భారతీయ స్టార్లెట్స్
ఇండియన్ స్టార్లెట్స్ 1960, 1967 సంవత్సరాల మధ్య 16 ఫస్ట్ - క్లాస్ మ్యాచ్ లు ఆడిన యువ భారత క్రికెటర్ల జట్టు.
పాకిస్తాన్ పర్యటన (1959 - 1960)
మార్చు1960 ఏప్రిల్ , మే నెలల్లో పదిహేడు మంది క్రీడాకారులు పాకిస్తాన్ పర్యటనలో పాల్గొన్నారు. [1] ఏడు ఫస్ట్ - క్లాస్ మ్యాచ్లు ఆడారు, అయితే అన్నీ డ్రాగా ముగిశాయి. పర్యటన ప్రారంభంలో యువ క్రీడాకారుల పేర్లు వారి వయస్సు క్రింద ఇవ్వబడింది.
- సుధాకర్ అధికారి (20) [2]
- లాలా అమర్ నాధ్ (48) (రెండు మ్యాచ్ లకు కెప్టెన్)
- ప్రేమ్ భాటియా (20) [3]
- దీనబంధు (వయస్సు తెలియదు) [4]
- ఫారుఖ్ ఇంజనీర్ (22)
- విలియం ఘోష్ (31)
- హబీబ్ అహ్మద్ (21) (ఆడిన ఐదు మ్యాచ్ ల లో నాలుగింటికి కెనాయకత్వం వహించాడు.) [5]
- హరిచరణ్ సింగ్ (21) [6]
- ఎం. ఎల్. జైసింహా (21) (అతను ఆడిన ఐదు మ్యాచ్లలో ఒకదానికి నాయకత్వం వహించాడు.)
- వి. వి. కుమార్ (24)
- గుల్షన్ మెహ్రాహ్ 6 (22) [7]
- మదన్ మెహ్రా 7 (25) [8]
- విజయ్ మెహ్రా (22)
- ఎ. జి. మిల్కా సింగ్ (18)
- బి. బి. నింబాళ్కర్ (40)
- చట్టా రమేష్ (26) [9]
- పొన్నుస్వామి సీతారాం (27) [10]
మిల్కా సింగ్ 117.25 సగటుతో 3 శతకాలతో 469 పరుగులు చేశాడు.[11] ఘోష్, కుమార్ , సీతారాం అత్యంత విజయవంతమైన బౌలర్లుగా నిలిచారు.[12]
అనుభవజ్ఞుడైన అమర్ నాధ్ కాకుండా చాలా మంది క్రీడాకారులు భారత దేశీయ క్రికెట్లో గణనీయమైన వృత్తి ని కలిగి ఉన్నారు. వారిలో ఇంజనీర్, జైసింహా, కుమార్, విజయ్ మెహ్రా, మిల్కా సింగ్ మాత్రమే టెస్ట్ క్రికెట్ ఆడారు.
మొయిన్ - ఉద్ - దౌలా గోల్డ్ కప్ టోర్నమెంట్
మార్చుఇండియన్ స్టార్లెట్స్ 1963 మార్చిలో ఆంధ్ర ముఖ్యమంత్రి XI తో స్నేహపూర్వక మ్యాచ్ ఆడింది, అయితే అది డ్రా అయింది. [13]
1964 - 65, 1967 - 68 సంవత్సరాల మధ్య ఇండియన్ స్టార్లెట్స్ హైదరాబాద్ లోని లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం జరిగిన వార్షిక ఫస్ట్ - క్లాస్ మొయిన్ - ఉద్ - దౌలా గోల్డ్ కప్ టోర్నమెంట్ లో పోటీ పడ్డాయి. వారు మొత్తం ఎనిమిది మ్యాచ్లు ఆడారు. మొదటి ఆరు డ్రా అయ్యాయి, చివరి రెండు మ్యాచ్లను ఓడిపోయారు. 1964 - 65లో ఫైనల్ లో అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీ వారి 253 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా విజేతలుగా ప్రకటించారు[14] 1966 - 67లో వారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేతిలో 16 పరుగుల తేడాతో ఓడిపోయారు.[15]
ఇండియన్ స్టార్లెట్స్ జట్టు వారి 16 మొదటి తరగతి మ్యాచ్ లలో మొదటి 14 మ్యాచ్ లు డ్రా అయ్యాయి. చివరి రెండు మ్యాచ్ లు ఓడిపోయింది.
స్టార్లెట్స్ జట్లు 1973లో మలేషియా , 1978 - 79లో శ్రీలంక కూడా పర్యటించాయి , అయితే ఈ పర్యటనలో ఏ మొదటి తరగతి మ్యాచ్ ఆడలేదు.[16]
సూచనలు
మార్చు- ↑ Wisden 1961 p. 890.
- ↑ Sudhakar Adhikari at Cricket Archive
- ↑ Prem Bhatia at Cricket Archive
- ↑ Dinabandu at Cricket Archive
- ↑ Habib Ahmed at Cricket Archive
- ↑ Harcharan Singh at Cricket Archive
- ↑ Gulshran Rai Mehra at Cricket Archive
- ↑ Madan Mehra at Cricket Archive
- ↑ Chatta Ramesh at Cricket Archive
- ↑ Ponnuswami Sitaram at Cricket Archive
- ↑ Indian Starlets batting 1959-60
- ↑ Indian Starlets bowling 1959-60
- ↑ Andhra Chief Minister's XI v Indian Starlets 1962-63
- ↑ Indian Starlets v State Bank of India 1966-67
- ↑ Associated Cement Company v Indian Starlets 1964-65
- ↑ "Other matches played by Indian Starlets". Archived from the original on 2015-10-03. Retrieved 2017-09-09.