భారతదేశంలో వైద్య కళాశాలలు

భారతదేశంలో వైద్య విద్యను అందించే విద్యా సంస్థ, వైద్య కళాశాల. అమెరికా లోను, కొన్ని ఇతర దేశాలలోనూ దీన్ని "వైద్య పాఠశాల" అంటారు. MBBS అనేది ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం 1956 ద్వారా స్థాపించబడిన వైద్య డిగ్రీ. ప్రస్తుతం ఇది నేషనల్ మెడికల్ కమిషన్ చట్టం 2019 కులోబడి ఉంది. MBBS తర్వాత, వైద్యులు రాష్ట్రాల వైద్య మండళ్ళలో నమోదు చేసుకుంటారు.

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లోని రాయల్ ఆస్ట్రలేసియన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ (RACS)లో సుశ్రుతుని (800 BCE) విగ్రహం. ఇతను సుశ్రుత సంహిత రచయిత, శస్త్రచికిత్సకు పితామహుడు అయిన భారతీయ వైద్యుడు.

గుర్తింపు మార్చు

భారతీయ చట్టం ప్రకారం ఈ సంస్థలను నేషనల్ మెడికల్ కమిషన్ గుర్తించాలి [1] ఇలా ఆమోదించబడిన వైద్య కళాశాలల జాబితాను భారత ప్రభుత్వం వద్ద ఉంటుంది. [2] MBBS డిగ్రీలు లేని వ్యక్తులు కొందరు, వైద్యుల వలె ప్రాక్టీస్ చేస్తూంటారు. వారిని క్వాక్స్ అంటారు. నేషనల్ మెడికల్ కమీషన్ యాక్ట్ 2019 ప్రకారం, ఇలాంటి వారికి 1 సంవత్సరం వరకు జైలు శిక్ష, INR 5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. [3]

ప్రవేశాలు, విద్య మార్చు

భారతదేశంలో ఆధునిక వైద్యం చేసేందుకు అవసరమైన ప్రామాణిక డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ (MBBS). ఐదున్నర-సంవత్సరాల గ్రాడ్యుయేట్ చదువు పూర్తి చేసిన తర్వాత సంపాదించే డిగ్రీ ఇది. సాధారణ సైన్స్ సబ్జెక్టులలో ఒక సంవత్సరం ప్రి-క్లినికల్ అధ్యయనాలు, మూడున్నర సంవత్సరాల పారాక్లినికల్, క్లినికల్ స్టడీస్‌తో దీని పాఠ్యప్రణాళిక కూడుకుని ఉంటుంది. ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు క్లినికల్ ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ఇంటర్న్‌షిప్ ప్రారంభించే ముందు, విద్యార్థులు అనేక పరీక్షలలో ఉత్తీర్ణులు కావాలి. వాటిలో చివరి దాన్ని రెండు భాగాలుగా నిర్వహిస్తారు. మెడికల్ స్పెషాలిటీలలో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ కోసం MBBS అయిన తర్వాత మూడు సంవత్సరాల పాటు చదవాలి. ఇది చదివాక మాస్టర్ ఆఫ్ సర్జరీ గానీ, డాక్టర్ ఆఫ్ మెడిసిన్ గానీ లభిస్తుంది. ఆ తరువాత మరో రెండు సంవత్సరాల చదువు పూర్తి చేస్తే మెడికల్ స్పెషలైజేషన్‌లలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాలు పొందవచ్చు.

వైద్య కళాశాలలు మార్చు

వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రకారం, అత్యధిక సంఖ్యలో వైద్య కళాశాలలు (392) ఉన్న దేశం భారతదేశం. [4] ప్రాంతాల వారీగా కళాశాలల జాబితా ఇది:

ప్రాంతం వారీగా మార్చు

స.నెం ప్రాంతాలు వైద్య కళాశాల జాబితా MBBS అందిస్తున్న కళాశాలల సంఖ్య [5] ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కళాశాలలు ప్రైవేట్ కళాశాలలు ప్రభుత్వం కళాశాల సీట్లు ప్రైవేట్ కాలేజీ సీట్లు మొత్తం సంఖ్య. సీట్లు
SI దక్షిణ భారతదేశం 154 52 102 6830 13705 20535
WI వెస్ట్ ఇండియా 77 34 43 4540 5295 98034
NI ఉత్తర భారతదేశం 70 37 33 4499 3745 8244
EI తూర్పు భారతదేశం 47 37 10 4116 1010 5026
మొత్తం 348 160 188 19985 23755 43640

రాష్ట్రాల వారీగా మార్చు

క్ర.సం రాష్ట్రం/కేం.పా.ప్రాం కాలేజీల సంఖ్య[5] ప్రభుత్వ కాలేజీలు ప్రైవేటు కాలేజీలు ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు ప్రైవేటు కాలేజీల్లో సీట్లు మొత్తం సీట్లు
1 ఆంధ్రప్రదేశ్ 31 13 18        2,410        2,800        5,210
2 అస్సాం 8 8 0        1,050               -          1,050
3 బీహార్ 17 11 6        1,390           750        2,140
4 చండీగఢ్ 1 1 0           150               -             150
5 ఛత్తీస్‌గఢ్ 10 7 3           895           450        1,345
6 ఢిల్లీ 10 8 2        1,222           200        1,422
7 గోవా 1 1 0           180               -             180
8 గుజరాత్ 31 18 13        3,700        2,000        5,700
9 హర్యానా 12 5 7           710           950        1,660
10 హిమాచల్ ప్రదేశ్ 8 7 1           770           150           920
11 జమ్మూ కాశ్మీర్ 10 9 1        1,035           100        1,135
12 జార్ఖండ్ 8 7 1           630           150           780
13 కర్ణాటక 60 19 41        2,900        6,445        9,345
14 కేరళ 31 10 21        1,555        2,550        4,105
15 మధ్యప్రదేశ్ 23 14 9        2,135        1,450        3,585
16 మహారాష్ట్ర 57 26 31        4,430        4,570        9,000
17 మణిపూర్ 2 2 0           225               -             225
18 మిజోరం 1 1 0           100               -             100
19 ఒడిశా 12 8 4        1,250           700        1,950
20 పుదుచ్చేరి 9 2 7           380        1,150        1,530
21 పంజాబ్ 10 4 6           650           775        1,425
22 రాజస్థాన్ 24 16 8        2,900        1,300        4,200
23 సిక్కిం 1 0 1               -                50              50
24 తమిళనాడు 52 26 26        3,650        4,350        8,000
25 తెలంగాణ 34 11 23        1,790        3,450        5,240
26 త్రిపుర 2 1 1           125           100           225
27 ఉత్తర ప్రదేశ్ 57 26 31        3,178        4,250        7,428
28 ఉత్తరాఖండ్ 6 4 2           525           300           825
29 పశ్చిమ బెంగాల్ 26 20 6        3,150           850        4,000
మొత్తం 558 289 269 43,435 39,840 83,275

మూలాలు మార్చు

  1. "Medical Council of India: Home Page". Archived from the original on 2009-11-03. Retrieved 2022-01-13.
  2. "STATUS OF MEDICAL COLLEGES FOR ADMISSION FOR THE ACADEMIC SESSION 2007–08". mohfw.nic.in. Archived from the original on 1 సెప్టెంబరు 2006. Retrieved 19 March 2018.
  3. "NMC Act: Punishment for quackery enhanced up to one year imprisonment and fine of Rs. 5 lakh says Harsh Vardhan". Business Standard.
  4. "World Directory". World Federation for Medical Education. Archived from the original on 11 ఆగస్టు 2021. Retrieved 9 May 2021.
  5. 5.0 5.1 "Archived copy". Archived from the original on 13 May 2013. Retrieved 2014-06-29.{{cite web}}: CS1 maint: archived copy as title (link) ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ":0" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు