భువన్ షోమ్ (సినిమా)
(భువన్ షోమ్ నుండి దారిమార్పు చెందింది)
భువన్ షోమ్ 1969, మే 12న మృణాళ్ సేన్ దర్శకత్వంలో విడుదలైన హిందీ చలనచిత్రం. బాలాయ్ చంద్ ముఖోపాధ్యాయ్ రచించిన బెంగాళీ కథ అధారంగా రూపొందిన ఈ చిత్రంలో ఉత్పల్ దత్, సుహాసిని ములే నటించారు. 1969 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఈ చిత్రం జాతీయ ఉత్తమ చిత్రం, జాతీయ ఉత్తమ దర్శకుడు (మృణాళ్ సేన్), జాతీయ ఉత్తమ నటుడు (ఉత్పల్ దత్) విభాగాల్లో బహుమతులను అందుకుంది.[1]
భువన్ షోమ్ | |
---|---|
దర్శకత్వం | మృణాళ్ సేన్ |
రచన | బాలాయ్ చంద్ ముఖోపాధ్యాయ్ |
నిర్మాత | మృణాళ్ సేన్ ప్రొడక్షన్ |
తారాగణం | ఉత్పల్ దత్ సుహాసిని ములే |
Narrated by | అమితాబ్ బచ్చన్ |
ఛాయాగ్రహణం | కె.కె. మహజన్ |
సంగీతం | విజయ్ రాఘవ్ రావు |
విడుదల తేదీ | 1969, మే 12 |
సినిమా నిడివి | 96 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
నటవర్గం
మార్చు- ఉత్పల్ దత్
- సుహాసిని ములే
- శేఖర్ ఛటర్జీ
- సాధు మెహర్
- పున్య దాస్
- రోచక్ పండిట్
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: మృణాళ్ సేన్
- నిర్మాత: మృణాళ్ సేన్ ప్రొడక్షన్
- రచన: బాలాయ్ చంద్ ముఖోపాధ్యాయ్
- వ్యాఖ్యానం: అమితాబ్ బచ్చన్
- సంగీతం: విజయ్ రాఘవ్ రావు
- ఛాయాగ్రహణం: కె.కె. మహజన్
అవార్డులు
మార్చు- జాతీయ ఉత్తమ చిత్రం
- జాతీయ ఉత్తమ దర్శకుడు (మృణాళ్ సేన్)
- జాతీయ ఉత్తమ నటుడు (ఉత్పల్ దత్)
ఇతర వివరాలు
మార్చు- ఇది మృణాళ్ సేన్ తొలి హిందీ చిత్రం.
- ఈ చిత్రానికి అమితాబ్ బచ్చన్ నేపథ్య గాత్రాన్ని అందించాడు.[2][3]
- భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక సంచలనం సృష్టించిన ఈ చిత్రం ఇండియన్ ఆర్ట్ సినిమా లేదా న్యూవేవ్ సినిమాకు నాంది పలికింది.
- దైనందిన జీవితంలో తారసపడే పాత్రలు, సంఘటనలతో కూడా సినిమాలు నిర్మించి వాటిని కేవలం అవార్డులకే పరిమితం చేయకుండా ప్రేక్షకుల మన్ననలు పొందేలా తీర్చిదిద్దవచ్చని ఈ చిత్రం నిరూపించింది.[1]
- ఆధునిక భారతీయ చలనచిత్రాలలో ఒకటిగా గుర్తించబడింది.[4]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 నమస్తే తెలంగాణ, జాతీయ వార్తలు (31 December 2018). "సుప్రసిద్ధ సినీ దర్శకుడు మృణాల్‌సేన్ అస్తమయం". Archived from the original on 7 January 2019. Retrieved 7 January 2019.
- ↑ ఆంధ్రజ్యోతి, సంపాదకీయం (2 January 2019). "వెండితెరపై సామాజిక వ్యాఖ్యాత". Archived from the original on 7 January 2019. Retrieved 7 January 2019.
- ↑ "Before stardom: Amitabh Bachchan's drudge years are a study in perseverance and persona building".[permanent dead link]
- ↑ Mrinal Sen ucla