ద్వీపంలో కొత్త యురేపియన్ సెటలర్లలో ఫ్రెంచ్ ప్రథమస్థానంలో ఉంది.1660లో వారు స్థానిక కరీబియన్ ఇండియన్లతో ఒక ఒప్పందం మీద సంతకం చేసారు.1663-1667 వరకు ఇంగ్లాండ్ ద్వీపం మీద ఆధీనత సాధించింది. తరువాతి కాలంలో ఇక్కడ ఫ్రెంచి వారితో 14 మార్లు యుద్ధాలు సంభవించాయి. ద్వీపం పాలన తరచుగా ఇగ్లాండు, ఫ్రెంచి నడుమ మారుతూ వచ్చింది. ఇది 7 మార్లు ఇంగ్లాండు పాలనలో మరొక 7 మార్లు ఫ్రెంచి పాలనలో ఉంది.1814 లో బ్రిటన్ ద్వీపం మీద సంపూర్ణ అధికారం సాధించింది.వెస్టిండీస్ దీవులలో సెయింట్ లూసియా " హెలెన్ ఆఫ్ ట్రాయ్ " అని వర్ణించబడింది.1840లో ప్రతినిధుల పాలన మొదలైంది. 1953లో ఓటు హక్కు కల్పించబడింది.1958 నుండి 1962 వరకు ద్వీపం " వెస్ట్ ఇండీస్ ఫెడరేషన్ "లో భాగంగా ఉంది. 1979 ఫిబ్రవరిలో సెయింట్ లూసియా కామంవెల్త్ దేశాలలోని ఐక్యరాజ్యసమితి అనుసంధానిత స్వతంత్రదేశంగా మారింది. [4] సెయింట్ లూసియాలో మిశ్రిత న్యాయవ్యవస్థ అమలులో ఉంది.[5] సెయింటు లూసియా న్యాయవిధానం " సివిల్ లా, ఇంగ్లీష్ కామల్ లా " ఆధారితంగా ఉంటుంది. 1867 సెయింట్ లూసియా సివిల్ కోడ్ "1866 సివిల్ కోడ్ ఆఫ్ లోవర్ కెనడా " ఆధారితంగా ఉంటుంది. ఇది " లా ఫ్రాంకోఫొనీ "లో సభ్యదేశంగా ఉంది.[6]

Saint Lucia

Flag of St Lucia
జండా
Coat of arms of St Lucia
Coat of arms
నినాదం: "The Land, The People, The Light"
గీతం: 
Location of St Lucia
Location of St Lucia
రాజధానిCastries
అధికార భాషలుఆగ్లం[1] ఆగ్లం[2]
Vernacular
language
s
సెయింట్ లూసియా క్రియోల్ ఫ్రెంచ్ [1] సెయింట్ లూసియా క్రియోల్ ఫ్రెంచ్[2]
జాతులు
పిలుచువిధంSaint Lucian
ప్రభుత్వంParliamentary democracy under constitutional monarchy
• Monarch
Queen Elizabeth II
Pearlette Louisy
Kenny Anthony
శాసనవ్యవస్థParliament
• ఎగువ సభ
Senate
• దిగువ సభ
House of Assembly
Independence
1 March 1967
• from the United Kingdom
22 February 1979
విస్తీర్ణం
• మొత్తం
617 కి.మీ2 (238 చ. మై.) (191st)
• నీరు (%)
1.6
జనాభా
• 2009 census
173,765
• జనసాంద్రత
298/చ.కి. (771.8/చ.మై.) (41st)
GDP (PPP)2011 estimate
• Total
$2.101 billion[3]
• Per capita
$12,927[3]
GDP (nominal)2011 estimate
• Total
$1.239 billion[3]
• Per capita
$7,769[3]
హెచ్‌డిఐ (2012)Increase 0.725
high · 88th
ద్రవ్యంEast Caribbean dollar (XCD)
కాల విభాగంUTC−4
వాహనాలు నడుపు వైపుleft
ఫోన్ కోడ్+1 758
ISO 3166 codeLC
Internet TLD.lc

చరిత్ర

మార్చు

1550లో ఫ్రెంచ్ సముద్రపు దొంగ " ఫ్రాంకోయిస్ లే క్లెర్క్ " (ఆయన తన కొయ్యకాలు కారణంగా " జాంబే డీ బొయిస్ " అని కూడా గుర్తించబడ్డాడు) ఈదీవిని తరచుగా సందర్శించాడు.మొదటి సారిగా 1600లో ఈదీవిలో డచ్ వారు ప్రస్తుత వియెక్స్ ప్రాంతంలో మొదటి యురేపియన్ క్యాంపు స్థాపించారు. 1605లో " ఆలివ్ బ్రాంచ్ " అనే ఇంగ్లీష్ వెసెల్ గయానా వెళుతూ ఇక్కడ విరిగిపోయింది.తరువాత 67 మంది కాలనిస్టులు ఇక్కడ సెటిల్మెంటు స్థాపించారు. ఐదు వారాల తరువాత అంటువ్యాధులు , కరీబియన్లతో కలహాలు కారణంగా 19మంది మినహా మిగిలినవారంతా చనిపోయారు.అందువలన వారు ద్వీపాన్ని వదిలి వెళ్ళారు. 1635లో ఫ్రెంచ్ ద్వీపాన్ని స్వాధీనపరచుకుంది.1639లో ఇంగ్లాండు తరువాత సెటిల్మెంటు స్థాపించడానికి ప్రయత్నించింది.కరీబియన్లు దానిని తిప్పికొట్టారు.

ఫ్రెంచ్ కాలనీ

మార్చు

1943లో మార్టిన్యూ నుండి బయలుదేరిన ఫ్రెంచి సైనిక దళం ఇక్కడ ఒక శాశ్వత సెటిల్మెంటు స్థాపించింది. డీ రుసెల్లన్ ద్వీపానికి గవర్నరుగా నియమించబడ్డాడు. ఆయన కరీబియన్ మహిళను వివాహం చేసుకుని 1654లో మరణించే వరకు తన పదవిలో కొనసాగాడు.1664 లో ఎస్.టి కిట్స్ గవర్నరు థామస్ వార్నర్ ఇంగ్లాండు తరఫున సెయింట్ లూసియాను జయించాడు. ద్వీపాన్ని రక్షించడానికి థామస్ ఫ్రెంచ్ నుండి 1,000 మందిని కొనుగోలు చేసాడు. రెండు సంవత్సరాల తరువాత అంటువ్యాధుల కారణంగా వీరిలో అనేకమంది మరణించిన తరువాత 89 మంది మాత్రం మిగిలారు. 1966లో ఫ్రెంచ్ వెస్టిండీస్ కంపెనీ ద్వీపాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నది. 1674లో ఇది అధికారికంగా మార్టింక్యూ డిపెండెంసీగా ఫ్రెంచ్ క్రౌన్ కాలనీ అయింది.[7]

18వ , 19వ శతాబ్ధం

మార్చు

చక్కెర పరిశ్రమ అభివృద్ధి చెందిన తరువాత బ్రిటిష్ , ఫ్రెంచి దేశాలు రెండూ ఈ ద్వీపం పట్ల ఆకర్షితులయ్యారు. 18వ శతాబ్ధంలో ద్వీపం యాజమాన్యం మార్చబడింది. దాదాపు ఒక 12మార్లు న్యూట్రల్ టెర్రిటరీగా ప్రకటించినప్పటికీ ఫ్రెంచి సెటిల్మెంట్లు అలాగే ఉన్నాయి.1722లో " జార్జి ఐ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ " సెయింట్ లూసియా , సెయింట్ వింసెంట్ ద్వీపాలు రెండు సెకండ్ డ్యూక్ ఆఫ్ మాంటగూకు మంజూరు చేయబడింది. ఆయన సాహసయాత్రికుడు , మర్చంట్ సీ కేప్టన్ " నాథనియేల్ యురింగ్ " ను ఈ ప్రాంతానికి డెఫ్యూటీ గవర్నరుగా నియమించాడు.యురింగ్ 7 నౌకలలో పరివారంతో ఇక్కడ సెటిల్మెంటు స్థాపించాడానికి ద్విపాన్ని చేరుకున్నాడు.బ్రిటిష్ యుద్ధనౌకల సహాయం అందక యురింగ్ ఫ్రెంచ్ వారి చేత ద్వీపం నుండి తరిమివేయబడ్డాడు.[8] 7 సంవత్సరాల యుద్ధం సమయంలో బ్రిటిష్ ఒక సంవత్సరకాలం ద్వీపాన్ని స్వీధీనం చేసుకుంది. డచ్ , ఇంగ్లీష్‌కు చెందిన ఇతర ద్వీపాలలో మాదిరిగా ఈ ద్వీపంలో ఫ్రెంచ్ చెరకు పంటలకు అనుకూలంగా అభివృద్ధిపనులు ఆరంభించింది.1765 నాటికి ద్వీపంలో చెరకు తోటలు అతివేగంగా అభివృద్ధి చేయబడ్డాయి.

ఫ్రెంచ్ విప్లవం సంభవించిన విషయం బానిసలు అవగాహన చేసికొని 1790-1791లో వారి పనులను వదిలి స్వంతపనులను చేసుకోవడం ప్రారంభించారు. 1792లో కేప్టన్ " జీన్ బాప్టిస్టే రేమండ్ డీ లాక్రాస్సే " నాయకత్వంలో సెయింట్ లూసియా ద్వీపానికి ట్రిబ్యూనల్ పంపబడింది. సెయింట్ లూసియాకు విప్లవభావాలను తీసుకువచ్చిన లాక్రోస్ రాజకుటుంబీకుల విధినిర్వహణ కొరకు గుయిలాట్టైన్ ఏర్పాటు చేసాడు.1794లో సెయింట్ లూసియా ద్వీపంలోని ఫ్రెంచ్ గవర్నర్ " నికోలస్ క్సేవియర్ డీ రికార్డ్ " బానిసలందరిని విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు. కొంతకాలం తరువాత ఫ్రెంచితో సంభవించిన యుద్ధంలో భాగంగా బ్రిటిష్ ఈ ద్వీపాన్ని ఆక్రమించుకుంది. 1795 ఫిబ్రవరి 21న విక్టర్ హుగ్యూస్ నాయకత్వంలో ప్రాంతీయ సైనికబృందాలు బ్రిటీష్ సైనికదళాలను ఓడించింది. 1796లో కాస్టరీలు సంఘర్షణలో భాగంగా కాల్చివేయబడ్డాయి. 1803లో బ్రిటిష్ తిరిగి ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంది. తిరుగుబాటుదారులలో చాలా మంది దట్టమైన వర్షారణ్యాలకు తప్పించుకుని పారిపోయి అక్కడ మారూన్ కమ్యూనిటీలను స్థాపించారు.[9] మరికొంత కాలం ద్వీపంలో బానిసత్వం కొనసాగింది.బ్రిటన్‌లో బానిసత్వానికి వ్యతిరేకభావన అధికం అయింది.1807లో బానిసత్వం నిర్మూలించబడిన తరువాత బ్రిటన్ అన్ని మార్గాలలో బానిసలను దిగుమతి చేయడం నిలిపివేసింది.1814లో బ్రిటిష్ సెయింటు లూసియాలో బలపడే వరకు బ్రిటిష్ , ఫ్రెంచ్ మద్య పోటీ కొనసాగింది.ట్రీటీ ఆఫ్ పారిస్ ఒప్పందం తరువాత " నపొలియోనిక్ యుద్ధాలు " ముగింపుకు వచ్చాయి. తరువాత సెయింట్ లూసియా " బ్రిటిష్ విండ్వార్డ్ ఐలాండ్స్ " భాగంగా మారింది.1836లో ద్వీపంలో , బ్రిటిష్ సాంరాజ్యంలో బానిసవ్యాపారం నిషేధించబడింది. నిషేధం తరువాత బానిసలందరూ స్వేచ్ఛాజీవనానికి అలవాటుపడాడానికి నాలుగు సంవత్సరాల అప్రెంటీస్ షిప్ విధానంలో పనిచేసారు. ఈసమయంలో వారు వారి మునుపటి యజమానులకు పనివారంలో మూడు వంతుల సమయం సేవలందించారు. 1838లో బ్రిటిష్ ప్రభుత్వం బానిసలకు సంపూర్ణ స్వాతంత్రం మంజూరు చేసింది.

20వ శతాబ్ధం

మార్చు

20వ శతాబ్ధం మద్యలో కాలనీ పాలన రద్దుచేయబడిన తరువాత సెయింట్ లూసియా " వెస్టిండీస్ ఫెడరేషన్ "(1958-1962) చేర్చబడింది. 1962లో సెయింట్ లూసియా " వెస్ట్ ఇండీస్ అసోసియేట్ స్టేట్స్ " లో సభ్యదేశంగా మారింది.1979లో సెయింట్ లూసియాకు పూర్తి స్వాతంత్రం లభించింది.స్వతంత్రం లభించిన తరువాత స్వతంత్రపోరాటానికి నాయకత్వం వహించిన యునైటెడ్ వర్కర్స్ పార్టీ నాయకుడు " సర్ జాన్ కాంప్టన్ సెయింట్ లూసియా ప్రధాని అయ్యాడు. ఆయన 1982 నుండి 1996 వరకు పాలనసాగించాడు. ఆయన తరువాత వౌఘన్ లూయిస్ అధికారబాధ్యత స్వీకరించాడు.

లేబర్ పార్టీ నాయకుడు డాక్టర్. కెన్ని డేవిస్ ఆంథోనీ 1997 నుండి 2006 వరకు ప్రధానమంత్రి పదవిని వహించాడు. 2006లో కాంప్టన్ నాయకత్వంలో యు.డబల్యూ.పి. పార్టీ ఎన్నికలలో విజయంసాధించి పార్లమెంటు మీద అధికారం స్వాధీనం చేసుకుంది. 2007లో కాంప్టన్ వరుస గుండెనొప్పితో బాధపడ్డాడు. ఆర్థికమంత్రి " స్టీఫెంసన్ కింగ్ " తత్కాలిక ప్రధానమంత్రిగా బాధ్యత వహించి కాంప్టన్ తరువాత పూర్తిస్థాయి అధికార బాధ్యత వహించి 2007 సెప్టెంబరులో మరణించాడు. 2011నవంబరులో డాక్టర్ కెన్నీ తిరిగి ఎన్నికచేయబడి ప్రధానమంత్రిగా మూడవమారు బాధ్యతస్వీకరించాడు. 2016లో నిర్వహించబడిన ఎన్నికలలో యు.డబల్యూ.పి. తిరిగి అధికారానికి వచ్చింది.[10]

భౌగోళికం

మార్చు
 
A map of Saint Lucia.

కరీబియన్ ద్వీపాలలో అగ్నిపర్వత ప్రాంతం అయిన సెయింట్ లూసియా అత్యధికంగా పర్వతమయంగా ఉంటుంది.సముద్రమట్టానికి 950 మీ ఎత్తైన మౌంట్ జిమీ దేశంలో అత్యంత ఎత్తైన ప్రాంతంగా గుర్తించబడుతుంది. పిటన్ పర్వతశిఖరం దేశానికి ప్రఖ్యాత గుర్తింపు చిహ్నంగా భావించబడుతుంది.ఈపర్వతాలు ద్వీపానికి పశ్చిమంలో సౌఫ్రియరే, చొయిసెయు ప్రాంతాలలో ఉన్నాయి.ప్రపంచంలో వాల్కనొ డ్రైవ్ సౌకర్యం కలిగిస్తున్న కొన్న దేశాలలో సెయింట్ లూసియా ఒకటి. సెయింట్ లూసియా రాజధాని కాస్టరీస్ జనసంఖ్య 60,263. ఇక్కడ 34% ప్రజలు నివసిస్తున్నారు. సెయింట్ లూసియాలో గ్రాస్ ద్వీపం, సౌఫ్రియరీ, వియక్స్ పోర్ట్ నగరాలు ప్రధాననగరాలుగా ఉన్నాయి.

వాతావరణం

మార్చు

సెయింట్ లూసియా వాతావరణం ఉష్ణమండల వాతావరణంగా వర్గీకరించబడింది. నైరుతీ ఋతుపవనాలు వర్షపాతాన్ని సంభవింపజేస్తుంటాయి. డ్రై సెషన్ డిసెంబరు 1 నుండి మే 31 వరకు కొనసాగుతుంది.వెట్ సెషన్ జూన్ 1 నుండి నవంబరు 30 వరకు కొనసాగుతుంది. రాత్రి సరాసరి ఉష్ణోగ్రత 18డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది.భూమధ్యరేఖకు సమీపంలో ఉన్న కారణంగా వేసవి, శీతాకాలల మద్య ఉష్ణోగ్రతలో హెచ్చుతక్కువలు తక్కువగా ఉంటాయి.వార్షిక వర్షపాతం సముద్రతీర ప్రాంతాలలో 1300 మి.మీ. ఉంటుంది. పర్వతప్రాంతాలలో 3810 మి.మీ ఉంటుంది.

 
A view of Soufrière.

ఆర్ధికం

మార్చు
 
A proportional representation of St. Lucia's exports.

విద్యావంతులైన ఉద్యోగులు, అభివృద్ధి చెందిన రహదారులు, సమాచార సౌకర్యాలు, నీటి సరఫరా, అభివృద్ధి చేయబడిన మురుగునీటి నిర్వహణ, నౌకాశ్రసౌకర్యం మొదలైనవి విదేశీపెట్టుబడి దారులను విశేషంగా ఆకర్షిస్తుంది. విదేశీపెట్టుబడిదారులు పర్యాటకం, పెట్రోలియం స్టోరేజ్, రవాణా రంగాలలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు.2009 నుండి యు.ఎస్, కెనడా, ఐరోపా నుండి పర్యాటకుల రాక క్షీణించింది. యురేపియన్ యూనియన్ సమీపకాల మార్పుల కారణంగా లాటి అమెరికన్ దేశాల నుండి అరటి ఎగుమతులలో పోటీ కొనసాగుతుంది.

సెయింట్ లూసియా ప్రధాన ఆధారవనరు పర్యాటకం. సెయింట్ లూసియా పర్యాటకం, బ్యాంకింగ్ రంగాలలో పెట్టడానికి విదేశీవ్యాపారులను ఆకర్షిస్తుంది.తూర్పు కరీబియన్ ప్రాంతంలో తయారీ రంగం అత్యంత వైవిధ్యంగా ఉంటుంది. ప్రభుత్వం అరటి పంటను తిరిగి అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తుంది. 2011 ఆర్థికాభివృద్ధిలో క్షీణత ఉన్నప్పటికీ భవిష్యత్తులో జి.డి.పి. అభివృద్ధి చెందగలదని భావించారు.సెయింట్ లూసియా ద్రవ్యోల్భణం తక్కువగా ఉందని భావించబడుతుంది. 2006-2008 మద్య ద్రవ్యోల్భణం 5.5% ఉంది.సెయిట్ లూసియాలో చెలామణిలో ఉన్న కరెంసీ ఈస్టర్న్ కరీబియన్ డాలర్. ఈస్టర్న్ కరీబియన్ చెంట్రల్ బ్యాంక్ కరెంసీ నోట్లను ముద్రించడం, మానిటరింగ్ విధాననిర్వహణ, సభ్యదేశాలలో కమర్షియల్ బ్యాంకింగ్ కార్యక్రమాల పర్యవేక్షణ, నియంత్రణ బాధ్యతలు వహిస్తుంది.2003లో ప్రభుత్వం ధరల నియంత్రణ ఎత్తి వేయడం, అరటి పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడం, ఆర్థికరంగాన్ని అభివృద్ధి చేయడానికి తగిన చర్యలు తీసుకొనడం ఆరంభించింది.[11]

పర్యాటకం

మార్చు

సెయింట్ లూసియా ఆర్థికరంగానికి పర్యాటకం ప్రధాన వనరుగా ఉంది.పర్యాటకరంగం ముఖ్యత్వం నిరంతరంగా అభివృద్ధి చేయబడుతున్న అరటి మార్కెట్టుకు పోటీగాభావించబడుతుంది.సెయింట్ లూసియాను సందర్శించడానికి డ్రై సెషన్ (జనవరి నుండి ఏప్రిల్) అనుకూలంగా ఉంది. సెయింట్ లూసియాలో ఉష్ణమండల వాతావరణం, సుందరదృశ్యాలు, అనేక సముద్రతీరాలు, రిసార్టులు పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి.ఇతర ఆకర్షణలలో డ్రైవ్ ఇన్ వాల్కనొ, సర్ఫ్ రియరే వద్ద సల్ఫర్ స్ప్రింగ్స్, సెయింట్ లూసియా బొటానికల్ గార్డెంస్, ప్రపంచవారసత్వ సంపదగా గుర్తించబడిన మెజెస్టిక్స్ ట్విన్ పీక్స్ (పీటన్), పీజియన్ ఐలాండ్ నేషనల్ పార్క్ (ఇక్కడ రోడ్నే కోట, మిలటరీ బేస్) ఉంది.పర్యాటకులు అధికంగా క్రూసీ యాత్రలో భాగంగా సెయింట్ లూసియాను సందర్శిస్తుంటారు.పర్యాటకులు అధికంగా కాస్టరీలు, సౌఫ్రియరి, మారిగాట్ బే, గ్రాస్ ద్వీపం ప్రధానమైనవి.

A panorama of Marigot Bay
Gros Islet and Rodney Bay as seen from Pigeon Island

గణాంకాలు

మార్చు
Rank Quarter Population
1 Castries 0సమాసంలో (Expression) లోపం: "," అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను..సమాసంలో (Expression) లోపం: "," అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.60,263
2 Gros Islet 0సమాసంలో (Expression) లోపం: "," అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను..సమాసంలో (Expression) లోపం: "," అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.22,647
3 Vieux Fort 0సమాసంలో (Expression) లోపం: "," అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను..సమాసంలో (Expression) లోపం: "," అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.14,632
4 Micoud 0సమాసంలో (Expression) లోపం: "," అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను..సమాసంలో (Expression) లోపం: "," అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.14,480
5 Dennery 0సమాసంలో (Expression) లోపం: "," అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను..సమాసంలో (Expression) లోపం: "," అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.11,874
6 Soufrière 0సమాసంలో (Expression) లోపం: "," అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను..సమాసంలో (Expression) లోపం: "," అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.7,747
7 Laborie 0సమాసంలో (Expression) లోపం: "," అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను..సమాసంలో (Expression) లోపం: "," అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.6,507
8 Anse la Raye 0సమాసంలో (Expression) లోపం: "," అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను..సమాసంలో (Expression) లోపం: "," అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.6,033
9 Choiseul 0సమాసంలో (Expression) లోపం: "," అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను..సమాసంలో (Expression) లోపం: "," అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.5,766
10 Canaries 0సమాసంలో (Expression) లోపం: "," అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను..సమాసంలో (Expression) లోపం: "," అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.1,915
Source:[12]

2010 దేశ జాతీయ గణాంకాల ఆధారంగా సెయింట్ లూసియా జనసంఖ్య 1,65,595.[13] 2015 లో " యునైటెడ్ నేషంస్ పాపులేషంస్ డివిషన్ " గణాకాల ఆధారంగా సెయింట్ లూసితా జజసంఖ్య 1,84,999.[14] దేశజనాభాను నగరప్రాంత, గ్రామప్రాంత జసంఖ్యగా విభజించబడింది. రాజధాని కాస్టరీస్‌లో దేశజనసంఖ్యలో మూడవభాగం కంటే అధికంగా నివసిస్తున్నారు. దేశం నుండి విదేశాలకు వలసలు అధికంగా ఉన్నప్పటికీ సెయింట్ లూసియా జనసంఖ్య వార్షికంగా 1.2% అధికరిస్తూ ఉండి. దేశం నుండి విదేశాలకు వలసపోయే వారు అధికంగా ఇంగ్లీష్ ప్రధాన భాషగా కలిగిన దేశాలకు వలసపోతున్నారు. యునైటెడ్ కింగ్డంలో మాత్రమే 10,000 మంది సెయింట్ లూసియాలో పుట్టిన పౌరులు, 30,000 మంది సెయింట్ లూసియా పూర్వీకత కలిగిన పౌరులు నిచసిస్తున్నారు.సెయింట్ లూసియా నుండి విదేశాలకు పోతున్న రెండవ ప్రజలలో యునైటెడ్ స్టేట్స్‌ రెండవ స్థానంలో ఉంది. ఇక్కడ విదేశీ, సెయింట్ లూసియాలో జన్మించిన సెయింట్ లూసియన్ పౌరులు 14,000 మంది నివసిస్తున్నారు. కెనడాలో కొన్ని వేలమంది సెయింట్ లూసియా పౌరులు నివసిస్తున్నారు.[15]

సంప్రదాయ సమూహాలు

మార్చు

సెయింట్ లూసియా జనసంఖ్యలో ఆఫ్రిక, మిశ్రిత వర్ణాలకు చెందిన ఆఫ్రికన్ - యురేపియన్ ప్రజలు అధికంగా ఉన్నారు. స్వల్పసంఖ్యలో ఇండో - కరీబియన్ ప్రజలు (3%) ఉన్నారు. మిగిలిన ప్రజలలో అధికంగా జాతినిర్ణయించబడని ప్రజలు (2%) ఉన్నారు.

భాషలు

మార్చు

సెయింట్ లూసియా అధికారభాషగా ఆగ్లభాష ఉంది.[1][2] సెయింట్ లూసియన్ క్రియోల్ ఫ్రెంచి మాట్లాడే ప్రజలు 95% ఉన్నారు.[16] అంటిల్లియన్ క్రియోల్ భాషను సాహిత్యం, సంగీతం, అధికారిక సమాచార పంపిణీ కొరకు ఉపయోగించబడుతుంది.[16] ఫ్రెంచి కాలనీ పాలన ఆరంభంలో క్రియోల్ అభివృద్ధి చేయబడింది. క్రియోల్ భాషకు ఫ్రెంచి, పశ్చిమ ఆఫ్రికన్ భాషలు మూలంగా ఉన్నాయి.కొన్ని మాటలు మాత్రం ఐలాండ్ కరీబియన్ భాష నుండి స్వీకరించబడ్డాయి. సెయింట్ లూసియా " లా ఫ్రాంకోఫోనీ " సభ్యత్వం కలిగి ఉంది.[17]

Religion in Saint Lucia (2015)[18]

  Roman Catholic (61.5%)
  Protestant (25.5%)
  None (5.9%)
  Other christian (3.4%)
  Rastafarian (1.9%)
  Unspecified (1.4%)
  Other (0.4%)

జనసంఖ్యలో 61.5% రోమన్ కాథలిక్కులు ఉన్నారు. తరువాత స్థానంలో ప్రొటెస్టెంట్ డినమినేషన్లు 25.5% ఉన్నారు. వీరిలో సెవెంత్ డే అడ్వెంచరిస్టులు 10.4%, బాప్టిస్టులు 2.2%, ఆంగ్లికన్ 1.6%, చర్చి ఆఫ్ గాడ్ 1.5%, ఇతర ప్రొటెస్టెంట్లు 0.9% ఉన్నారు.ఎవాంజిలికల్స్ 2.3%, జెహోవా విట్నెస్ 1.1%. 1.9% రాస్టఫారి మూవ్మెంటుకు చెందిన ప్రజలు ఉన్నారు. ఇతర మతస్థులలో బహై, ఇస్లాం, జూడిజం, బుద్ధిజం మతాలకు చెందిన ప్రజలు ఉన్నారు.

ఆరోగ్యం

మార్చు

2004 గణాంకాల ఆధారంగా ఆరోగ్యం కొరకు ప్రభుత్వం 3.3% జి.డి.పిని వ్యయం చేస్తుందని భావిస్తున్నారు. ప్రైవేట్ వ్యయం 1.8% ఉంది.[19] ఆరోగ్యం కొరకు తలసరి $302 డాలర్లు వ్యయం చేయబడుతుంది.[19] 2005 గణాంకాల ఆధారంగా 1,00,000 జననాలకు 12 శిశుమరణాలు సంభవిస్తున్నాయి.[19]

2012 గణాంకాల ఆధారంగా సెయింటు లూసియా అత్యధిక హత్యల శాతంలో ప్రపంచంలో 16వ స్థానంలో ఉంది. 1,00,000 మందికి 21.6 గృహాంతర హత్యలు సంభవిస్తున్నాయి.[20] 2012 లో సెయింట్ లూసియాలో 39 హత్యలు జరిగాయి.[20]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 "About St. Lucia". Castries, St. Lucia: St. Lucia Tourist Board. Archived from the original on 5 జూన్ 2013. Retrieved 6 సెప్టెంబరు 2017. The official language spoken in Saint Lucia is English although many Saint Lucians also speak a French dialect, Creole (Kwéyòl).
  2. 2.0 2.1 2.2 Bureau of Western Hemisphere Affairs (U.S. Department of State) (12 August 2011). "Background Note: Saint Lucia". United States Department of State. Retrieved 11 November 2011. Languages: English (official); a French patois is common throughout the country.
  3. 3.0 3.1 3.2 3.3 "Saint Lucia". International Monetary Fund. Retrieved 21 April 2012.
  4. "The Saint Lucia Constitution" (1978-December-20 effective 1979-February-22), Government of St. Lucia, December 2008, www.stlucia.gov.lc (see below: References).
  5. MIXED LEGAL SYSTEMS Archived 2017-07-31 at the Wayback Machine. juriglobe.ca
  6. "Human development indices" (PDF). Undp.org. 2008. Archived from the original on 12 January 2012.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  7. World Statesmen: Saint Lucia Chronology Linked 2014-01-20
  8. మూస:DNB
  9. They Called Us the Brigands. The Saga of St. Lucia's Freedom Fighters by Robert J Devaux
  10. "Allen Chastanet sworn in new St Lucia PM". Jamaica Observer. 7 June 2016. Archived from the original on 8 జూన్ 2016. Retrieved 7 June 2016.
  11. "Saint Lucia Economy: Population, GDP, Inflation, Business, Trade, FDI, Corruption". Heritage.org. Archived from the original on 2011-02-20. Retrieved 2016-12-21.
  12. 2010 POPULATION AND HOUSING CENSUS PRELIMINARY REPORT. stats.gov.lc (Updated April 2011)
  13. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; census అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  14. "Total Population – Both Sexes". World Population Prospects, the 2015 Revision. United Nations Department of Economic and Social Affairs, Population Division, Population Estimates and Projections Section. July 2015. Archived from the original on 22 డిసెంబరు 2015. Retrieved 1 June 2016.
  15. "Oecd.org". Archived from the original on 17 జూన్ 2009. Retrieved 6 సెప్టెంబరు 2017.
  16. 16.0 16.1 "Kweyolphone Countries Take Stock of the Language's Growth". Government of Saint Lucia. Archived from the original on 2 April 2012. Retrieved 22 August 2008.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  17. "Welcome to the International Organisation of La Francophonie's official website". Paris: Organisation internationale de la Francophonie. Archived from the original on 4 నవంబరు 2010. Retrieved 11 November 2011.
  18. "The World Factbook — Central Intelligence Agency". www.cia.gov (in ఇంగ్లీష్). Archived from the original on 2016-01-30. Retrieved 2017-01-26.
  19. 19.0 19.1 19.2 "Human Development Report 2009 – Saint Lucia". hdrstats.undp.org. Archived from the original on 8 July 2010. Retrieved 16 November 2009.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  20. 20.0 20.1 Global Study on Homicide. United Nations Office on Drugs and Crime, 2013.

వెలుపలి లింకులు

మార్చు