త్రిస్సూరు

(త్రిసూర్ నుండి దారిమార్పు చెందింది)

కేరళ రాష్ట్ర ... జిల్లాలలో త్రిస్సూరు జిల్లా (మలయాళం:തൃശൂര്‍) ఒకటి. దీనిని త్రిచూర్ అని కూడా అంటారు. ఇది రాష్ట్రానికి కేంద్ర స్థానంలో ఉంది. పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. కేరళ రాష్ట్రంలో 10% శాతం త్రిసూర్ జిల్లాలో ఉంది. 1949 జూలై 1 త్రిసూర్ కేంద్రంగా జిల్లా రూపొందించబడింది. త్రిసూర్ కేరళ రాష్ట్ర సాంస్కృతిక కేంద్రంగా ఉంది. త్రిసూర్ పూరం భూమిగా గుర్తించబడుతుంది. జిల్లాలో పురాతన ఆలయాలు, చర్చిలు, మసీదులు ఉన్నాయి. త్రిసూర్ పూరం మహోత్సవం కేరళ రాష్ట్రంలో వరణరంజితమైన ఉత్సవాలలో ఒకటిగా భావించబడుతుంది.

Thrissur district

Thrissur
District
Country India
రాష్ట్రంకేరళ
ప్రధాన కార్యాలయంThrissur
ప్రభుత్వం
 • CollectorSanal Kumar
విస్తీర్ణం
 • మొత్తం3,032 కి.మీ2 (1,171 చ. మై)
జనాభా వివరాలు
(2001)[1]
 • మొత్తం29,75,440
 • సాంద్రత981/కి.మీ2 (2,540/చ. మై.)
భాషలు
 • అధికారMalayalam,ఆంగ్లం
కాలమానంUTC+5:30 (IST)
ISO 3166 కోడ్IN-KL-8-XXXX
జాలస్థలిthrissur.nic.in

పేరువెనుక చరిత్రసవరించు

త్రిసూర్ అనే పేరుకు మూలం " తిరు- శివ - పేరూర్ " (మలయాళం/తమిళం) పరమశివుని పేరు కలిగిన నగరం ఇది. పురాతన కాలంలో త్రిసూర్‌ " వ్రిషంభాద్రిపురం ", "కైలాసం " (దక్షుణ కైలాసం " అని కూడా పిలువబడింది. మరొక కథనం అనుసరించి " త్రి- శివ - పేరూర్ " అంటే మూడు శివాలయాలు ఉన్న పెద్ద ఊరు అని కూడా అర్ధం. అందుకు నిదర్శనంగా ఈ ప్రాంతంలో వడక్కునాథన్ దేవాలయం, అశోకేశ్వరం శివాలయం, ఇరత్తచిరా శివాలయం అనే మూడు ఆలయాలు ఉన్నాయి.

చరిత్రసవరించు

పురాతన కాలం నుండి త్రిసూర్ జిల్లా దక్షిణ భారతదేశ రాజకీయాలలో ప్రధాన పాత్ర వహించింది. జిల్లా ఆరంభకాల రాజకీయ చరిత్ర సమ్ఘకాలానికి చెందిన చేరసామ్రాజ్యంతో ముడిపడి ఉంది. వంచి నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలించిన చేరచక్రవర్తులు కేరళ రాష్ట్రంలోని అత్యధిక భాగాన్ని పాలించారు. పురాతన, మద్యయుగంలో కేరళప్రాంతం, వెలుపలి ప్రపంచం మద్య వ్యాపారం అభివృద్ధి చేయడానికి త్రిసూర్ ప్రధాన పాత్రవహించింది.

కొడుంగల్లోర్ " ప్రీమియం ఎంపోరియం ఇండియా " గా గుర్తించబడుతుంది. మలబార్ (ఉత్తర కేరళ) అభివృద్ధికి సహకరిస్తున్న మూడు సమూహాలకు (క్రైస్తవులు, జ్యూలు, ముస్లిములు) కొడుంగల్లోర్ ఆశ్రయం కల్పిస్తుంది. త్రిసూర్ ప్రాంతాన్ని 9-12 శతాబ్దాలలో మహోదయపురానికి చెందిన కులశేఖరాలు పాలించారు. 12వ శతాబ్దం తరువాత త్రిసూర్ చరిత్రలో పెరుంపడప్పు స్వరూపం చోటుచేసుకుంది.

1790 లో రాజా రాం వర్మ(శక్తన్ తంబురాన్) (1790-1805) కొశ్చిన్ సామ్రాజ్య సింహాసనం అధిరోహించాడు. శక్తన్ తంబురాన్ పట్టాభిషేకంతో ఈ ప్రాంతంలో ఆధునిక చరిత్ర ఆరభం అయింది. ప్రాంతీయ నాయర్ రాజప్రతినిధుల పతనానికి సరికొత్త రాజరిక వ్యవస్థకు శక్తన్ తంబురాన్ శ్రీకారం చుట్టాడు. తరువాత త్రిసూర్ దాని పరిసర ప్రాంతాన్ని పాలించిన పాలకులలో నంబూద్రి, మేనన్‌లు ప్రధానులు. త్రిసూర్ తాలూకాలోని అత్యధిక భాగం వడక్కునాథన్, పెరుమనం దేవస్థానాలకు చెందిన మతప్రతినిధులైన యోగియాతిరిప్పదాస్ పాలనలో కొనసాగింది.

20వ శతాబ్ద ఆరంభ కాలంలో దేశం అంతటా వ్యాపించిన రాజకీయ చైతన్యం, జాతీయవాదం త్రిసూర్ ప్రాంతంలో కూడా ప్రభావం చూపింది. అంటరానితనం, ఆలయప్రవేశం వంటి సంఘ సంస్కరణ ఉద్యమాలలో త్రిసూర్ తమ వంతు పాత్ర చక్కగా వహించింది. జాతీయ ఉద్యమంలో గురువాయూర్ సత్యాగ్రహం చిరస్థాయిగా నిలిచిపోయింది.

2011 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 3,110,327,[2]
ఇది దాదాపు. మంగోలియా దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. లోవా నగర జనసంఖ్యకు సమం..[4]
640 భారతదేశ జిల్లాలలో. 113వ స్థానంలో ఉంది..[2]
1చ.కి.మీ జనసాంద్రత. 1026 .[2] క్
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 4.58%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 1019 [2]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 95.32%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.

జొల్లాలో అధికభాగం నగరీకరణ చేయబడి ఉంది. నగరీకరణలో జిల్లా రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఎర్నాకుళం ఉంది. .[5]

2001 గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 2,975,440.[6]
పురుషుల శాతం 49%
స్త్రీలశాతం 51%.
పురుషుల అక్షరాస్యత 87%,
స్త్రీల అక్షరాస్యత 85%
6 వయసు లోపు పిల్లాలు 10%
హిందువులు 59.24%,
ముస్లిములు 16.43%
క్రైస్తవులు 24.21%

ప్రజలుసవరించు

త్రిసూరులో ఎళవాలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. తరువాత స్థానంలో ధీవారార్లు, నాయర్లు ఉన్నారు. హిందూ ప్రజలలో అంబలవాసీలు, తమిళ బ్రాహ్మణులు ఉన్నారు. హిందూ ప్రజలు షెడ్యూల్డ్ కులాల ప్రజలు జిల్లా జనసంఖ్యలో 12% ఉన్నారు. క్రైస్తవులలో ప్రధానంగా కాథలిక్కులు (సియో మలబార్ చర్చ్, లాటిన్ ), జాకోబైట్ సిరియన్ క్రిస్టియన్లు, చల్డీన్‌లు ఉన్నారు. కాథలిక్కులలో 90% మంది జిల్లాలో ప్రదేశాలలో (త్రిసూర్ (4,60,000), ఇరింజలక్కుడా (2,52,000), కోట్టపురం (75,000) ) ఉన్నారు.

ఇక్కడి వ్యక్తులుసవరించు

కున్నంకుళంసవరించు

జిల్లాలో ఉత్తరభూభాగంలో ఉన్న చిన్న గ్రామం కున్నంకుళం. ఇది జాకోబైట్స్ (50,000 అనుయాయులు) కేంద్రంగా ఉంది. త్రిసూరులో ఉన్న చల్డియన్ సిరియన్లు 25,000. తొళియూర్ చర్చ్ ప్రధాన కేంద్రంగా 7,000 అనుయాయులు ఉన్నారు. మలంకర ఆర్థడాక్స్ సిరియన్ చర్చ్ అనుయాయుల సంఖ్య కొన్ని వందలు ఉన్నారు. జిల్లాలోని సముద్రతీరంలో ముస్లిములు దీర్ఘకాలంలో ఉన్నారు. మస్లిములు గురువాయూర్, చవక్కాడ్ ప్రాంతాలలో అధికంగా ఉన్నారు. కైపమంగళం, నత్తిక ప్రాంతాలలో సున్ని ముస్లిములు అధికంగా ఉన్నారు.

జనాభా, భౌగోళిక డేటాసవరించు

మూలం: అధికారిక గణాంకాలు 2007 [7]

District Thrissur
ఏరియా 3.032
జనాభా 29,74,232
మగ 14,22,052
ఆడ 15,52,180
సెక్స్ నిష్పత్తి: ఆడ / 1000 1,092
జన సాంద్రత 981
(రూ) తలసరి ఆదాయం 21.362
అక్షరాస్యత రేటు 92,27%; మగ 95,11%; అవివాహిత 89,71%
కిలోమీటర్ల తీర రేఖ. 54
హెక్టార్లు నీరు శరీరము ప్రాంతం. 5,573
హెక్టార్లు అటవీ ప్రాంతం. 103619

భౌగోళికంసవరించు

Thrissur is situated in south western India 10°31′N 76°13′E / 10.52°N 76.21°E / 10.52; 76.21 and is in the central part of Kerala, India. Thrissur is at sea level and spans an area of about 3032 km².

సరిహద్దులుసవరించు

జిల్లా ఉత్తర సరిహద్దులో మలప్పురం జిల్లా, తూర్పు సరిహద్దులో ఇడుక్కి జిల్లా, పాలక్కాడు జిల్లా, తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లా, దక్షిణ సరిహద్దులో ఎర్నాకుళం జిల్లా, పశ్చిమ సరిహద్దులో అరేబియన్ సముద్రం (54 కి.మీ పొడవు) ఉన్నాయి. జిల్లా తూర్పు భాగంలో పశ్చిమ కనుమలు పశ్చిమంగా దిగుడుగా ఉంటుంది. జిల్లా మొత్తంగా ఎగువభూములు, మైదానం, సముద్రతీరం అనే మూడు భౌగోళిక భాగాలుగా ఉంటుంది.

నదులుసవరించు

జిల్లాలో పెరియార్ నది, చలకుడి నది, కురుమలి నది (కురువన్నూర్ నదికి ఉపనది), పొన్నై (భారతపుళా) మొదలైన నదులు ప్రవహిస్తున్నాయి. నదులన్ని తూర్పున ఉన్న పర్వతాలలో జన్మించి అక్కడ నుండి పశ్చిమంగా ప్రవహిస్తూ అరేబియన్ సముద్రంలో కలుస్తున్నాయి. ఈ ప్రధాన నదులలో పలు ఉపనదులు సంగమిస్తున్నాయి. జిల్లాలో అథిరపల్లి జలపాతాలు (భారతీయ నయాగరాఅంటారు) ఉన్నాయి.

వాతావరణంసవరించు

వాతావరణంసవరించు

విషయ వివరణ వాతావరణ వివరణ
వాతావరణ విధానం తేమతో కూడిన వేడి
గరిష్ఠ ఉష్ణోగ్రత ° సెల్షియస్
కనిష్ఠ ఉష్ణోగ్రత ° సెల్షియస్
వేసవి మార్చి- మే
వర్షాకాలం జూన్ - సెప్టెంబరు
శీతాకాలం అక్టోబరు- ఫిబ్రవరి
వర్షపాతం విస్తారమైన వర్షపాతం 3000 మి.మీ

Eastward panoramic view

Westward panoramic view

సంస్కృతిసవరించు

త్రిసూర్ ఆర్కియాజికల్ సంపద, చారిత్రక, సాంస్కృతిక సంప్రదాయంతో సుసంపన్నమై ఉంది. ఇది కేరళ సాంస్కృతిక కేంద్రంగా గుర్తించబడుతుంది. త్రిసూర్ పూరం ఉత్సవం త్రిసూర్‌కు ప్రత్యేకత కలిగిస్తుంది.

 • జిల్లా వివిధ సహజసంపదలను కలిగి ఉంది. అందమైన కేరళ భూభాగం త్రిసూర్‌తో మొదలౌతుంది. ప్రశాంతమైన అందమైన చిన్న చిన్న గ్రామాలు నిరంతరంగా ప్రవహించే నదులు సహజ సౌందర్యానికి మెరిగులు దిద్దుతున్నాయి. పురాతన సంప్రయ కేంద్రమైన త్రిసూరులో కేరళ కాలమండలం, కేరళ సాహిత్య అకాడమీ, కేరళ లలితకాళా అకాడమీ, కేరళ సంగీత నాడక అకాడమీ (త్రిస్సూర్) సాంస్కృతిక కళాకేంద్రాలు ఉన్నాయి. వడక్కునాథన్ శివాలయం ఉన్న కొండ చుట్టూ త్రిసూర్ నగరం అభివృద్ధి చెందింది. పురాతన కేరళ నిర్మాణ సంప్రదాయానికి ఆలయం ప్రతిబింబంగా ఉంది. జిల్లాలో పలు పవిత్ర ఆలయాలు ఉన్నాయి. మాలిక్ బిన్ దీనార్, 20 మంది ముహమ్మద్ (ఇస్లాం మత స్థాపకుడు) అనుయాయులు భారతదేశానికి వచ్చినప్పుడు మొదటిసారిగా త్రిసూరులోని కొడుగనల్లుర్‌లో అడుగుపెట్టారు. ఇక్కడ కొన్ని ప్రాంతాలలో ఇస్లాంకు రాజమర్యాద పొందిన తరువాత భారతదేశం అంతటా విస్తరించింది. మాలిక్ బిన్ దీనార్ నగరంలో " చెర్మన్ జుమా మసీద్ " నిర్మించాడు. చెర్మన్ జుమా మసీద్ హిందూ ఆలయ శైలిలో నిర్మించబడింది. ప్రపంచంలో మదినా తరువాత నిర్మించబడిన రెండవ మసీదుగా ఇది భావించబడుతుంది.

చర్చిసవరించు

త్రిసూర్ జిల్లాలో " చర్చ్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ డోలోర్స్ " (న్యూచర్చ్) ఉంది. దక్షిణాసియాలో ఇది అతిపెద్ద చర్చిగా గుర్తించబడుతుంది. భారతదేశంలో మొదటి చర్చిగా గుర్తించబడుతున్న ఎస్.టి థోమస్ చర్చ్ జిల్లాలోని పలయూర్‌లో ఉంది. చల్దీన్ సిరియన్ చర్చ్ (చర్చ్ ఆఫ్ ది ఈస్ట్) ప్రధాన కార్యాలయం త్రిసూర్‌లో ఉంది. మతసంబంధిత ప్రచురణా సంస్థలు అనేకం మార్ నర్సై ప్రెస్‌లో ప్రచురించబడుతున్నాయి. అతిపెద్ద యాత్రా ప్రదేశం " ఎస్.టి. జోసెఫ్స్ ష్రైన్ " జిల్లాలోని పవరథి వద్ద ఉంది. సా.శ. 52లో సెయింట్ థోమస్ (అపోస్టిల్) మొదటిసారిగా కొడుంగల్లూర్‌లో అడుగు పెట్టాడు. సెయింట్ థోమస్ త్రిసూరులో " సెయింట్ థోమస్ చర్చ్ " స్థాపించాడు. ఈ చర్చిలో పలు పురాతన అవశేషాలు బధ్రపరచబడి ఉన్నాయి. అయినప్పటికీ చరిత్రకారులు దీనిని అంగికరించడం లేదు.

గురువాయూర్సవరించు

గురువాయూర్‌లో ప్రఖ్యాత కృష్ణుని ఆలయం ఉంది. ఇది త్రిసూరుకు 25 కి.మీ దూరంలో ఉంది. ప్రంపంచంలోని హిందువులు అందరూ ఇక్కడకు కృష్ణుని దర్శనార్ధం వస్తుంటారు. చవకడి, కున్నంకుళం వరుసగా ముస్లిములకు, క్రైస్తవులకు యాత్రా స్థాలాలుగా ఉన్నాయి. త్రిప్రయార్ ఆలయం మరొక ప్రముఖ ఆరధనాప్రాంతగా ఉంది. కేరళ రాష్ట్రంలోని మూడు ప్రసిద్ధ శ్రీరాముని ఆలయాలలో ఇది ఒకటి. మిగిలిన రామాలయాలలో తిరువిల్వమాల ఆలయం, కడవల్లూరు రామాలయాలు ప్రధానమైనవి.

కొడుంగల్లూర్సవరించు

కొడుంగల్లూర్ మునుపటి చేర సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఇది ఆర్కియాలజీ, చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉంది. ఇక్కడ ఉన్న భగవతి ఆలయం వేలాది భక్తులను ఆకర్షిస్తూ ఉంది. చెరామన్ జుమా మసీద్ భారతదేశంలో అతిపురాతన మసీదుగా విశ్వసించబడుతుంది. ఇరింజల్కుడాలో దేశంలో ఒకేఒక ఆలయమని భావిస్తున్న " భారత టెంపుల్ " ఉంది. కూడల్‌మాణిఖ్యం ఆలయం వద్ద ఉనై వారియార్ స్మరకా కల్యాణనిలయం ఉంది. కథాకళి నృత్య శిక్షణకు ఇది కేంద్రంగా ఉంది. పురాతన కాలం నుండి కేరళ రాష్ట్రంలో త్రిసూర్ వేదాధ్యానికి ప్రధాన కేంద్రంగా ఉంది. ఈ భూమిలో ఇప్పటికీ యాగాలు నిర్వహించబడుతుంటాయి. ఇది త్రిసూర్ కేంద్రస్థానంలో ఉంది.

‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ సినిమా దర్శకుడు సచీ కొడుంగల్లూర్ లోనే జన్మించాడు.

ప్రభుత్వం, రాజకీయాలుసవరించు

తాలూకాలు & ప్రధాన కార్యాలయాలు
త్రిసూర్
త్రిసూర్
ముకుందపురం తాలూకా
ఇరింజలకుల
కొడుంగల్లూర్
కొడుంగల్లూర్
చవకాడ్
చవకాడ్
తలపిల్లి
వడక్కన్ంచెరి
పురపాలకాలు
కున్నంకుళం
చలకుడి
కొడగళ్ళూరు
చవకాడు
గురువాయూర్
ఇరింజలకుడా
 • అసెంబ్లీ నియోజకవర్గాలు :- త్రిసూర్: ఒల్లూర్ అసెంబ్లీ నియోజకవర్గం, గురువాయూర్, చలక్కుడి, కైపమంగళం, నత్తిక, కొడంగలూర్, ఇరింజికుడా, పుదుకాడ్, మణలూర్, కున్నంకుళం, వడక్కంచెరి, చెక్కర.
 • జిల్లాలో 2 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి:- త్రిసూర్ పార్లమెంటు నియోజకవర్గం, చలకుడి పార్లమెంటు నియోజకవర్గం.
 • త్రిసూర్ జిల్లాలో 5 తాలూకాలు ఉన్నాయి
 • త్రిసూరులో 151 గ్రామాలు ఉన్నాయి.

మాధ్యమంసవరించు

త్రిసూర్ జిల్లాలో మొదటి వార్తాపత్రికగా 1920లో " లోకమాన్యన్ " స్థాపించబడింది. తరువాత 1941లో దీనబంధు పత్రిక స్థాపించబడింది. జిల్లాలో ప్రధానంగా మలయాళ మనోరమా, మాత్రుభూమి, దేశాభిమాని, దీపిక (వార్తాపత్రిక), కేరళకౌముది, మధ్యమం మొదలైన మలయాళ వార్తాపత్రికలు ప్రచురించబడుతున్నాయి. నగరంలో పలు ఈవెనింగ్ పేపర్లు ప్రచురించబడుతున్నాయి. జిల్లాలో హిందీ, కన్నడం, తమిళం, తెలుగు మొదలైన ఇతరభాషా పత్రికలు అధిక సంఖ్యలో విక్రయించబడుతున్నాయి.

పరిశ్రమలుసవరించు

త్రిసూర్ చేనేతకు పరిశ్రమకు, టెక్స్‌టైల్స్ పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. అళగప్పా నగర్‌లో ఉన్న " అళగప్పా టెక్స్‌టైల్స్", కేరళ లక్ష్మీ మిల్స్ (పుళలి), త్రిసూర్ కాటన్ మిల్స్ (నత్తిక), రాజ్‌గోపాల్ టెక్స్‌టైల్స్ (అథాని), సీతారాం స్పిన్నింగ్ అండ్ వీవింగ్ మిల్స్" (త్రిసూర్), వనజ టెక్స్‌టైల్స్ (కురియచిరా), భగవతి స్పిన్నింగ్ మిల్స్, (థానికుడం), కున్నథ్ టెక్స్‌టైల్స్, (త్రిసూర్) మొదలైన వస్త్ర పరిశ్రమలు ఉన్నాయి.

 
A view from Poomala, mountain

కాయిర్, టైల్స్ పరిశ్రమసవరించు

కాయిర్, టైల్స్ పరిశ్రమలు జిల్లాలో అనేకమందికి ఉపాధి కల్పిస్తున్నాయి. 1905లో మొదటి సా మిల్ స్థాపించబడింది. సామిల్లుకు అవసరమైన టింబర్ త్రిసూర్, చలకుడి అరణ్యాల నుండి లభిస్తుంది. త్రుసూర్‌లో ఆహారపదార్ధాల తయారీ పరిశ్రమ అభివృద్ధి చెంది ఉంది. జిల్లాలో దారికో కేనింగ్స్, కాయీ కేనింగ్స్ సంస్థలు ప్రధానమైనవి.రెండింటికీ త్రిసూరులో ప్రధాన యూనిట్లు ఉన్నాయి. నదతర వద్ద త్రిసూర్ ఫ్రూట్స్, వెజిటబుల్ మార్కెటింగ్ సొసైటీ కేనిగ్ ఇండస్ట్రియల్ యూనిట్‌ను స్థాపించింది. ఇది ప్రస్తుతం విజయవంతంగా నడుస్తుంది. జిల్లాలో అదనంగా అగ్గిపుల్లల పరిశ్రమ, మందులతయారీ పరిశ్రమ, ప్రింటింగ్ పరిశ్రమలు ఉన్నాయి. త్రిసూర్ పరిశ్రమలు శీగ్రగతిలో అభివృద్ధి చెందుతున్న నగరంగా గుర్తించబడుతుంది. 1957లో త్రిసూర్‌లో మొదటి " వర్కర్స్ ఇండియన్ కాఫీ హౌస్ స్థాపించబడింది. థానిక్కుడం సమీపంలోని మదక్కర వద్ద 400 కి.వా విద్యుత్తును ఉత్పత్తి చేయగలిగిన పవర్ స్టేషను స్థాపించబడింది. ఈ పవర్ స్టేషను రాష్ట్ర విద్యుత్తు అవసరాలలో 30% అందిస్తుంది. త్రిసూర్‌కు దక్షిణంలో ఉన్న అవనిసేరి గ్రామం కుటీరపరిశ్రమలు, ఖాది కేంద్రంగా ఉంది.

పర్యాటక ఆకర్షణలుసవరించు

 
Kuda Mattam during Thrissur pooram festival.
 • అథిరపల్లి వాటర్ ఫాల్స్ (63 కి.మీ; త్రిస్సూర్ సిటీ నుండి కి.మీ ) : లొంకోడ్ పరిధులలో షోలయర్ గడప వద్ద ఈ 80 అడుగుల ఎత్తైన జలపాతం ఒక ప్రముఖ పిక్నిక్ స్పాట్ ఉంది. రెండు వినోద ఉద్యానవనాలు -డ్రీంవరల్డ్, సిల్వర్‌స్ట్రోం - దగ్గరలోనే ఉన్నాయి.
 • వళచల్: దట్టమైన అడవులు దగ్గరగా, చలకుడి రివర్ భాగంగా అథిరపిల్లి నుండి కేవలం ఒక చిన్న డ్రైవ్.
 • పున్నత్తూరు కొత్త ఏనుగు అభయారణ్యం (23 కి.మీ; నగరం నుండి కి.మీ ) : 60 పైగా ఏనుగులు, ప్రపంచంలో అతిపెద్ద ఏనుగు పార్క్.
 • పీచి డ్యాం: (20 కి.మీ; నగరం నుండి కి.మీ) ఇది ఒక మంచి పిక్నిక్ స్పాట్ ఉంది
 • పూమల ఆనకట్ట: ఒక నీటిపారుదల ఆనకట్ట ఒక సుందరమైన సహజ రిజర్వ్, పర్యాటక స్పాట్.
 • చవకాడ్ బీచ్ (25 కి.మీ ) : అరుదైన అత్యద్భుతమైన అందాన్ని ఒక సముద్ర తీరం. పశ్చిమ తీరం వెంట ఉత్తమ బీచ్లు ఒకటి గుర్తించాడు.
 • వళని ఆనకట్ట (24 కి.మీ ; నగరం నుండి కి.మీ) : ఇది ఒక మంచి పిక్నిక్ స్పాట్ ఉంది
 • స్నేహతీర్ధం బీచ్: ఈ అందమైన, ప్రశాంతత బీచ్ నట్టిక గ్రామం ద్వారా త్రిస్సూర్ పట్టణం నుండి సుమారు 23 కి.మీ సమీపంలో ఉంది. అనేక ఫిషింగ్ బోట్లు, కమ్యూనిటీ seen.Few బీచ్ రిసార్ట్స్ సమీపంలోని కూడా ఉన్నాయి.
 • చిమ్మోనీ ఆనకట్ట (35 కి.మీ; నగరం నుండి కి.మీ) : ఇది బోటింగ్ సౌకర్యాలు ఒక అందమైన పిక్నిక్ స్పాట్ ఉంది
 • కేరళ కాలమండలం (30) : చెరుతురుతిలో ఉంది, కవి శ్రీ స్థాపించారు. వల్లతోల్ నారాయణ మీనన్, ఇది మోహినియాట్టం, కథాకళి .
 • కూడళ్ ఆలయం.
 • అనేక ఉన్నాయి త్రిస్సూర్ గ్రామీణ జిల్లాలో హిందూ మతం దేవాలయాలు.

త్రిస్సూర్ రూరల్ జిల్లాలో ముఖ్యమైన పట్టణాలుసవరించు

 • పుదుకాడ్ పుదుకాడ్
 • చాలకుడేలో
 • చావక్కాద్
 • చెలక్కరా
 • గురువాయూర్
 • హరినగర్ పూంకున్నం
 • ఇరింజలకుడా
 • కెచేరి
 • కొడకర
 • కొడంగలూర్
 • కున్నంకుళం
 • త్రిప్రయార్
 • వదనపళ్ళి
 • వాడకంచెరి
 • మణితర

Photo gallery of Thrissur Districtసవరించు

Notesసవరించు

 1. "Official Census 2001" (PDF). Government of Kerala. Archived from the original (PDF) on 2008-12-02. Retrieved 2010-09-18.
 2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
 3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Mongolia 3,133,318 July 2011 est. {{cite web}}: line feed character in |quote= at position 9 (help)
 4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Iowa 3,046,355 {{cite web}}: line feed character in |quote= at position 5 (help)
 5. http://www.censusindia.gov.in/2011-prov-results/paper2-vol2/data_files/kerala/Chapter_IV.pdf
 6. "The Official Website of Thrissur District". Archived from the original on 2011-02-08. Retrieved 2014-06-30.
 7. Official website of Thrissur district http://www.tsr.kerala.gov.in/barefacts.htm Archived 2011-07-21 at the Wayback Machine

బయటి లింకులుసవరించు

Thrissur District గురించిన మరింత సమాచారము కొరకు వికీపీడియా యొక్క సోదర ప్రాజెక్టులు:అన్వేషించండి

  నిఘంటువు విక్షనరీ నుండి
  పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
  ఉదాహరణలు వికికోట్ నుండి
  వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
  చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
  వార్తా కథనాలు వికీ వార్తల నుండి

మూలాలుసవరించు

వెలుపలి లింకులుసవరించు