దశ రూపాకాలలో నాలుగవ రూపకము ప్రహసనము. ఎక్కువగా హింసింపచేసేది, నవ్వు పుట్టించేది, హాస్య వచన కలిగినది ప్రహసనము.

దశ రూపకాలు సవరించు

దశ రూపకాలు పది రకాలు;[1]

 1. నాటకము
 2. ప్రకరణము
 3. భాణము
 4. ప్రహసనము
 5. డిమము
 6. వ్యాయోగము
 7. సమవాకారము
 8. వీధి
 9. అంకము
 10. ఈహామృగము

ప్రహసనము - విధానం సవరించు

ప్రహసనము కలిగిన నాటికను ఆధునికులు హాస్య నాటిక లేదా వినోత నాటిక అంటారు. దీనిలో హాస్యరసం ప్రధానంగా ఉంటుంది. భారతీవృత్తి ప్రయోగం ఉంటుంది. ఒకే అంకం, అందులో మొదటి సగం ముఖ సంధికి, రెండో సగం నిర్వహణ సంధికి ఉంయోగించడం జరుగుతుంది. ఇందులోని ఇతివౄత్తం కల్పితంగా ఉంటుంది. దీనిలో విష్కంభ ప్రవేషకాలు, ఆరభట్టీ వృత్తి ప్రవేశము ఉండకూడదు.

ప్రహసనం రెండు రకాలని భరతముని నాట్యశాస్త్రంలో చెప్పడం జరిగింది. 1. శుద్ధ ప్రహసనం, 2. సంకీర్ణ ప్రహసనం.

చిలకమర్తివారి ప్రహసనాలు సవరించు

 
చిలకమర్తి లక్షీనరసింహ

ప్రహసనములు చిలకమర్తి లక్ష్మీనరసింహం రచించిన ప్రసిద్ధ హాస్య నాటికలు. ఇది రూపకంలో ఒక రకమైనది.

ఇందులోని ప్రహసనములు సవరించు

 1. కనకశునక ప్రహసనము
 2. మహారసిక ప్రహసనము
 3. గయ్యాళి గంగమ్మ ప్రహసనము
 4. ఆత్మగౌరవ ప్రహసనము
 5. వరదక్షిణ ప్రహసనము
 6. బధిరచతుష్టయ ప్రహసనము
 7. బలవంత బ్రాహ్మణార్థ ప్రహసనము
 8. అద్భుత శ్రార్థ ప్రహసనము
 9. కైలాసదూత ప్రహసనము

మూలాలు సవరించు

 1. గూగుల్ బుక్స్ లో "దక్షరూపక విధానం" నుండి
 • చిలకమర్తి ప్రహసనములు (ప్రసిద్ధ హాస్య నాటికలు), శ్రీమానస పబ్లికేషన్స్, విజయవాడ.
 • ప్రహసనము, నాటక విజ్ఞాన సర్వస్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట. 424.
"https://te.wikipedia.org/w/index.php?title=ప్రహసనము&oldid=3879495" నుండి వెలికితీశారు