భాణం దశరూపక భేదాలలో ఒకటి.[1] రూపకం అంటే రంగస్థల ప్రదర్శనకు అనువైన రచన. ఇవి ఈనాటి స్క్రిప్ట్ ల వంటివి. సినిమాలు తీయుటకు అనువైన రచనల వంటివి.

దశ రూపకాలుసవరించు

దశ రూపకాలు పది రకాలు;[2]

  1. నాటకము
  2. ప్రకరణము
  3. భాణము
  4. ప్రహసనము
  5. డిమము
  6. వ్యాయోగము
  7. సమవాకారము
  8. వీధి
  9. అంకము
  10. ఈహామృగము

భాణం- విధానంసవరించు

భాణం లో ఒకే ఒక అంకం ఉంటుంది. ఒకే ఒక పాత్ర ఉంటుంది. ఒకే ఒక కల్పిత ఇతివృత్తం ఉంటుంది. ఇతివృత్తం ఎలాంటిదైన ఆ పాత్ర దాని గురించి, తన అనుభవాలను గాని ఇతరుల అనుభవాలను కాని వర్ణించి, అభినయించి, వివరిస్తాడు. ఇటువంటి పాత్ర ధూర్తుడు గాని విటుడు గాని అయి ఉంటాడు. ఒకొక సారి ఆకాశం లో ఎవరో అదృశ్య పురుషుడు (ఆకాశ రామన్న లాంటి వాడు అన్నమాట!) చెపుతున్న మాటలను విని వాటిని మనకు వివరిస్తుంటాడు ధూర్తుడు. ఉప్పులూరి వెంకట కవి తన సకల లక్షణ సార సంగ్రహం అనే పుస్తకంలో ‘అంబాల భాణం’ గురించి వర్నిచాడు కాని, దాని కర్త ఎవరో తెలియరాలేదు.

మూలాలుసవరించు

3. సమగ్ర ఆంధ్ర సాహిత్యం, ఆరుద్ర, తెలుగు అకాడెమి, 2008 ఎడిషన్, పుట 631

ఇతర లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=భాణం&oldid=3880002" నుండి వెలికితీశారు