సుశ్రుత సంహిత

ఆరోగ్యం, శస్త్ర చికిత్సలపై పురాతన భారతీయ సంస్కృత గ్రంథం

శుశృత సంహిత (सुश्रुत संहिता) అనే ఆయుర్వేద గ్రంథం ఆయుర్వేద వైద్యులకు లభించిన మొట్టమొదటి ప్రామాణిక గ్రంథం. దీనిని శుశృతుడు సంస్కృతంలో రచించాడు.

సుశ్రుత సంహిత
సుశ్రుత సంహిత పుస్తక ముఖచిత్రం
కృతికర్త: సుశ్రుతుడు
అసలు పేరు (తెలుగులో లేకపోతే): सुश्रुत संहिता
దేశం: భారతదేశం
భాష: సంస్కృతం
ప్రక్రియ: ఆయుర్వేదం
ప్రచురణ: రోహిణి పబ్లికేషన్స్, విజయవాడ
విడుదల: 2011
పేజీలు: 576

గ్రంథ విశేషాలు మార్చు

సుశ్రుత సంహితలో సంపూర్ణ ఆయుర్వేద శస్త్రచికిత్సా విజ్ఞానం యిమిడి ఉంది. ఈ గ్రంథంలో ప్రధానంగా రెండు భాగాలు ఉన్నాయి. మొదటిది పూర్వ తంత్ర కాగా రెండోది ఉత్తర తంత్ర, ఈ గ్రంథంలో ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడిన "అష్టాంగ హృదయం " వివరింపబడింది.

ఈ "శుశృత సంహిత" లలో 184 అధ్యాయాలు ఉన్నాయి. దీనిలో మనిషి సాధారణంగా గురికాబడే వ్యాధులు 1120 గా నిరూపింపబడింది. అలాగే మానవ శరీరం నిర్మాణం తీరుతెన్నుల గురించి, ప్రతి అవయవ నిర్మాణం గురించి విపులంగా చెప్పబడింది. 700 పై బడిన ఔషధీ మొక్కల లక్షణ విశేషాలు - ఏ వ్యాధికి ఏ మొక్క ఎలా ఔషధంగా ఉపయోగపడి రోగాన్ని ఎలా తగ్గిస్తుందో ఉదాహరణ పూర్వకంగా నిరూపించబడింది. 64 రకాల ఖనిజాల నుండి మందులను ఎలా తయారుచేసుకోవాలో యివ్వబడినాయి. అంతేకాక జంతు సంబంధమైన అవయవాల నుండి 57 ఔషదాలను తయారుచేసే వైద్య విన్ఞానం ఉంది.

ఈ గ్రంథంలో 101 శస్త్ర పరికరాల గురించి వివరించాడు. సంపూర్ణ ఆరోగ్యాన్ని నిర్వహించుటకు అందరికీ ప్రయోజనకరమైన అనువైన విధానాలతో, తేలికగా అర్థం చేసుకునే విధంగా ఈ గ్రంథ రచన చేశరు. ఈ రోజున కూడా వైద్య సమాచారం నిమిత్తం ఒక బంగారు నిధి తరహాలో ఈ గ్రంథం ఉపయోగపడుచున్నది. ఏ చిన్న సర్జరీ లేకుండా అనేకానేక వ్యాథులను నియంత్రించడానికి, తగ్గించడానికి ఎన్నో సూచనలు ఈ గ్రంథంలో చోటుచేసుకున్నాయి.

ఈ గ్రంథంలో విరిగిన ఎముకలు పనిచేసేందుకు కట్టే కర్ర బద్దీల గురించి, శస్త్ర చికిత్సలలో వాడే వివిధ పరికరాల గురించి, ప్రస్తావన ఉంది. శస్త్ర చికిత్సల గురించి విస్తృతంగా చర్చించడమే కాకుండా శస్త్ర చికిత్సలలో వాడే వివిధ శలాకల గురించి ఏకంగా ఒక తంత్రాన్నే రచించారు. దీనినే "శల్యతంత్ర" అంటారు. ఇతర వైద్య విభాగాలలో కూడా ఎంతో సాధికారత సాధించిన ఈయన గాయాలకు, పుండ్లకు చీము చేరకుండా నయం చేయడమే చికిత్స అని, వేగవంతమైన చికిత్స ఇతర వ్యాథులను దరిచేరచివ్వడని పేర్కొన్నాడు. మత్తుమందు ఇవ్వకుండా శస్త్రచికిత్స చేయటం అమానుషమని భావించి మూలికారసము, సోమరసము (మధ్యం) స ద్వారా మత్తు కలిగించి, "అనస్తీషియా" ప్రక్రియకు తొలిరూపం అందించినవారయ్యారు.

అనువాదాలు మార్చు

మూలాలు మార్చు

  1. Ramachandra S.K. Rao, Encyclopaedia of Indian Medicine: historical perspective, Volume 1, 2005, 94-98.
  2. Susruta-Samhita: With English Translation of Text and Dalhana's Commentary Along with Critical Notes, 3 Vols. Vol. I: Sutrasthana, Vol. II: Kalpasthana and Uttaratantra, Vol. III: Nidana, Sarira and Cikitsasthana; Chowkhamba Visvabharati; Varanasi, India; 1999; First Edition; 1983 pages.
  3. ప్రాచీన ఆయుర్వేద వైద్యగ్రంథం, సుశ్రుత సంహిత చికిత్సా స్థానము, సాంధ్రతాత్పర్యము, రోహిణి పబ్లికేషన్స్, విజయవాడ, 2011.

బయటి లింకులు మార్చు