రోహిణీ హట్టంగడి
రోహిణీ హట్టంగడి ప్రముఖ భారతీయ నటి. ఈమె పలు భారతీయ భాషల చిత్రాలలో, టెలివిజన్ కార్యక్రమాలలో ప్రాధాన్యాతా పాత్రలను పోషించి మంచి నటిగా గుర్తింపు పొందినది. గాంధీ సినిమాలో పోషించిన కస్తూర్బా పాత్ర ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
రోహిణీ హట్టంగడి | |
---|---|
![]() బిగ్ ఎఫ్.ఎమ్ మరాఠీ అవార్డుల సందర్భంగా రోహిణీ హట్టంగడి | |
జననం | రోహిణీ ఓక్ 11 ఏప్రిల్ 1951 |
క్రియాశీల సంవత్సరాలు | 1975–ప్రస్తుతం |
జీవిత భాగస్వాములు | జయదేవ్ హట్టంగడి (1977–2008; ఆయన మరణం); 1 కుమారుడు |
జీవిత విశేషాలుసవరించు
ఈమె ఏప్రిల్ 11 1951లో పూణేలో జన్మించింది. ఆమె అసలు పేరు రోహిణీ ఓక్. 1966లో పూణేలోని రేణుకా స్వరూప్ స్మారక బాలికోన్నత పాఠశాల నుండి విద్యాభ్యాసం పూర్తిచేసుకొంది.[1] ఈమె ఒక సాంప్రదాయ నర్తకి కూడా. కథాకళి, భరతనాట్యాలలో ఎనిమిదేళ్లు శిక్షణ పొందింది.
ఆ తరువాత 1971లో కొత్త డిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరింది. రంగస్థలంపై ఆసక్తి ఉండటం, సినిమాలోకి వెళ్ళాలన్న ప్రణాళికలేవి లోకపోవటంతో, ఆమె స్వస్థలమైన పూణేలో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్సిస్టిట్యూట్ ఉన్నా, దానిలో చేరలేదు. ఈ నిర్ణయాన్ని వివరిస్తూ రోహిణి "నాకు కేవలం నటి కావలన్న ఆసక్తి ఉండేది... నా మనసంతా రంగస్థలంలోనే ఉన్నది, ఎందుకంటే మానాన్న (అనంత్ ఓక్) నిజమైన నటన రంగస్థలంపైనే నేర్చుకోవచ్చని చెప్పేవారు. అందుకే ఎన్.ఎస్.డీ.లో చేరటానికి అంత దూరంలోని దిల్లీకి వచ్చాను." అని చెప్పింది[2] ఎన్.ఎస్.డీ.లో, తన భావి భర్త జయదేవ్ హట్టంగడిని కలిసింది. వీరిద్దరూ ఒకే బృందంలో చదువుకున్నారు. వీరిద్దరూ అదేసమయంలో ఇబ్రహీం అల్కాజీ వద్ద శిక్షణ పొందారు.[3] నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో 1974లో ఆమె డిగ్రీ పూర్తి అయ్యేనాటికి ఆమె ఉత్తమ నటిగా, ఉత్తమ ఆల్ రౌండర్‌గా, జయదేవ్ హట్టంగడి ఉత్తమ దర్శకుడిగా ఎన్నుకోబడ్డారు. ఈమెకు అసీమ్ హట్టంగడి అనే ఒక కుమారుడు ఉన్నాడు. ఈమె భర్త 2008లో కేన్సర్‌తో బాధపడుతూ మరణించాడు.
నాటకరంగంసవరించు
ఈమె తన నాటక ప్రస్థానాన్ని మరాఠీనాటకాలతో ప్రారంభంచింది. ఢిల్లీలో నేషనల్ డ్రామా స్కూలులో చదువుకునే సమయంలోనే తన భర్త జయదేవ్‌తో కలిసి ముంబాయిలో ఆవిష్కార్ అనే నాటక సంస్థను ప్రారంభించి దాని ద్వారా 150 నాటకాలలో నటించి ప్రదర్శించింది. ఈమె కన్నడ యక్షగానాలలోను, జపనీస్ కబుకి నాటకాలలోను నటించిన మొదటి మహిళ. అపరాజిత అనే 120 నిమిషాల ఏకాంకికలో ఈమె నటనకు పలువురి ప్రశంసలు లభించాయి. బెంగాలీ కథ ఆధారంగా రూపొందించబడిన ఈ ఏకాంకిక హిందీ, మరాఠీ భాషలలో అనేక ప్రదర్శనలు పొందింది. ఈమె తన భర్తతో కలిసి ముంబాయిలో కళాశ్రయ్ అనే, మరో సంస్థను కూడా స్థాపించి నాటక కళకు పాటుపడింది.
సినిమారంగంసవరించు
అరవింద్ దేశాయ్‌కీ అజీబ్ దస్తా అనే చిత్రంతో ఈమె సినీరంగ ప్రవేశం జరిగింది. రిచర్డ్ అటెన్‌బరో తీసిన గాంధీ చిత్రంలో ఈమె బెన్‌కింగ్స్‌లే సరసన కస్తూరీబా పాత్రలో నటించింది. ఈ చిత్రం ఈమెకు మంచి పేరు, పురస్కారాలను తెచ్చిపెట్టింది. ఈమె ఇంగ్లీషు, హిందీ, కన్నడ, మరాఠీ, తెలుగు, మలయాళ, తమిళ భాషాచిత్రాలలో మంచి పాత్రలను పోషించింది. ఈమె నాటకాలు, సినిమాలలోనే కాకుండా టెలివిజన్ సీరియళ్లలో కూడా నటించి ప్రేక్షకుల మెప్పు సంపాదించింది.
రోహిణీ హట్టంగడి నటించిన తెలుగు చిత్రాలుసవరించు
- సీతారామయ్యగారి మనవరాలు - జానకమ్మ
- రాత్రి - హీరోయిన్ తల్లి
- లిటిల్ సోల్జర్స్ - రాజేశ్వరీదేవి
- గణేష్ (2009)
- సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు - బామ్మ
- శిరిడి సాయి - గంగాబాయి
- రామయ్యా వస్తావయ్యా - బేబి
- శివ
అవార్డులు, రివార్డులూసవరించు
- 1975లో మహారాష్ట్ర రాష్ట్రస్థాయి నాటకోత్సవాలలో ఉత్తమ నటి అవార్డు.
- 1982లో "గాంధీ" చిత్రంలో కస్తూరీబా గాంధీ వేషానికి ఉత్తమ సహాయక నటిగా బ్రిటిష్ అకాడమీ ఫిలిం (BAFTA) అవార్డు.
- 1984లో "అర్థ్" చిత్రానికి ఉత్తమ సహాయ నటి అవార్డు.
- 1985లో "పార్టీ" చిత్రంలో మోహిని పాత్రకు ఉత్తమ సహాయనటిగా నేషనల్ ఫిలిమ్ అవార్డు.
- 1990లో "అగ్నిపథ్" చిత్రంలో సుహాసినీ చౌహాన్ పాత్రకు ఉత్తమ సహాయనటిగా ఫిలిం ఫేర్ అవార్డు.
- 2004లో సంగీత నాటక అకాడెమీ అవార్డు.
మూలాలుసవరించు
- ↑ "Alumni put up class act for alma mater" Archived 2008-06-21 at the Wayback Machine, Indian Express, 20 December 2002.
- ↑ Kumar, Anuj (2010-06-04). "Cast in a different mould". The Hindu. Retrieved 2011-02-24.
- ↑ "Profile: "I Was Recognised For My Genius"". The Outlook. 18 December 1996.