భారతీయులకు వీసా అవసరం లేని దేశాలు

ప్రపంచంలో కొన్ని దేశాలకు భారతీయులు వీసా లేకుండానే వెళ్ళవచ్చు.. ఇటీవల ఆయా దేశాలకు సంబంధించి ఎలాంటి ప్రయాణ సంబంధ మార్పులు లేవన్న విషయాన్ని ప్రజలు సంబంధిత ఎంబసీ లేదా దౌత్య కార్యాలయాన్నిగానీ సంప్రదించి నిర్ధారణ చేసుకోవలసి ఉంటుంది. వీసా అవసరం లేని దేశాలు , ఆయా ప్రాంతాలు..

హాంకాంగ్ (14 రోజులవరకు వీసా అవసరం లేదు) కేప్ వెర్డే కొమొరోస్ దీవులు, డిజిబౌటి ఇథియోపియా మడగాస్కర్ (30 రోజులవరకు చెల్లుబాటు) సెయింట్ లూసియా (ఆరు వారాలవరకు) సమోవా (60 రోజులవరకు) జోర్డాన్ (రెండు వారాలవరకు) కెన్యా (మూడు నెలలవరకు) ఇండోనీసియా (30 రోజులవరకు) లావోస్ (30 రోజులవరకు) సిషేల్లస్ (నెల రోజులవరకు) పలవూ (30 రోజులు) డొమినికా ఈక్వెడార్ ఎల్ సాల్వడార్ ఫిజీ, హైతీ మైక్రొనీసియా నేపాల్ భూటాన్ గ్రెనడా మారిషస్ రీయూనియన్ సెయింట్ విన్సెంట్ బ్రిటిష్ వర్జిన్ ఐల్యాండ్స్ మాంట్ సెరాట్

ఇది కాక 43 దేశాల్లో భారతీయులకు అరైవల్ వీసా ఇస్తున్నాయి, 36 దేశాల్లో ఈ-వీసా అందిస్తున్నాయి ఇరాన్, ఇండొనేసియా, మయన్మార్ లాంటి దేశాల్లో భారతీయులకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. శ్రీలంక, న్యూజిలాండ్, మలేసియా లాంటి దేశాలు ఈ-వీసా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి[1].

  1. "భారత పాస్‌పోర్ట్ హోల్డర్లకు.. ఈ 16 దేశాల్లో వీసా-ఫ్రీ ఎంట్రీ". www.andhrajyothy.com. Retrieved 2020-09-23.