రాధా ప్రశాంతి
రాధా ప్రశాంతి ఒక భారతీయ చలనచిత్ర నటి. ఈమె తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషలలో సుమారు 100కు పైగా సినిమాలలో నటించింది. ఈమె నటిగా మాత్రమే కాకుండా కష్టంలో ఉన్న వారికి దానధర్మాలు చేసి మంచి పేరు గడించింది. ఎన్నో గుప్తదానాలను చేసింది. ఈమె సేవలను గుర్తించి భారత ప్రభుత్వం 2013లో కన్నగి స్త్రీ శక్తి పురస్కారం ప్రకటించింది.
రాధా ప్రశాంతి | |
---|---|
జననం | తమటాల కృష్ణవేణి ఒడిశా రాష్ట్రం, గజపతి జిల్లా, కాశీనగర్ |
ఇతర పేర్లు | టైగర్ రాధాప్రశాంతి |
వృత్తి | సినీ నటి, రంగస్థల కళాకారిణి |
గుర్తించదగిన సేవలు | పరువు ప్రతిష్ఠ బంగారు కుటుంబం ఎర్రసూర్యుడు |
జీవిత భాగస్వామి | ఉప్పుడి కిరణ్‌కుమార్ రెడ్డి |
పిల్లలు | ఇద్దరు |
తల్లిదండ్రులు | తమటాల వెంకన్న నాయుడు, తమటాల పగడాలమ్మ |
పురస్కారాలు | స్త్రీ శక్తి పురస్కారం - కన్నగి అవార్డు |
జీవిత విశేషాలు
మార్చుఈమె అసలు పేరు కృష్ణవేణి. ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దులోని ఒడిశా రాష్ట్రం, గజపతి జిల్లా (అప్పటి గంజాం జిల్లా)లోని కాశీనగర్ అనే గ్రామంలో తమటాల వెంకన్న నాయుడు, తమటాల పగడాలమ్మ దంపతులకు ఈమె మొదటి సంతానంగా జన్మించింది. ఈమెకు ఇద్దరు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు ఉన్నారు. ఈమె చిన్న వయసులోనే తండ్రి కేన్సర్ వ్యాధితో మరణించాడు. వెంపటి చినసత్యం వద్ద ఈమె కూచిపూడి నృత్యాన్ని అభ్యసించింది. తమ గ్రామంలోని ఔత్సాహిక నటులతో కలిసి ఈమె నాటకాలను ప్రదర్శించడం ప్రారంభించింది. తరువాత కొన్ని వేల నాటకాలలో నటించింది. వీటిని చూసిన సినీ రంగానికి చెందిన వ్యక్తులు ఈమెకు సినిమాలలో అవకాశం కల్పించారు. ఈమెకు ఉప్పుడి కిరణ్‌కుమార్ రెడ్డితో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
సినిమా రంగం
మార్చుసినిమారంగంలో ప్రవేశించాక ఈమె పేరును ప్రశాంతిగా మార్చారు. అయితే ఈమె ఆ సమయంలో ఉన్నత స్థానంలో ఉన్న సినిమా నాయిక రాధ పోలికలు కలిగి ఉండడంతో ఈమె పేరుకు రాధ జోడించి రాధాప్రశాంతి అని పిలవసాగారు. ఈమె అన్ని దక్షిణాది భాషా చలన చిత్రాల్లోనూ, హిందీ చిత్రాలలోనూ సుమారు 100 సినిమాలలో నటించింది. కథానాయిక, తల్లి, చెల్లి మొదలైన ఇతర సహాయక పాత్రలలో నటించింది.
ఈమె నటించిన సినిమాల పాక్షిక జాబితా:
టెలివిజన్ ధారావాహికలు
మార్చుధారావాహిక పేరు | పాత్ర | దర్శకుడు | ప్రసారమైన టెలివిజన్ ఛానెల్ |
---|---|---|---|
కార్తీకదీపం | మినిస్టర్ భార్య | సెల్వ రోషన్ | స్టార్ మా |
సేవారంగం
మార్చుఈమె తన భర్తతో కలిసీ స్టెప్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి దాని ద్వారా అనాథలు, వికలాంగులు, వితంతువులు, నిరాశ్రయులకు ఆర్థిక సహాయం చేస్తున్నది. దీనితో పాటు అంధులకు అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నది.[1]
గుర్తింపులు
మార్చు- రంగస్థల ప్రదర్శనలలో ఈమెకు 208 ఉత్తమ ప్రదర్శన అవార్డులు లభించాయి.
- 2014, మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవంనాడు న్యూ ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈమె స్త్రీ శక్తి పురస్కారం(కన్నగి అవార్డు) అందుకుంది. అవార్డుతో పాటు ఈమెను 3 లక్షల రూపాయల నగదుతో సత్కరించారు.[1]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ (9 March 2014). "రాధా కె.ప్రశాంతికి స్త్రీశక్తి పురస్కారం". సాక్షి దినపత్రిక. Retrieved 12 February 2024.
బయటిలింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రాధా ప్రశాంతి పేజీ