
244 మీ (801 అ.)
జనాభా
 (2011)
 • Total91,845
 • జనసాంద్రత5,100/కి.మీ2 (13,000/చ. మై.)
DemonymBhandarian
భాషలు
 • అధికారMarathi
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
441904, 441905, 441906
టెలిఫోన్ కోడ్+91-7184
Vehicle registrationMH-36
లింగ నిష్పత్తి982 (1000 మంది పురుషులకు) /
Websitehttp://www.bhandara.gov.in

ప్రత్యేకతలు

మార్చు
 
భండారాలో లభించిన బౌద్ధ శిల్పం

భండారా ఒక వ్యవసాయకేంద్రం. ఇక్కడ వరి విస్తారంగా పండించబడుతుంది. నగరంలో అధికంగా మారాఠీ వాడుకలో ఉంది. నగరం నుండి జాతీయరహదారి- 6 పోతుంది. నగరాన్ని వైనగంగా, సూర్ నదులు విభజిస్తున్నాయి.

ఆర్ధికం

మార్చు

భండారా నగరంలో ఆర్డినెంస్, అశోక్ లేలాండ్, సన్ ఫ్లాగ్ ఐరన్ పరిశ్రమలు ఉన్నాయి.

ప్రజలు

మార్చు

భండారాలో నొగ్యాలింగ్ టిబెటన్ సెటిల్మెంట్ ఉంది. 1972లో స్థాపించబడింది. ఇక్కడ దాదాపు 1000 మది టిబెటియన్లు నివసిస్తున్నారు. టిబెటన్లు నివసిస్తున్న నొగ్యాలింగ్‌ను నోర్గ్యేలింగ్, నొర్గలింగ్ అనికూడా పిలుస్తారు.[1]

భౌగోళికం

మార్చు

భండారా 21.17 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 79.65 డిగ్రీల దక్షణ రేఖాంశంలో ఉంది.[2] నగరం సముద్రమట్టానికి సరాసరి ఎత్తు 244 మీ.

ఆర్ధికం

మార్చు

భండారా ఆర్థికంగా వ్యవసాయం, పరిశ్రమలు, ఆటవీ వనరుల మీద ఆధారపడి ఉంది. భండారాలో వరి విస్తారంగా పండించబడుతుంది. చేతితో నేసిన పట్టువస్త్రాలకు భండారా ప్రసిద్ధి. వీటిని హల్బా కోష్టి గిరిజనులు తయారుచేస్తారు.

వాతావరణం

మార్చు

నగరంలో వాతావరణం అన్ని సీజన్లలో అధికంగా ఉంటుంది. ఉష్ణోగ్రత 45 డిగ్రీలు సెల్షియస్ ఉంటుంది. శీతాకాలాలు కూడా అతిశీతలంగా ఉంటాయి. ఉష్ణోగ్రత 8 డిగ్రీలు సెల్షియస్ ఉంటుంది.

శీతోష్ణస్థితి డేటా - Bhandara
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అధిక °C (°F) 27.6
(81.7)
31.1
(88.0)
35.2
(95.4)
39.0
(102.2)
42.1
(107.8)
38.1
(100.6)
30.5
(86.9)
29.9
(85.8)
30.8
(87.4)
31.0
(87.8)
29.3
(84.7)
27.9
(82.2)
32.7
(90.9)
సగటు అల్ప °C (°F) 13.3
(55.9)
15.4
(59.7)
19.6
(67.3)
24.6
(76.3)
28.9
(84.0)
27.4
(81.3)
24.3
(75.7)
24.1
(75.4)
23.9
(75.0)
21.2
(70.2)
15.2
(59.4)
12.9
(55.2)
20.9
(69.6)
సగటు అవపాతం mm (inches) 11.9
(0.47)
34.8
(1.37)
17.0
(0.67)
17.3
(0.68)
15.5
(0.61)
215.1
(8.47)
413.3
(16.27)
387.9
(15.27)
207.3
(8.16)
44.5
(1.75)
15.5
(0.61)
8.1
(0.32)
1,388.2
(54.65)
Source: Government of Maharashtra

గణాంకాలు

మార్చు

2001 గణాంకాలను అనుసరించి వివరణలు.[3]

విషయం వివరణ
జనసంఖ్య 91,845
పురుషులు 51%
స్త్రీలు 49%
అక్షరాస్యత 80%
పురుషుల అక్షరాస్యత 85%
స్త్రీల అక్షరాస్యత 75%
6 వయసు లోపు పిల్లలు 11%

పరిశ్రమలు

మార్చు

అశోక్ లేలండ్ సంస్థ ఇక్కడ భారీ వాహనాలు తయారు చేస్తుంది. భండారా నగరంలో బి.హెచ్.ఇ.ఎల్, సన్‌లాగ్ ఐరన్ & స్టీల్ కంపెనీ, ఆర్డినెంస్ ఫ్యాక్టరీ, ఎల్లోరా మిల్, మాంగనీస్ ఓర్ మైంస్ ఉన్నాయి. భండారా వద్ద వీడియోకాన్ ఇంటర్నేషనల్ కంస్స్యూమర్ ఎలెక్ట్రానిక్స్ ఏర్పాటు చేయాలని యోచిస్తుంది.

మరాఠీ అధికంగా వాడుకలో ఉంది. హిందీ కూడా వాడుకలో ఉంది.

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-04-28. Retrieved 2015-06-27.
  2. Falling Rain Genomics, Inc - Bhandara
  3. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.

వెలుపలి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=భండారా&oldid=3901779" నుండి వెలికితీశారు