భూకైలాస్ (1940 సినిమా)
ఇదే పేరుగల మరొక సినిమా కోసం భూకైలాస్ (1958 సినిమా) చూడండి.
1940లో విడుదలైన ఈ భూకైలాస్ చిత్రం మైసూరు శ్రీ సాహిత్య సామ్రాజ్య నాటకమండలి వారి నాటకం యొక్క తెర అనువాదం. అందువలన సన్నివేశ చిత్రీకరణ మొదలైన అంశాలు, రంగస్థల నాటకాన్ని పోలిఉంటాయి. 1958లో విడుదలైన భూకైలాస్ సినిమాతో పోల్చితే ఈ సినిమాలో పాత్రలు వ్యవహారిక భాషనే ఉపయోగించాయి. సుబ్బయ్య నాయుడు రావణుని పాత్రను పోషించగా, నాగేంద్రరావు నారద పాత్రను పోషించి అద్భుతంగా నటించారు. ఆర్. సుదర్శనం సమకూర్చిన సంగీతం సినిమా విజయానికి దోహదం చేసింది. లక్ష్మీబాయి తదితరులు పాడిన "సుమడోలీ.." పాట ఆ రోజుల్లో బాగా ప్రాచ్యురం పొందిందిన సినీ చరిత్రకారుడు రాండర్ గై ఈ సినిమాను సమీక్షించాడు.[1] అప్పట్లో దక్షిణాది రాష్ట్రాల మధ్య అవినాభావ సినిమా సంబంధాలకు అద్దంపడుతూ, ఆంధ్ర దేశంలో బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింన ఈ తెలుగు చిత్రంలో నటించిన నటీనటులు ఆర్.నాగేంద్రరావు, సుబ్బయ్య నాయుడు, లక్ష్మీబాయి, సురభి కమలాబాయి కన్నడవారు. నిర్మాత ఏ.వి.మెయ్యప్పన్ తమిళులు, దర్శకుడు సుందరరావు నాదకర్ణి మరాఠీవారు కావటం విశేషం[2]
భూకైలాస్ (1940 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సుందరరావు నాదకర్ణి |
---|---|
నిర్మాణం | ఏ.వి.మెయ్యప్పన్ |
చిత్రానువాదం | ఆర్.నాగేంద్రరావు |
తారాగణం | ఆర్.నాగేంద్రరావు, ఎం.వి.సుబ్బయ్యనాయుడు, లక్ష్మీబాయి, సురభి కమలాబాయి, రాయప్రోలు సుబ్రమణ్యం, మాస్టర్ విశ్వం |
సంగీతం | ఆర్.సుదర్శనం |
సంభాషణలు | బలిజేపల్లి లక్ష్మీకాంతం |
నిర్మాణ సంస్థ | సరస్వతి సినీ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
పాత్రలు-పాత్రధారులు
మార్చు- రావణుడు గా ఎం.వి.సుబ్బయ్యనాయుడు
- నారదుడు గా ఆర్. నాగేంద్రరావు
- శివుడు గా రాయప్రోలు సుబ్రహ్మణ్యం
- పార్వతి గా హైమవతి
- విష్ణుమాయ గా సురభి కమలాబాయి
- మయాసురుడు గా ఎం. సత్యనారాయణ
- మండోదరి గా లక్ష్మీబాయి
- బాల గణపతి గా మాస్టర్ విశ్వం
పాటలు
మార్చు- అత్యాచారులచేత ధర్మవిలయంబై లోకమల్లాడుచో (పద్యం) - హైమావతి
- ఆసురూప రేఖా ఇదేకా నాధా నీ విలాస రేఖా ఇదేకా - లక్షీబాయి
- ఇదే కదా పార్వతి, శివుని సతికి ఘోరపిశాచి - ఆర్. నాగేంద్రరావు, సుబ్బయ్య నాయుడు
- కమలామనో విహారీ శౌరీ గానసుధాలోలా - ఆర్. నాగేంద్రరావు
- తగదోయి దనుజేంద్ర ఎంత విపరీతంబోయి (పద్యం) - సుబ్బయ్య నాయుడు
- దరియేదో చూచుకోరా మేల్కోరా తరింతువురా - మాష్టర్ విశ్వం
- దేవా జీవాధారా దయరాదా నాపై దయరాదా - లక్ష్మీబాయి
- నడవరే ఆవుల్లారా పొద్దూకిపోయింది పోరే - మాష్టర్ విశ్వం
- నా మాయా నాటకమే జగతి నటకులు జీవులు - సురభి కమలాబాయి
- నా జన్మ నేటికి ధన్యమాయె నామనోరధలత కుసుమించె - లక్ష్మీబాయి
- ప్రేమనందమయా సదయా నామనోరధము ఈడేరు - లక్ష్మీబాయి
- భువనైక జీవా త్రిగుణాను భావ రవి దివసనాధ - పార్వతీబాయి
- మహాదేవా నీ మహిమనే గ్రహింప నేపాటి మహాపరాధిని - సుబ్బయ్య నాయుడు
- మాయలు సాగునే మా యెడల - లక్ష్మీబాయి,ఆర్. నాగేంద్రరావు, సుబ్బయ్య నాయుడు
- శంభోశివ లోకైకగురూ శరణం దేహి మహేశా - సుబ్బయ్య నాయుడు
- శ్రీ సర్వమంగళా ముఖభాసురపూర్ణేం దురిచి - సుబ్బయ్య నాయుడు
- సాంబ సదాశివ చంద్రకళాధర శంభో శంకర - సుబ్బయ్య నాయుడు
- సుమడోలీకేళీ హాళీ ఉయ్యలో జంపాలో - లక్ష్మీబాయి బృందం
మూలాలు
మార్చు- ↑ THE INDIAN MOVIE MOGUL: AV. MEIYAPPAN - Randor Guy Blog[permanent dead link]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-06-03. Retrieved 2010-06-07.