కె.జమునారాణి

గాయని

కె. జమునారాణి (మే 17, 1938) సుప్రసిద్ధ తెలుగు సినిమా గాయకురాలు. 1938 మే 15న ఆంధ్రప్రదేశ్ లో పుట్టారు. ఈమె తండ్రి వరదరాజులు నాయుడు ప్రైవేటు అధికారి, తల్లి ద్రౌపది వాయులీన కళాకారిణి. ఏడేళ్ల వయసులో జమునారాణి చిత్తూరు వి. నాగయ్య చిత్రం 'త్యాగయ్య'లో బాల నటుల కోసం మధురానగరిలో పాట పాడింది. పదమూడేళ్ల వయసు నుండే కథానాయకిలకు పాడటం ప్రారంభించింది. 1952లో ఆమె తొలిసారిగా మాడ్రన్ థియేటర్స్ వారి వలయపతి సినిమాలో కథానాయకి పాడారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, సింహళం భాషల్లో ఆరు వేల గీతాలు పాడారు. ఆమె బ్రహ్మచారిణి. 1955లో తమిళ గుళేబకావళి సినిమాలో జమునారాణి పాడిన పాట ఆసయుమ్ ఎన్నేసముమ్ పాటతో విజయవంతమైన పాటల పరంపర ప్రారంభించింది.

జమునారాణి తొలిసారి సింహళ భాషలో 1953లో విడుదలైన గుణరత్నం సినిమా సుజాత సినిమాలో పాడింది. ఆ తరువాత సదసులాంగ్, వనమోహిని, సురయ, మాతలాంగ్, వరద కగెడ వంటి సినిమాలలో అనేక సింహళ పాటలు పాడింది. 1998లో తమిళనాడు ప్రభుత్వం జమునారాణిని కళైమామని పురస్కారంతో సత్కరించింది. 2002 సంవత్సరానికి అరైనార్ అన్నాదురై పురస్కారాన్ని కూడా అందుకున్నది.[1]

పాడిన సినిమాలు

మార్చు

కొన్ని పాటలు

మార్చు
  1. నాగమల్లి కోనలోన
  2. ముక్కుమీద కోపం - నీ ముఖానికే అందం
  3. ఓ... దేవదా
  4. 'పదపదవె వయ్యారి గాలిపటమా,
  5. కోటు బూటు వేసిన బావ వచ్చాడయ్యా
  6. 'సరదా సరదా సిగరెట్టు
  7. 'ఎంత టక్కరి వాడు నారాజు

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-10-10. Retrieved 2009-06-25.

బయటి లింకులు

మార్చు