భాగ్యవంతులు

భాగ్యవంతులు తెలుగులో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా. దీనికి మూలం నల్లవన్ వాళ్వాన్ అనే తమిళ సినిమా.

భాగ్యవంతులు
(1962 తెలుగు సినిమా)
Bhagyavantulu.jpg
దర్శకత్వం పి.నీలకంఠం
తారాగణం ఎం.జి.రామచంద్రన్ ,
రాజసులోచన ,
ఎం.ఆర్.రాధా
సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు
గీతరచన ఉషశ్రీ
నిర్మాణ సంస్థ ఉషా ఫిల్మ్స్
భాష తెలుగు

కథసవరించు

రంగారావు భాగ్యవంతుడు. డబ్బుతో ఏమైనా కొనవచ్చనేది అతని అభిప్రాయం. అతనికి కావలసినవి రెండే.కామినీ కాంచనాలు. మధు భాగ్యవంతునితో ఎన్నికలలో పోటీచేస్తాడు. అక్రమాలను ధైర్యంగా ఎదురిస్తాడు. అతని చెల్లి శ్యామల. శ్యామలను పెళ్ళి చేసుకోవాలని రంగారావు ప్రయత్నిస్తాడు. కానీ శ్యామల అంతకుముందే పోలీస్ ఇన్‌స్పెక్టర్ మాధవుని ప్రేమించి ఉంటుంది. రంగారావుకు శ్యామల తండ్రి ఇవ్వవలసిన బాకీని మధు చెల్లించి శ్యామల, మాధవుల పెళ్ళికి మార్గం సుగమం చేశాడు. రంగారావు నర్తకి చంద్రను వలలో వేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆమె అతని నోట సున్నం ముద్ద పెట్టి పారిపోతుంది. రంగారావు అనుచరులు ఆమెను వెన్నాడగా మధు ఆమెను కాపాడుతాడు. ఇద్దరి మధ్య ప్రేమ మొలకెత్తుతుంది. రంగారావు కుపితుడవుతాడు. మధును ఖూనీ కేసులో ఇరికిస్తాడు. అతనిని ఆ కేసు నుండి తప్పించడానికి శ్యామల ఎంతో ఆరాటపడుతుంది. చివరకు మధు ఎన్నో వేషాలు వేసి తాను నిర్దోషినని పతాక సన్నివేశంలో నిరూపించుకుంటాడు[1].

నటి నటులుసవరించు

ఇతర వివరాలుసవరించు

పాటలుసవరించు

ఈ చిత్రంలోని పాటలకు ఉషశ్రీ సాహిత్యాన్ని అందించగా, ఘంటసాల సంగీతాన్ని చేకూర్చాడు[2].

పాట రచయిత సంగీతం గాయకులు
కొట్టాలి లవ్వరొక ఛాన్స్ ఈ ప్రియురాలికి ఫస్ట్‌క్లాస్ ఉషశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు ఎ. ఎం. రాజా, ఎస్. జానకి
గులాబి అత్తరుల ఘుంఘుం అనుచున్నదా మదికైపెక్కెనా ఉషశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు పి. లీల, ఘంటసాల వెంకటేశ్వరరావు
చిరునగవే నీ సింగారం చిగురించెనులే మన నయగారం ఉషశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల
టిక్కు టిక్కు పిల్లను చక్కనైన చుక్కను నవ్వుల పువ్వును ఉషశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు జిక్కి
తెలుసుకోండయా జరిగేదెల్లా లోకంలోని పోకడలెల్లా ఉషశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు ఘంటసాల వెంకటేశ్వరరావు, కె.జమునారాణి
మట్టిలో మణులునై పిట్టకైనా నీతివున్నది తెలిసిందా ఉషశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు పి.సుశీల
రమ్మని సైగ చేయగా చేరిన చిన్నారీ స్నానము చేయించగా ఉషశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.లీల
రఘుకుల రాఘవ రాజారాం పరమదయాకరా సీతారాం ఉషశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు ఘంటసాల వెంకటేశ్వరరావు

మూలాలుసవరించు

  1. సంపాదకుడు (11 May 1962). "చిత్ర సమీక్ష - భాగ్యవంతులు". ఆంధ్రప్రభ దినపత్రిక. Retrieved 23 February 2020.
  2. కొల్లూరి భాస్కరరావు. "భాగ్యవంతులు - 1962 (డబ్బింగ్)". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 23 February 2020.