భావనరుషి

(భావనాఋషి నుండి దారిమార్పు చెందింది)

భావనాఋషిపద్మశాలీ వంశ మూలపురుషుడు. ఆయన సాక్షాత్తూ శ్రీ మన్నారాయణుని అంశగా భక్తుల విశ్వాసం.[1]

జీవిత విశేషాలు మార్చు

ఈయన భృగు వంశమున జన్మించిన "భార్గవ" శ్రేష్ఠుడు. ఆయనకు వేద శిర్షుడు (వేదములకు శిరస్సు వంటివాడు, బహూత్తమ, వస్త్ర బ్రహ్మ, అనేక బిరుదులున్నాయి. సకల లోకాలకు వస్త్రదానం చేసి మానవుల మానప్రాణాలను కాపాడిన ఋషి శ్రేష్ఠుడు. ఈయన శ్రీ మార్కండేయుని పుత్రుడు. ఆయన శ్రీ భావానారాయణ స్వామిగా పిలువ బడుతున్నాడు. ఆయన వైశాఖ శుద్ధ పంచమి మృగశిర నక్షత్రంలో జన్మించారు.

వంశక్రమము మార్చు

దక్ష ప్రజాపతి పుత్రిక ఖ్యాతీ దేవిని భృగు మహర్షి వివాహం చేసుకొనిరి. వారి సంతానం ధాత, విధాత, శ్రీ మహాలక్ష్మీ. మహాలక్ష్మిని మహా విష్ణువు వివాహమాడెను. (దుర్వాస మహాముని శాపవశమున విష్ణువుని వీడి తిరిగి సముద్రమున జన్మించెను[2]) ధాత-ఆయతిల సంతానం ప్రాణుడు మర్క్యు దధీచీ. విధాత -నియతీ దేవిల సంతానం మృఖండ మహర్షి, మనస్విని (ముద్గల మహర్షి పుత్రిక). మృఖండ మహర్షికి శివుని వరప్రసాదమున బ్రహ్మజ్ఞాని అయిన మార్కండేయుడు జన్మించెను. మార్కండేయుడు, దూమ్రావతి లకు భావనా ఋషి, పంచమా ఋషి జన్మిస్తారు. వారిలో జ్యేష్టుడైన భావనాఋషి శ్రీమన్నారాయణుని అంశ, చేతిలో సహస్ర దళ పద్మము ధరించినవాడై ఉద్భవించేను. అతను జన్మతః సకల శాస్త్రా ప్రావీణ్యుడు, బ్రహ్మ సమానుడు కనుక "వేద శీర్షుడు" అని కొనియాడగా శ్రీ మన్నారాయణుని మనసున కలిగిన భావాన శక్తికి రూపం కనుక "భావనారాయణ" అని నామకరణం చేసిరి. శ్రీ భావానారాయణ స్వామి వైశాఖ శుద్ధ పంచమి మృగశిర నక్షత్రంలో జన్మించారు. ఇతడు కాలువాసురుడు అనే రాక్షసుడిని సంహరించటమే కాకుండా నగ్నత్వాన్ని ఛేదించినవాడై వస్త్ర సృష్టి చేసి సకల లోకాలకు పూజ్యుడైనాడు.

మార్కండేయుడు అల్పాయుష్షు గురించి తెలుసుకొని తపస్సు చేసి శివుని నుంచి చిరంజీవిగా వరం పొందుతాడు. అదే సమయంలో దేవతలు, మునీశ్వరులు వస్త్రాలు లేక తమ దీన స్థితిని విష్ణుమూర్తికి మొరపెట్టుకుంటారు. మార్కండేయుని సంతతియే వారి దీన స్థితిని తొలగిస్తారని విష్ణువు అభయమిచ్చి పంపుతాడు. దేవతల కోరిక మేర మార్కండేయుడు తన ఆయుష్షంత ఆయుష్షుకల్గిన దూమ్రావతిని పెళ్ళి చేసుకొని పుత్ర కామేష్టి యాగం చేయగా భావనా ఋషి, పంచమా ఋషి జన్మిస్తారు. వీరు పెరిగి పెద్దవారై ఏమి పనిచేయాలని తండ్రిని అడుగుతారు. శివుని ఆజ్ఞమేర విష్ణువు దగ్గరకు వెళ్లమని చెపుతాడు మార్కండేయుడు. అదే సమయంలో దేవతలు, మునీశ్వరులు వస్త్రాలు లేక తమ దీన స్థితిని విష్ణుమూర్తికి మొరపెట్టుకుంటారు. మార్కండేయుని సంతతియే వారి దీన స్థితిని తొలగిస్తారని విష్ణువు అభయమిచ్చి పంపుతాడు. దేవతల కోరిక మేర మార్కండేయుడు తన ఆయుష్షంత ఆయుష్షుకల్గిన దూమ్రావతిని పెళ్ళి చేసుకొని పుత్ర కామేష్టి యాగం చేయగా భావనా ఋషి, పంచమా ఋషి జన్మిస్తారు. వీరు పెరిగి పెద్దవారై ఏమి పనిచేయాలని తండ్రిని అడుగుతారు. శివుని ఆజ్ఞమేర విష్ణువు దగ్గరకు వెళ్లమని చెపుతాడు మార్కండేయుడు. ఇదంతా దైవకార్యమేనని తెలుసుకొని పులిచర్మం కోసం భావనాఋషి భద్రావతి దగ్గరకు వెళ్లి పులులను తెస్తుండగా, నారదుడు ప్రేరేపించగా కాలువాసురుడనే రాక్షసుడు ఎదురు వచ్చి భావనాఋషితో యుద్ధానికి దిగుతాడు. ఆ యుద్ధంలో భావనాఋషి అలిసిపోగా అతని చెమట నుంచి కూనపులి జన్మించి భావనాఋషికి యుద్ధంలో సహాయం చేస్తాడు. కాలువాసురున్ని యుద్ధంలో సంహరించి అతని దేహ భాగాలతో మగ్గం నిర్మించి వస్త్రం నిర్మిస్తాడు. ఆ తర్వాత దేవతల కోరిక మేరకు భావనాఋషి భద్రావతిని పెళ్ళి చేసుకొని నూట ఒక్క మంది సంతానానికి జన్మనిస్తాడు. వీరంతా పద్మశాలీలుగా పిలువబడుతూ నూటొక్క గోత్రాలుగా వర్ధిల్లుతున్నారు..

పద్మసంహిత గ్రంథమూల చరిత్ర మార్చు

పూర్వం కాలువాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మవరం పొందినవాడై సకల దేవతలను మానవులను హింసించుచుండెను అందరు వాడి నుండి విముక్తి కొరకు మహా విష్ణువుని ప్రార్థించగా తన వంశజుడు ఋషి శ్రేష్టుడు భార్గవుడు అయిన మార్కండేయుడిని యజ్ఞము చేయవలసినదిగా కోరెను. బ్రహ్మచారి అయిన మార్కండేయునకు అగ్ని తన పుత్రిక అయిన దూమ్రావతిని ఇచ్చి వివాహం చేసెను. వారు సకల దేవతా సమక్షమున "మహా వారుణిక" అను యజ్ఞము చేసిరి. యజ్ఞఫలము హోమం నుంచి ఆజానుబాహుడు, తేజోమూర్తి అయోని సంభవుడు అయిన శ్రీ మహా విష్ణువు అంశగా "వేద శీర్షుడు" భావనారాయణుడు ఉద్భవించెను. అతనికి సూర్య పుత్రిక అయిన "భద్రావతీ దేవి"ని ఇచ్చి వివాహం చేసిరి. మానవాళికి నగ్నత్వం నుంచి విముక్తి కలిగించదలచి మహావిష్ణువు నాభి యందలి పద్మము (కమలము) యందలి తంతువులు గ్రహించి ఓతము (ఋగ్వేదం) - పడుగు, ప్రోతము (అధర్వణ వేదం) -ప్యాక అను వేదసారమున యంత్రములు సృష్టించి ధర్మ పత్ని సమేతుడై "మణిపురము"న గృహము నిర్మించి చైత్ర శద్ధ పంచమి రోజున మొట్టమొదటి "లక్ష్మీ విలాసం" అను ఉత్కల పౌష్టిక వస్త్రములు సృష్టించెను. వాటిని లక్ష్మీనారాయణులకు సమర్పించగా ఆనందభరితములైన వారు సకల సంపదలు ఒసంగి పద్మ బ్రహ్మ, బహోత్తమా అను బిరుదాంకితం చేసిరి.

బ్రహ్మసరస్వతులకు సమర్పించగా సంతోషమున 64 కళల సారస్వతమును అఖండ బ్రహ్మ జ్ఞానమును ఒసంగెను. శివ పార్వతులకు సమర్పించగా గౌరిదేవి మృత సంజీవని విద్య శాంభవీ విద్యలను అనుగ్రహించెను. శివుడు పులిచర్మం కోరగా పెద్దపులిని చూసి నఖఃశిక పర్యంతం శుభ్రంచేసి సమర్పించెను. అంతట సంతోషించి పెద్దపులి వాహనం పెద్దపులి ధ్వజం అందించెను. సకల దేవతలు సంతోషభరితులై 36 బిరుదులు బహూకరించెను. మహావిష్ణువు వేద శీర్షుణకు నూరు పద్మములు ఇచ్చెను. వాటి ప్రసాదమున నూరు మంది మహర్షులు సంతానం కలిగిరి.

శ్లోకం: అజరాశ్చతయోః పుత్ర పౌత్రష్చ బహవో భవన్! మార్కండేయ సమాఖ్యాతాః ఋషయో వేద పారగా!!

తాత్పర్యం: భావనారాయణునకు పుత్రులు, పౌత్రులు కలిగి వారు మార్కండేయుని వలె అఖండ మేధోసంపన్నులై, ఋషుశ్రేష్టులు, వేదపారంగతులు, పద్మశాలీ వంశ మూల పురుషులు అయ్యారు. భావానారాయణుడు పుత్ర సమేతుడై కాలువాసురునితో యుద్ధం చేసి అతి భయంకర యుద్ధమున "మహా నారాయణ అస్త్రం" ఉపయోగించి కాలువాసురుని సంహరించెను. అంతట సకల దేవతలు ప్రత్యక్షమై పుష్పవర్షం కురిపించగా సకల జనులు జయ ధ్వానాలు పలికెను అంతట మహా విష్ణువు ప్రత్యక్షమై ఇలా పలికెను.

శ్లోకం:స్మేరా వనస్తతశ్చాః వచనం ప్రతిజ్ఞకాః 'భవత్కుల ప్రసూతాయే తే సర్వే మామకా స్మృతాః'

తాత్పత్యం: ఓ భావనారాయణా నీకు ఒక వచనం ప్రతిజ్ఞ చేయుచున్నాను. నీ వంశమున పుట్టిన వారందరు నా వంశము వారే నా మతము వారే అవుతారు.

శ్లోకం: యువాంతు పద్మకోశియైః పూజనీయ ద్విజాదిభిః యోవైన పూజ్యతే తౌతు మమ ద్రోహి భవేదృవం'

తాత్పర్యం:పద్మకోశమున (పద్మశాలీ) కులమున పుట్టిన వారందరు బ్రాహ్మణాది చాతుర్వర్ణములచే సమస్త కులములచే సమస్త జాతులచే పూజింపతగినవారై ఉన్నారు. అట్లు పూజింప తగిన మిమ్ములను పూజింపని వారు నాకు ద్రోహం చేసినవారే అవుతారు అని పలికెను.

పద్మశాలి వంశ స్థాపన మార్చు

శ్రీ భావనాఋషి పుత్రులు వంద మంది శత మార్కండేయులుగా కొనియాడబడినవారైరి. వారి పుత్రులు: మహా పద్ములు., పద్మశాఖీయులు., పద్మశాలీయులు., పద్మ కువిందులు అనే బిరుదులతో కీర్తింబడగా వారే నేడు పద్మశాలీయులుగా పిలవబడుతున్నారు.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "కూనపులి అంతరించాల్సిందేనా?". -బసాని సురేష్‌,తెలుగు విశ్వవిద్యాలయం. నవతెలంగాణ. 21 April 2015. Archived from the original on 6 సెప్టెంబర్ 2019. Retrieved 12 May 2016. {{cite news}}: Check date values in: |archive-date= (help)
  2. "శ్రీమద్దేవీ భాగవతం"

ఇతర లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=భావనరుషి&oldid=3907202" నుండి వెలికితీశారు