జయదేవ
జయదేవ ఒక సంస్కృత కవి, రచయిత. సా.శ. పన్నెండవ శతాబ్దంలో ఉత్కళ దేశంలో ఒరిస్సా పూరీ జగన్నాధం దగ్గరి కిందుబిల్వ గ్రామంలో జన్మించారు. తండ్రి భోజ దేవుడు, తల్లి రాధాదేవి. చిన్నతనం లేనే తల్లితండ్రులు చనిపోయారు. ఇతని భార్య పద్మావతి. జయదేవ కవి, లక్షణశేన మహారాజ ఆస్థానంలో కవిగా గొప్ప కీర్తి పొందారు. ఒక రోజు రాత్రి మహారాణి, పద్మావతికి నిజంగా జయదేవ కవిపై ప్రేమ ఎంతవుందో తెలుసుకోగోరి, ఒక అబద్ధం ఆడింది. "పద్మావతి, జయదేవ కవి రాజు వెంట వేటకి వెళ్ళి అక్కడ అరణ్యంలో క్రూరమ్రుగం దాడి లో మరణించాడు." ఇది విన్న పద్మావతి వెంటనే నేలకూలి మరణించింది.

దుఖసాగరంలో మునిగిన జయదేవ కవి, రాజాస్తానం వదిలి కేందులు అనే గ్రామం చేరారు. ప్రస్తుతం జయదేవ కవి సమాధి అక్కడే ఉంది.
జయదేవ కవి రచించిన గీత గోవిందం మిక్కిలి ప్రశస్తి గాంచింది. ఈ కావ్యాన్ని అష్టపదులు అని కూడా అంటారు. గీత గోవిందంలో మొత్తం ఇరువది నాలుగు అష్టపదులు ఉన్నాయి.