పినిశెట్టి శ్రీరామమూర్తి

పినిశెట్టి శ్రీరామమూర్తి తెలుగు నాటక, సినిమా రచయిత, దర్శకులు.

పినిశెట్టి శ్రీరామమూర్తి
పినిశెట్టి శ్రీరామమూర్తి
జననంపినిశెట్టి శ్రీరామమూర్తి
తూర్పు గోదావరి జిల్లా పాలకొల్లు
ప్రసిద్ధితెలుగు నాటక, సినిమా రచయిత, దర్శకులు.
పిల్లలుదర్శకుడు రవిరాజా పినిశెట్టి, ఛాయాగ్రహకుడు రాము పినిశెట్టి.

జననం సవరించు

వీరు తూర్పు గోదావరి జిల్లా పాలకొల్లు లో జన్మించారు.

రచనా ప్రస్థానం సవరించు

చిన్ననాటి నుండి నాటక రచన, ప్రదర్శనలలో కృషిచేశారు. 1944 సంవత్సరంలో 'ఆదర్శ నాట్యమండలి'ని స్థాపించారు. ఆదర్శజ్యోతి అనే నాటకం రాసి, ప్రదర్శించి ప్రశంసలు పొందారు. వీరు రాసిన ఇతర నాటకాలు 'కులం లేని పిల్ల',[1] 'పల్లె పడుచు', 'అన్నా చెల్లెలు' అనేక నాటక సమాజాల వారు దేశమంతటా ప్రదర్శించారు. స్త్రీ పాత్ర లేకుండా రాసిన 'ఆడది' నాటిన వేయికి పైగా ప్రదర్శనలు ఇవ్వబడి చరిత్ర సృష్టించింది. అదే విధంగా 'పంజరంలో పక్షులు', 'రిక్షావాడు', 'సాగరయ్య సంసారం' కూడా బహుళ ప్రజాదరణ పొందాయి. ‘పల్లెపడుచు’ నాటకాన్ని సినిమాగా బోళ్ల సుబ్బారావు నిర్మించడంతో సినీ రచయితగా పినిశెట్టి చలనచిత్ర రంగంలోకి ప్రవేశించారు. ‘రాజూ- పేద’ చిత్రానికి వీరు సమకూర్చిన సంభాషణలు అత్యంత సహజంగా, శక్తివంతంగా సాగి అలరించటంతో వీరి ప్రస్థానం జయప్రదంగా ప్రారంభమైంది. సంతానం, ఇలవేల్పు, సిరిసంపదలు, ధర్మపత్ని, పిన్ని, జరిగిన కథ -వంటి 60పైగా చిత్రాలకు రచన చేశారు. వీరు ‘చిలకాగోరింక’, ‘గృహలక్ష్మి’ చిత్రాల్లో హాస్యపాత్రలు కూడా పోషించారు.

వీరి కుమారులు ఈనాటి మేటి దర్శకుడు రవిరాజా పినిశెట్టి, ఛాయాగ్రహకుడు రాము పినిశెట్టి. వీరి మనవడు ఆది పినిశెట్టి వర్ధమాన నటునిగా కొనసాగుతున్నారు

సినిమాలు సవరించు

మూలాలు సవరించు

  1. ఆంధ్రభూమి, సాహితి (3 October 2016). "అటకెక్కుతున్న నాటక రచన". andhrabhoomi.net. బి.నర్సన్. Archived from the original on 27 March 2020. Retrieved 27 March 2020.

బయటి లింకులు సవరించు