లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం, హైదరాబాదు

లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం అనేది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఒక బహుళ ప్రయోజన క్రీడా మైదానం. దీనిని గతంలో ఫతే మైదాన్ అని పిలిచేవారు. ఈ స్టేడియం ప్రధానంగా క్రికెట్, ఫుట్‌బాల్ క్రీడలకు ఉపయోగించబడుతుంది.[1]

ఎల్బీ స్టేడియం
ఫతే మైదాన్
లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం
మైదాన సమాచారం
ప్రదేశంహైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
స్థాపితం1950
సామర్థ్యం (కెపాసిటీ)30,000
యజమానితెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ
ఆపరేటర్తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ
వాడుతున్నవారుఫతే హైదరాబాద్ ఎఫ్.సి., హైదరాబాద్ క్రికెట్ జట్టు
ఎండ్‌ల పేర్లు
Pavilion End
Hill Fort End
అంతర్జాతీయ సమాచారం
మొదటి టెస్టు1955 19 November,:
 India v  న్యూజీలాండ్
చివరి టెస్టు1988 2 December,:
 India v  న్యూజీలాండ్
మొదటి ODI1983 10 September,:
 India v  పాకిస్తాన్
చివరి ODI200319 November,:
 India v  న్యూజీలాండ్
ఏకైక మహిళా టెస్టు1995 10–13 December:
 India v  ఇంగ్లాండు
మొదటి WODI1978 8 January:
 ఇంగ్లాండు v  న్యూజీలాండ్
చివరి WODI2003 13 December:
 India v  న్యూజీలాండ్
2019 10 December నాటికి
Source: Lal Bahadur Shastri Stadium, Cricinfo

భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జ్ఞాపకార్థం 1967లో గతంలో ఉన్న స్టేడియం పేరు మార్చబడింది. 2017 ఆగస్టు 19 నాటికి ఇది 3 టెస్టులు, 14 ODI క్రికెట్ మ్యాచ్ లకు ఆతిథ్యం ఇచ్చింది.

చరిత్ర

మార్చు

1687లో గోల్కొండపై ఎనిమిది నెలల ముట్టడి సమయంలో మొఘల్ సైనికులు విశాలమైన మైదానంలో విడిది చేశారు. వారి విజయం తర్వాత, ఈ మైదానానికి ఫతే మైదాన్ (విక్టరీ స్క్వేర్) అని పేరు పెట్టారు.[2] అసఫ్ జాహీ కాలంలో ఫతే మైదాన్ పోలో మైదానంగా ఉపయోగించబడింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు నిలయంగా ఉన్న సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో క్రికెట్ మ్యాచ్‌లను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు ఉండేందుకు స్టాండ్‌లు లేవు. మ్యాచ్‌లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు చెందినవి కానప్పటికీ, ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆధీనంలో ఉన్నప్పటికీ ఫతే మైదాన్‌లో మ్యాచ్‌లు జరిగాయి. మొదటి టెస్ట్ మ్యాచ్ 1955 నవంబరులో న్యూజిలాండ్‌తో జరిగింది. 1967లో ఈ స్టేడియం పేరును లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంగా మార్చారు. 1993లో వెస్టిండీస్, జింబాబ్వే మధ్య జరిగిన హీరో కప్ మ్యాచ్‌లో ఫ్లడ్‌లైట్లను ప్రవేశపెట్టారు. హైదరాబాద్ క్రికెట్ జట్టుకు ఈ స్టేడియం హోమ్ గ్రౌండ్.

2005లో నగరంలోని ఉప్పల్ లో నిర్మించిన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య ODI మ్యాచ్ జరిగినప్పుడు అంతర్జాతీయ క్రికెట్ కోసం లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం ఉపయోగించడం నిలిపివేయబడింది. ఈ స్టేడియం ఇప్పుడు ఇండియన్ క్రికెట్ లీగ్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తోంది. 2008 ఎడెల్వీస్ 20 ఛాలెంజ్ విన్నర్స్ హైదరాబాద్ హీరోస్‌కు హోమ్ గ్రౌండ్.

లాల్ బహదూర్ స్టేడియం హైదరాబాద్‌లోని నిజాం కళాశాల, పబ్లిక్ గార్డెన్స్ మధ్య పోలీస్ కంట్రోల్ రూమ్ వెనుక ఉంది. ఇది అనేక జాతీయ, అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలకు, ముఖ్యంగా ఫుట్‌బాల్, క్రికెట్‌లకు వేదిక.

దాదాపు 25,000 మంది కూర్చునే సామర్థ్యం ఉన్న ఈ స్టేడియంలో స్విమ్మింగ్ పూల్, షాపింగ్ కాంప్లెక్స్, ఇండోర్ స్టేడియం ముఖ్యమైనవి. మైదానంలో ఫ్లడ్ లైట్ సౌకర్యం ఉంది. ఇప్పుడు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ (SATS) గా ఉపయోగించబడుతుంది.

చిత్రమాలిక

మార్చు

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "List of cricket grounds in India", Wikipedia (in ఇంగ్లీష్), 2023-01-18, retrieved 2023-01-23
  2. History Of Fateh Maidan | Lal Bahadur Shastri Stadium | Hyderabad Shaan | V6 News, retrieved 2023-01-24