భక్త జయదేవ (1961 సినిమా)

భక్త జయదేవ అనేది 12వ శతాబ్దపు సంస్కృత కవి జయదేవ జీవితం ఆధారంగా 1961లో విడుదలైన భారతీయ తెలుగు భాషా జీవిత చరిత్ర చిత్రం, దీనిని కొమరవోలు నారాయణరావు, జి. పరమధామ రెడ్డి లలిత కళా నికేతన్ బ్యానర్ పై నిర్మించారు. పి. వి. రామారావు దర్శకత్వం వహించారు. రామకృష్ణ దర్శకత్వ పర్యవేక్షణను చూసుకున్నారు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, అంజలి దేవి నటించారు. సాలూరి రాజేశ్వరరావు సంగీతం అందించారు.

భక్త జయదేవ (1961 సినిమా)
(1961 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.వి.రామారావు
కథ సముద్రాల రాఘవాచార్య
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు ,
అంజలీదేవి
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
గీతరచన సముద్రాల రాఘవాచార్య
సంభాషణలు సముద్రాల రాఘవాచార్య
నిర్మాణ సంస్థ లలిత కళా నికేతన్
భాష తెలుగు

నటీనటులు మార్చు

పాటలు మార్చు

పాట రచయిత సంగీతం గాయకులు
అనిల తరళ కువలయ నయనేనా తపతినసా కిసలయ శయనేనా జయదేవులు సాలూరి రాజేశ్వరరావు ఘంటసాల పి.సుశీల
నాదు ప్రేమ భాగ్యరాశి నీవే ప్రేయసీ - నీ చెలిమీ నా తనువే ధన్యమాయెగా సముద్రాల సాలూరి రాజేశ్వరరావు ఘంటసాల పి.సుశీల
నీ మధు మురళీ గాన లీల మనసులు చిగురిడు రా...కృష్ణా సముద్రాల సాలూరి రాజేశ్వరరావు ఘంటసాల
ప్రళయ పయోధిజలే ధృతవానసివేదమ్ జయదేవులు సాలూరి రాజేశ్వరరావు ఘంటసాల

రతి సుఖ సారే గతి మబి సారే . ఘంటసాల. రచన: అష్టపది

ప్రియే చారు శీలే . ఘంటసాల.రచన: అష్టపది .

దయగనుమా జగదీశా . ఘంటసాల.రచన: సముద్రాల.

పద్మావతి చరణం . ఘంటసాల.

మందార గంద సంయుక్త . ఘంటసాల.

భళిరా పుణ్యమటన్న నాదే (పద్యం) ఘంటసాల , రచన: సముద్రాల.

మే గైర్మేదుర మంబరం (శ్లోకం) ఘంటసాల , రచన: జయదేవ గీత గోవిందం .

సాధు సైర ముఖో (శ్లోకం) ఘంటసాల , రచన: గీత గోవిందం .

వాగ్దేవతా చరిత (శ్లోకం) ఘంటసాల, రచన: గీత గోవిందం.

మూలాలు మార్చు

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.