పద్మశాలీలు

పద్మశాలి / పద్మబ్రాహ్మణ / భార్గవ బ్రాహ్మణ భారతదేశంలో ఒక సామజిక వర్గం మరియు ఒక కులం.

పద్మశాలి / పద్మబ్రాహ్మణ / భార్గవ బ్రాహ్మణ భారతదేశంలో ఒక సామజిక వర్గం, ఒక కులం.

పద్మశాలీ చరిత్రసవరించు

పద్మశాలీ అను నామము యొక్క అర్థము , వివరణసవరించు

పద్మశాలీ (సంస్కృతాంద్ర పదము) : లక్ష్మి పొందుట వలన ప్రకాశించుట ( బహువచనమున లేదా వ్యక్తివాచకమున ప్రకాశించువారు) లింగభేదమున బ్రహ్మ పొందుట వలన ప్రకాశించుట (బహువచనమున లేదా వ్యక్తివాచకమున ప్రకాశించువారు) వెరసి పద్మముద్వారా ప్రకాశించుట లేదా ప్రకాశించువారు (బహువచనమున లేదా వ్యక్తివాచకమున).

పద్మశాలీ అను నామము యొక్క వివరణను అమరకోశం ద్వారా గ్రహిస్తే అది ఈ విధంగా ఉంటుంది.

పద్మశాలీ అనునది రెండు పదముల కలయిక (సంస్లిష్ట వాక్యము) పద్మము, శాలి (లీ) (పద్మ+శాలి (లీ) = పద్మశాలి (లీ) )

వాక్యములకు అమరకోశము వివరణ ఇవ్వలేదు కేవలం పదములకు మాత్రమే వివరణ ఇస్తుంది.

పద్మ (ము) : "పద్యతేఁ త్ర లక్ష్మీరితి పద్మ:" (అమర కోశము) దీని యందు లక్ష్మి (లక్ష్మి అనగా వృద్ది అను ఒక అర్థము కలదు) పొందును. లింగ భేదమున బ్రహ్మ (బ్రహ్మ అనగా వృద్ది అను ఒక అర్థము కలదు) పొందును. (లక్ష్మి, బ్రహ్మ ఈ రెండు సమానార్థకములు, ఈ ఇద్దరిని అన్నా చెల్లలుగా పండితులు చెపుతారు. లక్ష్మి బ్రహ్మలు, సరస్వతి శివుడు, పార్వతి విష్ణువులను అన్నా చెల్లలుగా పండితులు వివరిస్తారు. ఇందుకు గల కారణం ఏమనిన ఒకే తత్వమును వీరు కలిగి ఉండుట వలన ఈ విధంగా పండితులు వివరించడం జరిగింది.) తెలుగులో కూడా ఇదే అర్థము వచ్చును.

శాలి : "శాల్యన్తే శ్లాఘ్యన్తే జనైరితి శాలయః (శాలి)" జనుల చేత పొగడబడునది. ( ఈ శాలీ (లి) అను పదము విశేషణ పదము. ఈ పదము పూర్వ పదము యొక్క విశేషణమును వివరించును.) తెలుగులో శాలి (లీ) అనగా ఒప్పారునది లేదా ప్రకాశించునది. అని అర్థము.

పద్మశాలీ (లి) అనాగా వృద్ది పొందుట వలన పొగడ బడినవారు లేదా వృద్ది పొందుట వలన ప్రకాశించిన వారు అని అర్థము. ఇక్కడ వృద్ది అనగా సృష్ఠించుట, పైకి ఎగబ్రాకుట, మార్పుచేయుట, కొత్తదానిని ఆవిష్కరించుట మొ|| లగు నానార్థములు ఉన్నాయి. అన్ని కూడా అత్యుత్తమమైన ప్రతిభ కల్గిన అని మూలార్థము. పద్మశాలి అనునది ఒక బిరుదు. ఇలా బిరుదు పొందిన వారి సమూహమును పద్మశాలీలు అని అంటారు.

పద్మశాలి ఎవరు?సవరించు

భృగువంశ సంజాతుడు అయిన మార్కాండేయమహాఋషి ఔరస పుత్రుడు అయిన వేదశీర్షుడే (భావనాఋషి) ఈ పద్మశాలి. వస్త్ర నిర్మాణము చేసి దేవ, ఋషి, మానవాదుల మానములను సంరక్షించుట వలన సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ద్వారా ఈయన ఈ బిరుదును పొందాడు. ఇలా పొందిన మొట్టమొదటి వ్యక్తి కూడా ఈయనే. (వస్త్ర నిర్మాణమును దేవల మహర్షి, జిహ్వేశ్వరుడు లాంటి మహాత్ములు చేసినా, ఈ బిరుదాన్ని పొందిన మాత్ముడు మాత్రం భావనాఋషి మాత్రమే.) ఈ పద్మశాలీ అను బిరుదాన్ని భావనాఋషి నూర్గురు పుత్రులు కూడా పొందడము వలన ఈ సమూహాం పద్మశాలి కులం అయ్యింది. (కులము అనగా కులం కోలతి సంఘీభవ అనేన ఇతి కులం అని అమరకోశ వాక్యం. అనగా సజాతీయ ప్రాణుల సమూహాన్ని కులం అంటారు. ఇక్కడ పద్మశాలి బిరుదు అనే సజాతీయాన్ని కలిగి యున్నారు కావున వీరి సమూహం పద్మశాలి కులముగా మారినది. మూలము మాత్రం భార్గవమే!)

కులం యొక్క మూలాలుసవరించు

పురాణములయందు వంశ ప్రస్థావనసవరించు

పద్మశాలీ వంశము (కులము)నకు మూలము భృగు వంశం. ఈ భృగు వంశమును భార్గవ వంశం అంటారు. (భృగోరపత్యం భార్గవ: అని అమరకోశం భార్గవ పదము యొక్క వివరణ ఇచ్చింది. అనగా భృగు వంశము కావున భార్గవ: సమస్త భృగు వంశము భార్గవ వంశముగానే పిలవబడుతుంది. సమస్త భృగువంశమును భార్గవ వంశముగానే సంభోదింపవలయును) భృగువు నుంచి ప్రారంభం అయిన వంశం మార్కండేయ మహాఋషి యొక్క పుత్ర, పౌత్రుల ద్వారా పద్మశాలిగా మారింది. ఈ వంశమునకు మూలపురుషుడు మార్కండేయ మహాఋషి ఈయనద్వారానే ఈ కులం లేదా వంశం ఏర్పడింది.

బృగు (భార్గవ) వంశ ప్రస్తావన సమస్త పురాణేతిహాసముల యందు ఉంది. కేవలం పద్మశాలీ (లి) (మార్కండేయ) వంశ లేదా కుల ప్రస్తావన మాత్రము మార్కండేయ పురాణం రుద్రసర్గం నందు, విష్ణు పురాణం, ప్రథమఖండం, ధశమాద్యాయమందు, వాయు పురాణం ఋషివంశ వర్ణనమందు, పద్మ పురాణం, ఉత్తరఖండం, మాఘస్నాన ఫలంలో, ఇతిహాసం అయిన మహాభారతం ఆదిపర్వం, ద్వితియఖండం నందు, ఉపపురాణం అయిన భార్గవ పురాణమందు, ఇంకనూ కులపురాణం అయిన భావనారాయణ చరిత్రయందు ఈ పద్మశాలి (లీ) (మార్కండేయ వంశ (కుల) ప్రస్తావనలు ఉన్నాయి.

పద్మశాలి(లీ) వంశ క్రమముసవరించు

ప్రలయకాలం తర్వాత సృష్టి పున:ప్రారంభం అవుతుంది. ఇలా చాలా ప్రలయాలు జరిగాయి. ఆ క్రమంలోనే ప్రస్తుతం నడుస్తున్న సృష్టి ప్రారంభంలో శ్రీ మహావిష్ణువు నాభి నందుండి కమలం ఉద్భవించింది. దానినుండి సృష్టి కర్త అయిన బ్రహ్మగారు ఉద్భవించారు. బ్రహ్మగారు తనతో సమానమైన పుత్రులను కొందరిని సృష్టి చేసారు. అందులో తొమ్మండుగురు ముఖ్యులు వారు భృగు, మరీచి, అంగీరసుడు, అత్రి, పులస్త్య, పులహు, కశ్యప, ధక్ష, క్రతువు (ఈ క్రమము ఒక్కో పురాణమునందు ఒక్కొక్క విధముగా ఉంటుంది. కాని అన్నింటియందు కూడా భృగువు ఉన్నాడు, భృగువే ప్రథముడుగానే ఉన్నాడు.)

ఈ భృగువు యొక్క వంశం ముఖ్యంగా మూడు వంశములుగా వృద్ది చెందింది ఆ వంశాలు శాఖోపశాఖలుగా వృద్ది చెందాయి. మొదటి భార్య ఖాతి ద్వారా ఏర్పడినది మొదటి వంశము, రెండవ భార్య ఉషేషణ ద్వారా ఏర్పడినది రెండవ వంశము, మూడవ భార్య పులోమ ద్వారా ఏర్పడినది మూడవ వంశము.

భృగువు యొక్క మొదటి భార్యద్వారా ఏర్పడిన వంశంలోని ఓకానోక శాఖ పద్మశాలి (లీ) వంశము.

మొదటి వంశము :

భృగువు యొక్క మొదటి భార్య కర్దమ ప్రజాపతి, దేవహూతి అను ఋషిదంపతుల పుత్రిక యగు ఖ్యాతీ దేవి. (కొన్ని చోట్ల ధక్షుడు అని కూడా ఉంది కాని ఎక్కువ చోట్ల మాత్రము ఈ కర్దమ ప్రజాపతి అనే ఉంది.)

ఈ ఖ్యాతి, భృగువుల సంతతి శ్రీ (మహాలక్ష్మీ), ధాత, విధాత, ఈ శ్రీ (మహాలక్ష్మి)ని మహా విష్ణువు వివాహమాడెను (ఈ భృగువంశమున జన్నించిన మొట్టమొదటి ఆడపడుచు శ్రీ మహాలక్ష్మి) ధాతా, విధాతలకు మేరు పుత్రికలు అయిన అయతి`` , నియతి`` అను కన్యామణులు ధర్మపత్నులు. (ధాతకు అయతి, వధాతకు నియతి భార్యలు) ( ఈ ఇరువురు మేరువుకు సహాయకులు గా వ్యవహరించారు. కావుననే వీరి గోత్ర కర్తలు , ప్రవర ఋషులు గా ఎక్కడా కూడా చెప్పబడలేదు) ధాతా అయతిలకు ప్రాణుడు, విధాతా నియతులకు మృకండుడు పుత్రులు(శ్రావణ పూర్ణిమ ఇతని జన్మతిథి) ప్రాణుడికి ద్యుతిమానుడు, అజరుడు అను ఇరువురు పుత్రులు. ఈ భృగువు యొక్క మొదటి భార్య ద్వారా ఏర్పడిన వంశంలో ప్రాణుడి నుండి రెండు శాఖలు ఏర్పడినవి. అవి ఒకటి ధ్యుతిమానుడిది రెండవది అజరుడిది.

విధాత నియతుల పుత్రుడు అయిన మృకండునకు ముద్గల మహర్షి పుత్రిక అయిన మనస్విని (మరుద్వతి) ధర్మపత్ని. (ఈమె ప్రతివతా శిరోమణి. ప్రతివతా నియమాలకు మూలము ఈమే) ఈ మృకండ మనస్వనులకు మాఘ శుద్ద తదియ యందు పద్మకుల దీపకుడు, మృత్యుంజయుడు అయిన మార్కండేయ మహాఋషి జన్మంచాడు. (జన్మ చేత అల్పాయుష్కుడు. తప: శక్తి ద్వారా మృత్యువును జయించి మృత్యుంజయుడు అయినాడు)

మార్కండేయుని ఔరస పుత్రుడు విష్ణు అంశా సంభూతుడు అయిన వేదశిరుడు వైశాక శుద్ద పంచమియందు జన్మించాడు. (వేదశీర్షుడు) (కొన్న చోట్ల మార్కండేయుని భార్య అగ్ని దేవుని పుత్రిక అయిన "దూమ్రావతి దేవి" అని చెప్పబడి యున్నది.) ఈ వేదశిరునకు మరొక నామము భావనారాయణస్వామి. ఈ వేదశిరునకు సూర్యుడు పద్మ ల యొక్క సంతానం అయిన భద్ర (భద్రావతి లేదా భద్రాదేవి) ధర్మపత్ని. వీరికి నూర్గురు పుత్రులు. వీరు తప:శక్తి యందు సాక్షాత్ మార్కాండేయునితో సమానం. భృగువు యొక్క మొదటి భార్య వంశమునందు వేదశిరుడి ద్వారా ఏర్పడిన శాఖ ఇది దీనిని పద్మశాలి (లీ) శాఖ గాను లేదా వంశము గాను పిలవడం జరుగుతుంది. వెరసి ఈ శాఖ లేదా వంశమునకు కోశము (మూలము) భృగువు.

భృగువు యొక్క మిగితా రెండు వంశములు టూకిగా....

రెండవ వంశము :

భృగువు రెండవ భార్య కశ్యప దితి పుత్రిక అయిన ఉశేషణ (ఈమె హిరణ్యాక్ష, హిరణ్యకశిపుల సహోదరి). వీరికి శుక్రుడు (నామాంత్యంలో కావ్యుడు లేదా ఉశేషణుడు, నవగ్రహాల్లో ఒక గ్రహం ఇంకనూ రాక్షసులకు గురువు కూడాను.) సంతానం. ఈ శుక్రునికి దేవరాజు ఇంద్రుడి పుత్రిక జయంతి భార్య. వీరికు ఒక కూతురు దేవయాని, నలుగురు పుత్రులు చండ, అమార్క, అశుర, ధరాతృ (చండమార్కాశురధాతృ). ఈ నలుగురు రాక్షసజాతికి అంతటికి గురువులు.

మూడవ వంశము:

భృగువు మూడవ భార్య పులోమ (దైవత్వం ఉన్న రాక్షస స్త్రీ). వీరికి ఒక కుమారుడు చ్యవనుడు (నెలలు నిండకుండానే చ్యుతి పొందుట వలన) ముగ్గురు కూతుల్లు ఉమా, ఛండి, గౌరి (ఈ ముగ్గురు సాక్షాత్ పార్వతి దేవి అంశలు భృగువు శాపం ద్వారా భృగు పులోమకి సంతానంగా కలిగారు.) ఈ ముగ్గురిని పరమేశ్వరుడే వివాహమాడాడు., ఈ ముగ్గురు భృగువంశములో పుట్టిన రెండవ స్త్రీ సంతానం. చ్యవనుడికి సంయాతి రాజు పుత్రి సుకన్య ద్వారా 100 పుత్రులు కలిగారు వారిలో దదీచి, ప్రమతి ముఖ్యులు. ధధీచికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య ఆలంభస ద్వారా సారస్వతుడు, రెండవభార్య సువర్చల ద్వారా పిప్పలాదుడు సంతానం. పిప్పలాదునికి అనవన్య రాజు కుమార్తే పద్మ భార్య. చ్యవనుడి పుత్రుడు అయిన ప్రమతికి ఘృతాచి అను అప్సరస ద్వారా రురు అను కుమారుడు. ఈ రురుకు స్థూలకేశి ముని కుమార్తే ప్రమధ్వర ద్వారా అప్నువానుడు, శునకుడు పుత్రులు. ఈ శునకుడికి శౌనకుడు పుత్రుడు. (ఏ వ్రతం చేసినా, అన్ని పురాణములలో వినపించే పేరు ఈ శౌనకుడిదే). అప్నువానునికి ఋచీకమహర్షి పుత్రిక ఋచి ద్వారా ఔర్వుడు. ఈ ఔర్వునికి ఔరస పుత్రుడు ఋచీకుడు. ఈ ఋచీకునికి గాధిరాజు కుమార్తే సత్యవతి ద్వారా జమదగ్ని పుత్రుడు. ఈ జమదగ్నికి రేణుక దేవి (ఎల్లమ్మ) ద్వారా ఐదుగురు పుత్రులు. వీరిలో చిన్నవాడు పరుశరాముడు. ఈయన సాక్షాత్ శ్రీమహావిష్ణువు యొక్క అంశ. 21 వ సార్లు భూమండలం మీద దండ యాత్రచేసి యావత్ భూమండలాన్ని కైవసం చేసుకున్నాడు. సహస్ర బాహు అయిన కార్తవీర్యార్జునిని తుదముట్టించిన మహా ఘనుడు.

పద్మశాలీ వంశ (కుల) కారకులుసవరించు

భృగు మహర్షిసవరించు

భగవద్గీత యందు శ్రీ కృష్ణ పరమాత్మ భృగువు గూర్చి ఇలా పలికెను శ్లో: మహర్షీణాం భృగురహం! తా: మహర్షులలో భృగువును నేనే భృగువు మొట్టమొదటి జ్యోతిష్య శాస్త్రవేత్త. మొట్టమొదటి జ్యోతిష గ్రంథం "భృగు సంహిత" రచించెను. ఇందులో యాభై లక్షలకు పైగా రకాల జీవరాసుల జాతకములు పొందుపరచబడింది. సనాతన ధర్మ సంప్రదాయములకు మూలాధారం అయిన మొట్టమొదటి స్మృతి ధర్మం"మనుస్మృతి" ఇది భృగుప్రోక్తమే..

ఈ భృగువు త్రిమూర్తుల సైతం పరీక్షించిన మహా తప:శక్తి శాలి. పాదమందు శివుడి వలే త్రినేత్రం కలిగి, దాని వల్ల గర్వాందుడై బ్రహ, రుద్రాదులను శపించి, విష్ణువు వక్షస్థలమున తన్నుట ద్వారా శ్రీవత్సం అను మచ్చ ఏర్పడింది. అందువలననే శ్రీ మహా విష్ణువునకు శ్రీవత్సుడను నామం ఏర్పడింది. (ఈ కారణం వల్లనేమో అమ్మవారి యొక్క గోత్రం శ్రీవత్స గోత్రం), అదే విష్ణువు చే గర్వభంగం పొంది ముక్తి పొందాడు. దక్ష యజ్ఞమునకు భృగువే యజ్ఞబ్రహ్మ, ఈ యాగం (నిరీశ్వర) చేయించుట వలన కృద్దుడైన వీరబద్రుడి ఆగ్రహానికి గురై గడ్డాలు మీసాలు ఉడపెరికించుకున్నారు.

మార్కాండేయుడుసవరించు

మార్కాండేయం భృగు నప్తారం విధాతా పౌత్రమకల్మశం| మృకండాత్మజం వందే వేదశిర తథం తపోనిధిం||

భృగువంశమునకు చెందినవాడు, విధాతకు మనుమడు, మృకండునకు పుత్రుడు వేధశిరునకు తండ్రి అయిన మార్కండేయుడు ఋషులలో నిధివంటివాడు.

జన్మచేత అల్పాయుష్కుడు అయిన మార్కాండేయుడు శివుడిని మెప్పించి మృత్యుంజయుడు అయినాడు. మార్కాండేయుని ప్రస్తావన లేని పురాణేతిహాసాలు లేవంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఎన్నో కల్పాలను చూసిన తప:శాలి. ఈతడు దేవి ఉపాసన చేసినట్టుగా మార్కాండేయ పురాణం ద్వారా అవగతమౌతుంది. మార్కాండేయ పురాణాంతర్గతమైన చంఢి సప్తశతి యందు మొట్టమొదటి మంత్రం ఓం ఐం మార్కాండేయాయ నమ: , గౌరి అష్టోత్తరమునందు అమ్మవారిని ఓం మార్కాండేయ వరప్రదాయై నమ:`` అను మంత్రముల ద్వారా ఈ మార్కాండేయు శాక్తేయుడనియు, మహా తప:శాలి అనియు అవగతం అవుచున్నది.

వేదశీర్షుడు (భావనాఋషి)సవరించు

మార్కండేయ మహర్షికి ఔరసపుత్రుడు భావనాఋషి (వేదశీ (రు)ర్షుడు). వస్త్రవిద్యను కాలుడు అనే రాక్షసుడు అపహరించి దేవాది సమస్త గణముల మాన సంరక్షణను వినాశనం చేయుట వలన ఆ రాక్షసుడిని సంహరించి, దేవ మానవ మానాలను కాపడిన మహానుభావుడు. యంత్రము ద్వారా వస్త్రమును తయారు చేసిన మొట్టమొదటి వ్యక్తిగా చరిత్రక్కెక్కిన ఘణుడు. సూర్య పద్మినల సంతానం అయిన బద్రావతి దేవిని వివాహం చేసుకొని గోత్రకర్తలు కుమారులను శతాధికంగా కన్నాడు. ఈ శతాధిక పుత్రులే పద్మశాలీ కుల కారకులు. ఈతడే మొదటి పద్మశాలి., ఇతని పుత్రులు కూడా పద్మశాలి బిరుదును పొంది ఈ కుల కారకులు అయ్యారు. ఈతను భావనోపనిషద్ అనే ఉపనిషత్త్ కి మంత్ర ద్రష్ఠ. (వామాచార విధానాన్ని ప్రోత్సహించుట వలన ఈ ఉపనిషత్త్ అంతగా ఆదరణపొందలేదు.) ఈతను సాక్షాత్ శ్రీ మహావిష్ణు అంశగా పురాణాలు వివరిస్తున్నాయి.

అమ్మవారు (లక్ష్మి, సరస్వతి, పార్వతి) పద్మశాలి(లీ)యుల ఆడపచుసవరించు

భృగువుకు ఖ్యాతి ద్వారా శ్రీ (లక్ష్మి) అను పుత్రిక జన్మించింది. అందు వలననే ఆమెను భార్గవిగా పిలవడం జరుగుతుంది. భృగుర్ ఇయం భార్గవ: లింగ భేదమున భార్గవి: అని అమరకోశ వాక్యం అనగా ఇది భృగువు కావున భార్గవ లింగభేదమున భార్గవి అని పిలవబడును. ఈ భృగువంశమున మొట్టమొదటగా అమ్మాయి పుట్టినది అమే లక్ష్మి. అందుకే అమె గోత్రము శ్రీవత్స గోత్రము. నేటికి అమ్మవారి కళ్యాణాదులయందు ఈ శ్రీవత్స గోత్రమునే చెప్పండం జరుగుతుంది.

భృగువుకు పులోమ ద్వారా ఉమా, చండి గౌరి అను మూడు రూపములచే పార్వతిదేవి (భృగువు శాపవశమున పార్వతి దేవి మూడు రూపములుగా ఇదే భృగువుకు కూతురుగా జన్మించినది) జన్మించింది.

అగస్థ్య మహర్షి సరస్వతిదేవిని స్తుతి చేస్తు ... పద్మజా పద్మవంశాచ పద్మరూపే నమోనమ: (సరస్వతి స్తోత్రం 11వ శ్లోకం రెండవపాదం) అనగా పద్మమునందు పుట్టినదానావు, పద్మవంశస్థురాలవు, సాక్షాత్ పద్మస్వరూపానివి అట్టి మీకు నమస్కరిస్తున్నాను అని అర్థం. (పద్మశాలి నామ వివరణ లేదా అర్థములో ఈ పద్మవంశము అనునది వివరించడం జరిగింది.)

ఈ మూడు స్వరూపాలు (లక్ష్మి, పార్వతి జన్మచేతను, సరస్వతి తత్వము చేతను) ఈ వంశమునకు చెందినవారే., 15వ శతాబ్దమున తిరుచానూరు పద్మావతి దేవి ఆలయమందు జరిగిన ఉదంతం ఇందుకు చక్కటి ఆధారం. దేవాంగులకు, పద్మశాలీయులు అమ్మవారు మా ఆడపడుచు అంటే మా ఆడపడుచు అని వాదం ఏర్పండిందట. అప్పుడు శ్రీ తాల్లపాక అన్నమాచార్యుల మనుమడు శ్రీ తాల్లపాక చిన్నన్న గారు ఈ వాదాని తన భుజస్కందాలపై వేసుకొని అమ్మవారి చేత సాక్ష్యం చెప్పిచ్చారు అట. అమ్మవారు స్వయంగా తాను పద్మశాలీ ఇంటి ఆడ పడుచునని పలికెనట. అందుకు గల ఆధారాలు నేటికి తిరుమల తిరుపతి దేవస్థానములయందు రాగి (తామ్ర)శాసనాలు ఉన్నాయి. నేటికి తిరుచానూరు దేవాలయమునందు ఆడపడుచు లాంచనాలు సమర్పించుటకు కేవలం పద్మశాలీయులు మాత్రమే అర్హులు.

అందుకని పద్మశాలీయులను సిరి (లక్ష్మి) కి పుట్టింటివారు హరి (విష్ణువు) కి అత్తింటివారు అని అంటారు. అమ్మవారు పద్మశాలీయుల ఆడపడుచు అను విశయము బాగా ప్రచారం చేసినది పద్మశాలీయ బహుత్తమ సంగం వాళ్ళు.

పద్మావతి అమ్మవారు చెప్పిన ప్రకారం పద్మవతి దేవి అకాశరాజు యొక్క కుమార్తె ఆకాశరాజు క్షత్రియుడు అనగా పద్మశాలీలలో క్షత్రియ వర్ణము కూడా ఉన్నది వీరు పద్మావతి అమ్మవారి వంశస్థులుగా ఆచారాలను పాటిస్తూనాప్పటి మార్కండేయ వంశస్తులుగా ప్రసిద్ధ పొందినారు వీరిలో క్షత్రియ వర్ణం, బ్రహ్మ వర్ణము చెందిన వారు

పద్మ= (అకాశరాజు)చంద్రవంశక్షత్రియుడు

శాలి= (మార్కండేయమహర్షి)భర్గవబ్రాహ్మణుడు ఈ విధంగా పద్మ+శాలి అయివుండవచ్చు

వైశ్యసవరించు

పద్మశాలిలు వస్త్రాలను నెసి వ్యాపారం చేస్తూ ఉంటారు కనుక వీరు కొన్ని చోట్ల వైశ్య వర్ణంగా పరిగణిస్తారు దినికి ఉదాహరణ పుర్వం (పెద్ద శేట్టి- చిన్న శెట్టి) అనగా పేద్ద శేట్టి వైశ్యులు అని చిన్న శేట్టి అనగా పద్మశాలి అనబడుతున్నరు

ఉప కులాలుసవరించు

కోష్ఠి

దెవంగ

కర్ణభక్తలు

ముదలియర్

ఖత్రి

జులుహ

కొరి

సంస్కృతీ సాంప్రదాయాలుసవరించు

మతంసవరించు

పద్మశాలీయులు ప్రస్తుత కాలంలో శైవాచారాలు పాటిస్తున్నారు. కాని వీరి మూలాలు వైష్ణవ సంప్రదాయానికి చెంది యున్నాయి. భార్గవ వంశంలో ఖ్యాతి వంశము (పద్మశాలీ) శ్రీవైష్ణవ (విఖానస సాంప్రదాయం భృగువుద్వారా ఏర్పండింది.)సాంప్రదాయనికి చెందినవారు. (ఉషేశన ద్వారా ఏర్పడిన శుక్ర వంశం పూర్తిగా శైవమునకు సంబంధించింది., పులోమ ద్వారా ఏర్పడిన వంశము శైవ, వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించింది. ఇందు చాలా ఆధారములు కలవు) కాని మార్కాండేయుడు శక్తి ఆరాధకుడిగా ప్రసిద్ధుడు., ఈ మార్కాండేయుడి ద్వారానే శ్రీ చంఢిసప్తశతి అని మంత్రరాజము భహిర్గతము అయినది., ఇతని కుమారుడు అయిన భావన్నారాయణ స్వామి కూడా శక్తి ఆరాధకుడే ఇందుకు భావనోపనిషద్ ఒక చక్కటి ఉదాహరణ.

వేద శాఖసవరించు

వీరు యజు:శ్శాఖీయులు (తైత్తరీయ యజు:శ్శాఖీయులు).

గృహ సూత్రంసవరించు

గృహసూత్రము ఆపస్థభము (కొన్నిచోట్ల భృగు అని కొన్నిచోట్ల మార్కండేయ గృహ్య సూత్రము అని ఉన్నా పెక్కుమంది పెద్దలు ఆపస్తంభ గృహసూత్రమునే గృహసూత్రముగా నిర్ణయించారు. ఇందుకు గల కారణం ఆపస్తంభుడు ఈ వంశములోనివాడే).

ఈ విశయాలు చాలమంది పద్మశాలీయులకు తెలిక పోవడం శోచనీయం.

ఆచారవ్యవహారాలుసవరించు

వీరు ఉపనయణము ద్వారా యజ్ఞోపవీత ధారణ జరుపుకొని నిత్యకర్మ అనుష్ఠాన, యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించుతున్నారు. పూర్వం వీరు మడి ఆచారాలు పాటించే వారనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. వీరిని తడిబట్టలవారు అని సంభోదిస్తారు. (తడి బట్టల కులాలుగా పద్మశాలీయులను, బ్రాహ్మణులను, వైశ్యులను, విశ్వబ్రాహ్మణులను సంభోదిస్తారు.) ఇదోక నానుడి. పూర్వం ఈ వర్గం స్త్రీలు చీరను మడికట్టు విధానంలో కట్టుకునే వారు. స్త్రీ పురుష భేదము లేకుండా గోచి పోసుకొని వస్త్రములు కట్టుకోవడం వీరి కట్టు. వీరిని తిట్టడం లేదా వీరితో తిట్టించుకోవండం కూడా మంచిది కాదనే నానుడి లోకంలో ఉంది.

మరణించిన వారి పార్థివ దేహాన్ని విసర్జించే విధానంసవరించు

చనిపోయిన వారిని వీరు దహనం చేస్తారు. కొన్నిచోట్ల అనగా జనాభా తక్కువాగా ప్రాంతాల్లో, కుల సంఘాలు బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఖననం అనగా పూడ్చడం జరుగుతుంది.

వృత్తిసవరించు

నేటి సమాజములో పద్మశాలీయులు అనేక వృత్తులపై జీవనం గడుపుతున్నారు. పూర్వము కేవలం చేనేత వృత్తిలో జీవనం సాగించేవారు. భారత రాజ్యాంగము వీరిని ఆర్థికంగా వెనుకబడిన తరగతులుగా పరగణించి OBC గా వర్గీకరించిరి.

ఆహారపు అలవాట్లుసవరించు

వీరు 11వ శతాబ్దమునుండి మాంసాహరమును భుజించుచున్నారు అని చరిత్ర చెప్తుంది. అంతకు పూర్వము వీరు శాకాహారులే.

పద్మశాలీ గోత్ర ప్రవరలుసవరించు

పద్మశాలీయు తాము 101 గోత్రలవారము అని చెప్పుకుంటారు. మార్కండేయ గోత్రముతో కలిపి మొత్తం 102 గోత్రాలు ఉన్నాయి. మొత్తానికి వీరికి 102 గోత్రాలు. ఏడు (7) శాఖలు.

1. భార్గవ గణగోత్రము నుండి నలభై ఒకటి (40) 2. అగస్థ్యగణ గోత్రమునుండి ఎనమిది (8) 3. అంగీరస గణగోత్రము నుండి ముప్పైఆరు (36) 4. అత్రిగణగోత్రము నుండి మూడు (3) 5. కశ్యప గణగోత్రము నుండి మూడు (3) 6. వశిష్టగణ గోత్రము నుండి నాలుగు (4) 7. విశ్వామిత్ర గణగోత్రము నుండి ఏడు (7) ఇందులో ఏకార్షేయ ఒకటి (1), ద్వయార్షేయ ఇరవై ఒకటి (21), త్రయార్షేయ అరవై ఒకటి (61), పంచార్షేయ పందొమ్మిది (19) వెరసి 102 గోత్రములు తత్ ప్రవరలు ఉన్నాయి. వీరు సహజంగా మార్కండేయ గోత్రాన్ని చెప్పుకోవడం జరుగుతుంది. మరిచిపోతే మార్కండేయ గోత్రం అనే నానుడి వీరిలో ఉంది. పద్మశాలీయుల గృహనామాలు, గోత్ర ప్రవరలకు సంబంధించిన లంకె ఇక్కడ పొందు పరచబడింది. పద్మశాలీ గోత్ర ప్రవరలు

నామాంత్యములు(ఉపనామాలు)సవరించు

పద్మశాలీయుల ఉపనామాలు 1. భార్గవ (ఇది పురుషులకు), భార్గవి (ఇది స్త్రీలకు) 2. శర్మ 3. ఆచార్య (చారి అనునది కాదు ఇది కేవలం విశ్వబ్రాహ్మణులకు సంబంధించినది) 4. బహుత్తమ (ఇవి శాస్త్ర సమ్మతము అయినవి కావు కాని ప్రస్తుతము వాడుకలో ఉన్నాయి.) 5. అప్ప (ఇవి శాస్త్ర సమ్మతము అయినవి కావు కాని ప్రస్తుతము వాడుకలో ఉన్నాయి.) 6. శెట్టి (ఇవి శాస్త్ర సమ్మతము అయినవి కావు కాని ప్రస్తుతము వాడుకలో ఉన్నాయి.)

ఆశ్రిత కులాలుసవరించు

సాధన శూరులుసవరించు

తెలుగు కులాలలోని కొన్ని కులాలను ఆశ్రిత (కులాలు) జాతులు ఉన్నాయి.పూర్వం కృష్ణగందర్వ అనె రాజు వుండేవాడు.అ రాజుకు యబైనాలుగు రాజ్యలు అధినంలో వుండేవి అ రాజుకు ఎప్పటికీ మరణించకుడదు అని టినే పరిశోధకులు, జానపదవృత్తి గాయకులు అని వ్యవహరిస్తుంటారు. అలాంటి వారిలో సాధనశూరులు, కూనపులి కూడా ఉన్నారు. సాధన చేత శూరులు కావున సాధనశూరులు అంటారు. సాధనశూరులు ఒక గ్రామానికి వచ్చారంటే, ముందుగా భేరి మోతలతో గ్రామంలో తమరాకను తెలియ పరుస్తారు. . వీరు మాయలు మంత్రాల, గారడీలు చేస్తు కేవలం పద్మశాలీయుల దగ్గర మాత్రమే డబ్బులు తీసుకోవడం, వీరి గృహములయందు మాత్రమే భోజనాలు చేయడం ద్వారా వీరికి అంతగా లాభించకపోవడం వీరుకూడా వివిధ వృత్తులను ఆశ్రయిస్తున్నారు.

కూనపులిసవరించు

కూనపులి వారు సమీప గ్రామాలకు వెళ్లి పద్మశాలి కులస్థుల ఇళ్లముందు వీరి దగ్గర ఉన్న పటం (గుడ్డతో తయారు చేసిన పెద్ద చార్టు) ను తగిలించి కథలు చెప్పేవారు. ఈ పటం మీటరు వెడల్పు, ముపై్ప మూరల పొడవుంటుంది. పేపర్‌ రోల్‌ మాదిరిగా చుట్టచుట్టి ఉన్న ఈ పటంలోని ఒక్కొక్క అంశాన్ని వివరించుకుంటూ రాగయుక్తంగా కథ చెప్పుకొచ్చేవారు. ప్రధాన కథకుడు కాళ్లకు గజ్జెకట్టి, చేతిలో చిడతలు పట్టి పటంలోని బొమ్మల సందర్భాలకు అనుగుణంగా కరుణ, „హాస్యం, శృంగారం, రౌద్రం, బీభత్సం వంటి నవరసాలను పండించేవారు. వీరి కుటుంబంలో మహిళలు వంతలు పాడేవారు.హరికథ, బురక్రథ మాదిరి వీరు రాత్రి సమయంలో కథలు చెప్పేవారు కాదు. పగలే కథలు చెప్పేవారు.వీరి దగ్గర ఉన్న పటంలోని చిత్రాలు ప్రేక్షకులకు కనిపించాలి కనుక పగటిపూటను ఎంచుకున్నారు. కనుకనే ఆ రోజుల్లో వీరి కథలు వినటానికి ఆడామగా అంతా ఉదయమే వచ్చి కూర్చునేవారు. వీరు అల్ప సంతోషులు. మూడు పూటలా భోజనానికి ఢోకా లేకుండా కాలం గడవటంతో మరో వృత్తి కాదుకదా, మరో వ్యాపకం కూడా ఎంచుకోలేదు. వీరు పద్మశాలి కులస్థుల దగ్గర కాకుండా మరొకరి దగ్గర ఈ విద్య ప్రదర్శించరు కనుక ఎన్ని గ్రామాలు తిరిగినా పారితోషికం కాదుకదా, భోజనం కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. పద్మశాలి, కూనపులి కులస్థుల మధ్య పెనవేసుకున్న అనుబంధం ఇప్పటికీ చాలా గ్రామాలలో కొనసాగుతోందని చెప్పొచ్చు. కనుకనే కూనపులి కులస్థులు కులధ్రువీకరణ పత్రంకోసం వెళితే వీరికి అధికారులు పద్మశాలి కులం పేరుతో సర్టిఫికెట్‌ ఇస్తున్నారు. గతంలో వీరికి కుల ధ్రువీకరణ పత్రాలు తహసిల్దారులు ఒకపట్టాన ఇచ్చేవారు కాదు. వీరూ పద్మశాలీలతో కలిసి ఉంటారు కనుక పద్మశాలి అని కుల సర్టిఫికెట్‌ ఇచ్చేవారు. కాగా తమకంటూ ఒక కులం ఉన్నప్పటికీ మరో కులం పేరు చెప్పుకోవటమేమిటనే ఆత్మాభిమానంతో కొందరు తమ కులం వివరాలు ప్రభుత్వానికి తెలియజేసే ఉద్యమం నడిపారు. ఫలితంగా 1975లో వీరిని బిసీ-ఎ జాబితాలో చేర్చారు. తమది సంచార జీవనం కనుక ఎస్టీ జాబితాలో తమను చేర్చాలని కోరుతున్నారు

ముఖ్యమైన వ్యక్తులుసవరించు

బాహ్య లంకెలుసవరించు