భలే పెళ్ళాం 1994 లో వచ్చిన సినిమా. వి.ఎం.సి ప్రొడక్షన్స్ బ్యానర్‌లో వి. దొరస్వామిరాజు నిర్మించాడు. ఎ. క్రాంతి కుమార్ దర్శకత్వం వహించాడు. ఇందులో జగపతి బాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించగా, దేవా సంగీతం అందించాడు.[1][2][3] ఈ చిత్రం పురుష లక్షణం (1993) అనే తమిళ చిత్రానికి రీమేక్.

భలే పెళ్లాం
(1994 తెలుగు సినిమా)
దర్శకత్వం ‌క్రాంతికుమార్
నిర్మాణం వి. దొరస్వామి రాజు
తారాగణం జగపతి బాబు,
మీనా
సంగీతం ఎం. ఎం. కీరవాణి
సంభాషణలు గణేష్ పాత్రో
ఛాయాగ్రహణం ఛోటా కె నాయుడు
కూర్పు ఏ శ్రీకర్ ప్రసాద్
నిర్మాణ సంస్థ వి.ఎం.సి. ప్రొడక్షన్స్
భాష తెలుగు

నందగోపాల్ ( జగపతి బాబు ) ఒక సంస్థలో మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. కళాశాల విద్యార్థి అయిన భారతి ( మీనా ) మొదటి చూపులోనే నందగోపాల్‌తో ప్రేమలో పడుతుంది. అంజు కూడా నందగోపాల్‌ను ప్రేమిస్తుంది అయితే అది వన్ వే లవ్. నందగోపాల్ భారతిని పెళ్ళి చేసుకుంటాడు. రాజా (రాజా రవీంద్ర) భారతి క్లాస్మేట్. భారతిని ప్రేమిస్తున్నాడు. కాబట్టి రాజా భారతిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు.

రాజా భారతిని బలవంతం చేయడం ప్రారంభిస్తాడు. ఆమెను పెళ్ళి చేసుకుంటానని సవాలు చేస్తాడు. ఒక రోజు రాజా, నందగోపాల్ ముందే భారతిని కౌగిలించుకుంటాడు. దాంతో, నందగోపాల్ తన భార్యకు రాజాతో ఎఫైర్ ఉందనుకుని అతను భారతిని వెళ్లగొడతాడు. తరువాత ఏం జరుగుతుందనేది మిగతా సినిమా.

తారాగణం

మార్చు

పాటలు

మార్చు
సం.పాటగాయనీ గాయకులుపాట నిడివి
1."అందాల మత్తులోన"ఎస్.పి. బాల్సుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర4:36
2."అబ్బిగా ఏమన్నది"ఎస్.పి. బాల్సుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర4:38
3."లోకాలు ఏలే"కె.ఎస్. చిత్ర5:24
4."మాపటేల మల్లెల బస్తీ"మనో, మాల్గాడి శుభ4:22
5."వర్ధిల్లు వర్ధిల్లు"ఎస్.పి. బాల్సుబ్రహ్మణ్యం3:55
6."జిందాబాద్ జిందాబాద్"కె.ఎస్. చిత్ర4:10
మొత్తం నిడివి:27:05

మూలాలు

మార్చు
  1. "Heading". IMDb.
  2. "Heading-2". Nth Wall. Archived from the original on 2015-01-28. Retrieved 2020-08-23.
  3. "Heading-3". Spice Onion.[permanent dead link]